ఢిల్లీ గేట్, ఢిల్లీ

(ఢిల్లీ ద్వారం నుండి దారిమార్పు చెందింది)

ఢిల్లీ గేట్ లేదా ఢిల్లీ ద్వారం అనేది అనేక చారిత్రిక గోడల నగరం పాత ఢిల్లీ లేదా షాజహానాబాద్ లోని దక్షిణ ద్వారం. ఈ గేట్ న్యూఢిల్లీ నగరాన్ని పాత గోడల నగరమైన ఢిల్లీతో కలుపుతుంది. ఇది రహదారి మధ్యలో, నేతాజీ సుభాష్ చంద్ర రోడ్ (లేదా నేతాజీ సుభాష్ మార్గ్) చివరిలో, దర్యాగంజ్ అంచున ఉంది. ఇది ఢిల్లీ యొక్క ఏడవ నగరమైన షాజహానాబాద్‌ను చుట్టుముట్టే శిధిలాలలో నిర్మించిన ఎత్తైన కోట గోడల యొక్క భాగంగా ఈ గేట్‌ను 1638 లో షాజహాన్ చక్రవర్తి నిర్మించాడు. ప్రార్థన కోసం జామా మసీదు వెళ్ళడానికి చక్రవర్తి ఈ ద్వారం ఉపయోగించాడు. గోడల నగరం యొక్క ఉత్తర ద్వారం, కాశ్మీరీ గేట్ (1853) కు ఆకృతి, నిర్మాణకళలో ఢిల్లీ గేట్ పోలిక ఉంటుంది. ఇది ఎర్ర ఇసుకరాయి, ఇతర రాళ్లతో పెద్ద పరిమాణంలో నిర్మించబడింది, ఇది ఆకట్టుకునే ఒక పెద్ద నిర్మాణం. గేట్ దగ్గర రెండు పెద్ద ఏనుగు విగ్రహాలను కూడా నిర్మించారు. దీనిని గతంలో హతి పోల్ అని కూడా పిలిచేవారు.

ఢిల్లీ గేట్

ఈ గేట్ నుండి రహదారి దర్యాగంజ్ గుండా కాశ్మీరీ గేటుకు వెళుతుంది. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నిర్మించడానికి తూర్పున ఉన్న కోట గోడ యొక్క కొంత భాగం కూల్చివేయబడింది, పశ్చిమాన గోడ ఉంది. ప్రస్తుతం ఈ నిర్మాణం చారిత్రక స్మారక చిహ్నంగా భద్రపరచబడింది, దీనిని వారసత్వ ప్రదేశంగా భారత పురాతత్వ సర్వే సంస్థ నిర్వహిస్తోంది.[1][2][3][4]

మూలాలు

మార్చు
  1. Fanshawe.H.C (1998). Delhi, Past and Present. Asian Educational Services. pp. 1–8. ISBN 978-81-206-1318-8. Retrieved 10 June 2009. {{cite book}}: |work= ignored (help)
  2. "Commonwealth Games-2010, Conservation, Restoration and Upgradation of Public Amenities at Protected Monuments" (PDF). Qila Rai Pithora Wall. Archaeological Survey of India, Delhi Circle. 2006. p. 55. Archived from the original (pdf) on 11 October 2011. Retrieved 30 August 2013.
  3. Mahtab Jahan (2004). "Dilli's gates and windows". MG The Milli Gazette Indian Muslims leading new paper. Retrieved 17 May 2009.
  4. Patrick Horton; Richard Plunkett; Hugh Fnlay (2002). Delhi. Lonely Planet. pp. 92–94. ISBN 978-1-86450-297-8. Retrieved 13 June 2009. {{cite book}}: |work= ignored (help)