రుచి లేదా చవి (Taste) మనం భుజించే ఆహారపదార్ధాల ముఖ్య లక్షణం. ఇది పంచేంద్రియాలలో ఒకటి. దీనిని నాలుక గుర్తిస్తుంది. ఇది కేంద్రీయ నాడీవ్యవస్థ యొక్క పని.

జిహ్వా మొగ్గ

అందరికీ పరిచయమైనవి ఆరు రుచులు; వీటిని షడ్రుచులు అంటారు. అవి మధురం అనగా తీపి, ఆమ్లం అనగా పులుపు, లవణం అనగా ఉప్పు, కటువు అనగా కారం, తిక్తం అనగా చేదు, కషాయం అనగా వగరు. అయితే వైద్యశాస్త్రంలో నాలుగు ప్రాథమిక రుచులు చెప్పబడ్డాయి. అవి తీపి, పులుపు, ఉప్పు, చేదు. ప్రపంచంలో భారతీయ ఆహారం చాలా రుచికరమైనదిగా పేర్కొంటారు.

కొందరిలో రుచి పూర్తిగా గాని, పాక్షికంగాని తెలియకుండా పోతుంది. ఇవి కొన్ని వ్యాధుల లక్షణము.

భాషా విశేషాలుసవరించు

తెలుగు భాషలో రుచి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] రుచి నామవాచకంగా Taste, flavour, relish. చవి. Desire, wish, inclination, ఇచ్చ. A ray of sunlight, సూర్యకిరణము. Lustre, light, splendour, రాగము, ప్రభ, కాంతి అని అర్ధాలున్నాయి. రుచించు లేదా రుచియించు v. n. అనగా To be agreeable, to be sweet. ఇష్టమగు. ఉదా: అది నాకు రుచింప లేదు I did not like it. "ఇప్పని నాకున్ సరిపోదు మీకురిచియింపన్ బోలునిప్పట్టునన్." రుచికరము విశేషణముగా Delicious, fine, sweet, agreeable. చవిగల. సారముగల. రుచిగల or రుచి అయిన Tasty, of good flavour, delicious. చవిగల అని అర్ధాలున్నాయి. రుచిచూచు v. a. అనగా To taste. చవిచూచు. రుచిరము లేదా రుచ్యము adj. అనగా Tasty, sweet, pleasing. Charming, beautiful, మనోహరమైన, చక్కని, ఒప్పిదమైన.

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రుచి&oldid=2988179" నుండి వెలికితీశారు