డమరుకం

(ఢమరుకము నుండి దారిమార్పు చెందింది)

డమరుకం (Damaru) ఒక వాద్య పరికరం. దీనిని జానపద కళలలో బుడబుక్కల వారు, ఒగ్గు కథకులు ఉపయోగిస్తారు. బుడబుక్కల వారు దీనిని వాయిస్తున్నందున పల్లెల్లో దీనిని బుడబుక్కల అని కూడ అంటారు. బుడబుక్కలవారు దీనిని వాయిస్తూ..... అంబ పలుకు జగదంబా పలుకూ... ఆకాశవాణీ పలుకు.....;. ఒక చెవి ఆకాశం వైపు పెట్టి ఏదో వినిపిస్తున్నట్టు నటిస్తూ ..... తరువాత బుడబుక్కను వాయిస్తూ ..... ఆ ఇంటి వారికి రాబోయే కష్ట సుఖాలను ఏకరువు పెడతారు.

టిబెట్ డమురుకం

శివుని డమరుకం

మార్చు
 
డమరుకం
 
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో బుడబుక్కల కళాకారుల ప్రదర్శన

ఇది పరమశివుని హస్తభూషణం. శివతాండవం నృత్యంలో బహుళ ఉపయోగంలోంది. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం లయతో నాట్యం చేస్తారు.[1]

రావణుని డమరుకం

మార్చు

రావణుడు శివభక్తుడు. అతను ఎక్కడో దక్షిణ దేశం నుంచి కైలాస పర్వతం దాకా నడుచుకుంటూ శివుని గురించి స్తుతిస్తూ పాడడం మొదలెట్టాడు.అతని దగ్గర ఒక డమరుకం (డోలు) ఉంది, దానితో లయ కూర్చుకుని, అనర్గళంగా 1008 శ్లోకాలు పాడాడు, వాటినే శివతాండవ స్తోత్రాలు అంటారు.[2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. https://telugu.oneindia.com/jyotishyam/feature/what-is-the-name-the-snake-around-lord-shiva-s-neck-233633.html
  2. "శివుడు రావణున్ని కైలాసం నుంచి తన్ని వేయడం!". డ్రూపల్. 2019-02-22. Retrieved 2020-08-30.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=డమరుకం&oldid=4351157" నుండి వెలికితీశారు