దేవ కట్టా

దర్శకుడు

దేవ కట్టా ఒక ప్రవాసాంధ్రుడైన సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. 2010 లో ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన ప్రస్థానం సినిమా అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో, ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది.[1] ఈ సినిమా ఫిలిం ఫేర్ ఉత్తమ విమర్శకుల చిత్రంగా, నంది మూడో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

దేవ కట్టా
జననం
దేవ కౌశిక్ కట్టా

విద్యాసంస్థవేన్ స్టేట్ యూనివర్శిటీ
వృత్తిసినీ దర్శకుడు, సినీ నిర్మాత, రచయిత
తల్లిదండ్రులు
  • నిరంజన్ నాయుడు కట్టా (తండ్రి)

వ్యక్తిగతం

మార్చు

దేవా కడప జిల్లా, జెట్టివారిపల్లి గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నిరంజన్ నాయుడు. అతని కుటుంబం మద్రాసుకు తరలి వెళ్ళింది. దేవ అక్కడే పెరిగాడు. చెన్నై లోని సత్యభామ కళాశాల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. తరువాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. డెట్రాయిట్ రాష్ట్రంలోని మిషిగన్ లో వేన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎమ్మెస్ చేశాడు. చదువైపోయిన తరువాత జనరల్ మోటార్స్ లో ఉద్యోగం చేశాడు.

నటనా రంగం

మార్చు

ఉద్యోగం చేస్తూనే సినిమాలకు సంబంధించిన కోర్సు చేశాడు. తరువాత అమెరికాలో భారతీయ విద్యార్థుల స్థితిగతులను ప్రతిబింబిస్తూ వలస అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించాడు. అదే నేపథ్యంలో వెన్నెల సినిమాతో దర్శకుడిగా, రచయితగా తన ప్రస్థానం ప్రారంభించాడు.[2][3][4]

దర్శకత్వం వహించిన సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Suresh Krishnamoorthy (2010-10-22). "'Prasthanam' gets a place in Indian Panorama". The Hindu. Retrieved 2012-08-04.
  2. Dying to be Me - A Short Film by Deva Katta. YouTube. 14 August 2015.
  3. Subuhi Parvez (19 August 2015). "Why Every Indian Woman, and Man, Should Watch This Short Film". NDTV.com.
  4. "Dying to be Me - An awesome short film by Deva Katta". South Report. Archived from the original on 2015-08-20. Retrieved 2016-09-23. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
"https://te.wikipedia.org/w/index.php?title=దేవ_కట్టా&oldid=4218684" నుండి వెలికితీశారు