ఎండు ఫలము
ఎండిన పండు అనగా పండు, ఇది అత్యధికంగా అసలైన నీటిని సహజంగా సూర్యుని ఎండలో ఎండబెట్టడం ద్వారా, లేదా డిహైడ్రేటర్స్ లేదా ప్రత్యేక డ్రైయర్స్ ఉపయోగించడం ద్వారా తొలగించబడుతుంది. ఎండిన పండును ఆంగ్లంలో డ్రై ఫ్రూట్ అంటారు. మెసొపొటేమియాలో క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల కిందటే ఎండిన పండ్లను ఉపయోగించే సుదీర్ఘ సాంప్రదాయం ఉంది,, ఎందుకంటే వీటి యొక్క తీపి రుచి, పోషక విలువలు,, సుదీర్ఘ జీవితకాలం దృష్ట్యా ప్రాధాన్యతను ఇచ్చారు.
నేడు, ఎండిన పండ్ల వినియోగం విస్తృతంగా ఉంది. అమ్ముడవుతున్న ఎండిన పండ్లలో దాదాపు సగం ఎండుద్రాక్ష ఉన్నాయి, తరువాత ఖర్జూరాలు, రేగు పండ్లు, అత్తి పండ్లు, ఆప్రికాట్లు, పీచెస్, ఆపిల్స్, బేరి పండ్లు. ఆచార లేక సంప్రదాయ ఎండిన పండ్లకు సూచిక: ఎండలో లేదా వేడి గాలి సొరంగ డ్రైయర్స్ లో ఎండబెట్టిన పండ్లు. క్రాన్బెర్రీలు, బ్లూబెర్రీలు, చెర్రీలు, స్ట్రాబెర్రీలు, మామిడి వంటి అనేక పండ్లను ఎండబెట్టే ముందు తీపి ద్రావకంలో (ఉదాహరణకు సుక్రోజ్ సిరప్) నానబెడతారు. తరచుగా రూపంలో తొక్క ఉన్నట్లుగా ఉండే బొప్పాయి, కివి పండు, పైనాపిల్ వంటి కొన్ని క్యాండీడ్ పండ్లను ఎండిన పండ్ల ఉత్పత్తులుగా అమ్ముతారు.
తాజా పండ్ల యొక్క పోషక విలువలను ఎండిన పండ్లు నిలుపుకోగలుగుతాయి. వివిధ ఎండిన పండ్ల యొక్క నిర్దిష్ట పోషక కంటెంట్ వాటి తాజా పండ్ల మాదిరి తన విధాన ప్రక్రియను ప్రతిబింబిస్తాయి. సాధారణంగా, అన్ని ఎండిన పండ్లు అవసరమైన పోషకాలను అందిస్తాయి, ఆరోగ్య సంరక్షక జీవక్రియాశీల పదార్ధముల యొక్క ఒక శ్రేణి, వీటిని తయారు చేసే విలువైన సాధనాలు ఆహారం నాణ్యత పెంచడానికి, దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయ పడతాయి.
ఎండు ఫలాలు
మార్చునిజానికి ఎండు ఫలాలు అంటే మనకు తెలిసినవి ఎండు ద్రాక్ష, ఖర్జూరాలే. కాని ఇప్పుడు అన్ని రకాల పండ్లు ఎండు ఫలాలుగా దొరుకుతున్నాయి. జీడిపప్పు, బాదం, పిస్తా వంటివి పోషకాల పరంగా ఎండిన పండ్లను పోలి ఉండటంతో ఇవీ ఎండు ఫలాల డబ్బాలో చేరిపోయాయి. నీరసంతో తోటకూర కాడలా వడిలిపోయిన మొహాలు సైతం -గుప్పెడు నమిలితే తేజోవంతంగా వెలగిపోతుంటాయ. అందుకే ఇవి తాజా పండ్లకన్నా శక్తివంతం. ఉదాహరణకు ఆఫ్రికాట్లనే తీసుకుందాం. ఎండబెట్టడం వల్ల నీరంతా పోవడంతో చిక్కబడుతుంది. ఫలితంగా ఓ కప్పు తాజా ఆఫ్రికాట్లు తింటే వచ్చేది 75 క్యాలరీలు మాత్రమే. అదే కప్పు ఎండిన ఆఫ్రికాట్లు అందించేది 313 క్యాలరీలు. అదీగాక ఈ చెక్కరలు వెంటనే రక్తంలో కలిసిపోతాయి. ఇన్‌స్టెంట్ ఎనర్జీ అన్నమాట. మిగిలిన విటమిన్లూ, పీచూ వంటివన్నీ కాస్త తగ్గినా మొత్తంగా అయితే పోవు. తాజా పండ్లలో మాదిరిగానే ఎబి1, బి2, బి3, బి6, పాంథోనిక్, ఆమ్లం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పోటాషియం, సోడియం, కాపర్, మాంగనీసు వంటివన్నీ వీటిల్లోనూ ఉంటాయి. అయితే వాణిజ్య పరంగా చేసే వాటిల్లో రంగు పోకుండా ఉండేందుకు సల్పర్ వాడతారు. ఇది కొందరికి ఆస్తమా కలిగించొచ్చు. అదే ఆర్గానిక్ పద్ధతిలోచేసే వాటిల్లో సల్ఫర్ వాడరు కనుక, ముదురు రంగులో ఉంటాయి.
సుమారు నాలుగైదు కిలోల ద్రాక్ష ఎండబెడితే ఒక కిలో ఎండు ద్రాక్ష అవుతుంది. నేరుగా ఎండలో లేదా ఓవెన్ లేదా డీ హైడ్రైటర్ల ద్వారా పండ్లను ఎండబెడతారు. సి విటమిన్ తగ్గిపోకుండా నిమ్మ, నారింజ, ఫైనాపిల్ రసాలు, లేదా ఆస్కార్బిక్ ఆమ్లంలో ముంచి తీస్తారు. దీనివల్ల రంగు మారదు. ఆపై ఎండబెట్టి పాస్టరైజ్ చేసి నిల్వ చేస్తారు. అయతే, సంప్రదాయ పద్ధతుల్లో ఎండబెట్టినవే మంచివి. ఎండు ఖర్జురాలయితే నీళ్లలో నానబెట్టుకుని త్రాగుతారు. ఎండిన పండ్లలో ఔషధ గుణాలు మెండు. సహజమైన ఔషధాలు, శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. జీర్ణశక్తిని పెంచడంతో బాటు రక్తాన్నీ శుద్ధి చేస్తాయి. అందుకే -ఏ ఎండు ఫలాలునీ వదలోద్దు కొంచెం కొంచెంగా రోజు వారీగా తింటుండండి.
మనకు తెలిసిన ఎండు ఫలాలు, నట్స్‌లో ప్రదానంగా ఎండు ద్రాక్ష, ఖర్జూరం, జీడిపప్పు, బాదంపప్పుల వాడకమే ఎక్కువ. చూడడానికి ఎంతో చిన్నవిగా ఉండే ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిల్లో చెక్కర శాతం ఎక్కువ. అనారోగ్యంతో నీరసించిన వాళ్ళు ఇవి కాసిని తింటే వెంటనే కోలుకుంటారు. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవాళ్ళు -రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్షను గ్లాసు నీళ్లలో రోజంతా నానబెట్టి ఉదయాన్నే తాగి, పండ్లను తినేస్తే సరి. చిన్న పిల్లలకి ఈ నీళ్లు మరీ మంచిది. వయస్సును బట్టి ఆరునుంచి పది ఎండు ద్రాక్షను నానబెట్టి పట్టించాలి. ఇందులో ఐరన్‌కూడా ఎక్కువ. బరువు తక్కువుగా ఉన్నవాళ్లకీ, రక్తహీనతతో బాధపడే వాళ్లకీ మంచిది. జీడిపప్పులో మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువుగా ఉండటంతో ఇవి గుండెకు మేలుచేస్తాయ. పోటాషియం, మెగ్నీషియం, ఫాస్పర్, సెలీనియం, కాపర్, విటమిన్‌లు ఇందులో అధికం. ఖర్జురాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజోలు ఎక్కువ. నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గింజల్ని తీసేసి కనీసం వారానికి రెండుసార్లు తింటే గుండె పదిలమే. ఇందులో కొద్ది పాళ్లలో ఉన్న నికోటిన్ పేగుల్లోని ఇబ్బందుల్ని తొలగిస్తుంది. బాదం బోలెడు పోషకాలకు నిలయం.
శక్తినిచ్చే ఎండు ఫలాలు
మార్చుఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా ఎండు ఫలాలులో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి.
బాదం పప్పు...
మార్చుబాదం పాలు ఎంతో శ్రేష్ఠమైనవి బాదం పప్పు మంచి పోషకాహారం. మామూలుగా మనం తీసుకునే పాలతో పోలిస్తే ఇవి ఎంతో ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. ఆవుపాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు పట్టవచ్చు. బాదం పప్పులో ఇనుము రాగి ఫాస్పరస్ వంటి ధాతువులు, విటమిన్ ‘బి’లు ఆల్మండ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. వీటి రసాయనిక చర్యల వల్ల అధిక శక్తి లభిస్తుంది. రక్తకణాలు, హీమోగ్లోబిన్ సృష్టికి, గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఆల్మండ్‌లు ఎంతగానో తోడ్పడుతాయి. అవి కండరాలు బహుకాలం దృఢంగా, ఎక్కువ కాలం పనిచేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. బాదం పప్పును రోజూ కొద్దిగా నెత్తికి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు, వెండ్రుకలు ఊడటం వంటి వాటికి చక్కటి పరిష్కారం చూపుతుంది. ఎగ్జిమా వంటి చర్మం వ్యాధులకు అడవి బాదంపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం బాదం ఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసి, నీటిలో పేస్ట్‌లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది. బాదం పేస్ట్‌తో, పాలను కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.
జీడిపప్పు...
మార్చుశరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాసియం, విటమిన్ బి, కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అసంతృప్త కొవ్వు పదార్థం గుండె జబ్బులను నివారించే సామర్ధ్యాన్ని కలిగిఉంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం, రాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి.
ఎండు ద్రాక్ష...
మార్చుద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. మంచి పోషకాహర విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి. అదేవిధంగా ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.
ఖర్జూరపు పండ్లు...
మార్చుప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి.
అంజీర్ పండు....
మార్చుఎండిన అంజీర్ పండులో పీచు, రాగి, మంగనీస్, మెగ్నీషియం, పొటాసియం, కాల్షియం, విటమిన్-కె, వంటికి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే‚, ప్లాస్మాలో, యాంటీ ఆక్సిడెంట్ సామ ర్థ్యం గణనీయంగా పెరుగుతు ంది.ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్ పండులో మాత్రమే.
పోషకాహారం
మార్చుమూలాలు
మార్చుచిత్రమాలిక
మార్చు-
Dried apricot paste from Syria
-
Dried fruits as part of the daily diet provide essential nutrients and an array of health protective compounds making them valuable tools to both increase diet quality and help reduce the risk of chronic disease.
-
Nineveh: Procession through groves of date palms, one of the world's first cultivated trees
-
Temple of Nahkt, Egypt. Harvesting grapes, many of which would be dried into raisins.
-
Figs in basket, Pompeii: Dried figs were very popular in ancient Rome.
-
Date: Phoenix dactylifera L.
-
Dried fruits, like fresh are recommended in dietary by all US health agencies
-
Dried fruit, particularly dried plums may promote bone health
-
A dry fruit seller in Armenia.