ఢి ఫర్ దోపిడి
ఢి ఫర్ దోపిడి 2013 డిసెంబరు 25 న విడుదలైన తెలుగు చిత్రం.
ఢి ఫర్ దోపిడి | |
---|---|
దర్శకత్వం | సిరాజ్ కల్లా |
రచన | సిరాజ్ కల్లా |
నిర్మాత | రాజ్ నిడుమోరు, క్రిష్ణ డి. కె నాని |
తారాగణం | వరుణ్ సందేశ్ సందీప్ కిషన్ నాని రాకేశ్ మెలోనీ కన్నొకడ |
ఛాయాగ్రహణం | లూకాస్ |
కూర్పు | ధర్మేంద్ర |
సంగీతం | మహేశ్ శంకర్ |
విడుదల తేదీ | 25 డిసెంబరు 2013 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
కథ
మార్చునలుగురు కుర్రాళ్లు తమ వ్యక్తిగత బలహీనతల నుంచి బయటపడటానికి సులభంగా డబ్బు సంపాదించాలని పధకం వేస్తారు. పలు రకాలుగా దాని కోసం పన్నాగాలు వేసి విఫలమవుతారు. చివరికి బ్యాంక్ దోపిడికి పధక రచన చేస్తారు. దోపిడి చేయాడానికి వెళ్లిన నలుగురు కురాళ్లు అనుకోకుండా బ్యాంక్ లోనే ఇరుక్కుపోతారు. దోపిడి జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు బ్యాంక్ ను చుట్టుముడుతారు. బ్యాంకులో చిక్కుకుపోయినా నలుగురు కుర్రాళ్లు పోలీసుల బారి నుంచి ఎలా బయటపడ్డారు? బ్యాంక్ దోపిడి సంఘటనలో నలుగురు కుర్రాళ్లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు? బ్యాంక్ ను దోపిడి చేయడంలో సఫలమయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన చిత్రం.
నటవర్గం
మార్చు- నాని - హరీష్
- సందీప్ కిషన్ - రాజు
- వరుణ్ సందేశ్ - విక్కి
- తనికెళ్ల భరణి - పోలీసు అధికారి
- మెలానీ కన్నోకాడా
- కట్టా దేవా
- రిషి మువ్వ - చెవుల పిల్లి
- సయ్యద్ సోహైల్ - రాహుల్
సాంకేతికవర్గం
మార్చు- రచన - దర్శకత్వం - సిరాజ్ కల్లా
- సంగీతం - మహేశ్ శంకర్