శివతాండవం పరమశివుడు ఒనరించిన తాండవ నృత్యం.

ఆనంద తాండవంసవరించు

ఒకనాడు మహాజ్ఞానియైన వ్యాఘ్రపాదుడు తిల్లైవనంలో లింగపూజలు నిర్వహించి పార్వతీసమేతుడైన ఈశ్వరుని తన తాండవ నృత్యంతో సకల భువనాలను ఆనందపరచమని అర్ధిస్తాడు. అతని శివారధనకు ప్రసన్నుడై ఋషి కోరిక తీర్చడానికై, సకల చరాచరకోటికి ఆనందానుభూతిని ప్రసాదించే నాట్యాన్ని ప్రదర్శిస్తాడు. ఆ విధంగా తిల్లైవనంలో బ్రహ్మ ముహూర్తాన శివుడు చేసిన నృత్యాన్ని ఆనంద తాండవం అంటారు.

చిదంబరంలోని నటరాజస్వామి దేవాలయంలోని చిత్ర సభా మండపంలో ఈ నృత్యాన్ని నేటికీ నిర్వహిస్తున్నారు.

ఊర్ధ్వ తాండవంసవరించు

నటరాజు చేసే తాండవ నృత్యాన్ని చూసి ఓర్వలేని దుర్గాదేవి ఒకనాడు కైలాసానికి వెళ్ళి శివుడు చేసే నృత్యాన్ని చూసి తక్కువగా అంచనా వేసి, అపహాస్యం చేసి తనతో నృత్యం చేసి గెలవమంటుండి. ఆ విధంగా తిల్లైవనంలో ముక్కోటి దేవతలు, ఋషిపుంగవుల సమక్షంలో రౌద్రరూపంలో చేసిన శివతాండవంలో దుర్గాదేవి ఓడిపోతుంది. ఢమరుకం కింకిణీరవాల కనుగుణంగా శరీరాన్ని కుడిఎడమలకు వంచడం ఈ తాండవంలోని విశేషం. ఈ భంగిమలో ఎడమ చేతిని కుడి కాలి వేళ్ళకు తగిలించి నాట్యం చేయడం మరొక విశేషం.


ఇవి కూడా చూడండిసవరించు

గ్యాలరీసవరించు

పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన s:శివతాండవము పుస్తకం కోసం ప్రముఖ చిత్రకారుడు బాపు చిత్రించిన అపూర్వ కళాఖండాలు.