తడకమళ్ల వినోద్ కుమార్
తడకమళ్ల వినోద్ కుమార్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి. వినోద్ కుమార్ 1993 నుంచి న్యాయవాదిగా సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించి 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[1]
తడకమళ్ల వినోద్ కుమార్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 26 ఆగష్టు 2019 - ప్రస్తుతం | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 17 నవంబర్ 1964 దాచారం గ్రామం, మాడుగులపల్లి మండలం, నల్లగొండ జిల్లా | ||
తల్లిదండ్రులు | లక్ష్మీ నర్సింహారావు, శకుంతల | ||
నివాసం | హైదరాబాద్ | ||
వృత్తి | న్యాయమూర్తి | ||
మతం | హిందూ మతము |
జననం, విద్యాభాస్యం
మార్చుతడకమళ్ల వినోద్ కుమార్ 17 నవంబరు 1964లో తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, మాడుగులపల్లి మండలం, దాచారం గ్రామంలో లక్ష్మీ నర్సింహారావు, శకుంతల దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్ ఎంబీ హైస్కూల్‌లో పదవ తరగతి, గన్‌ఫౌండ్రీలోని ఆలియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్, జాంబాగ్‌లోని వీవీ కాలేజీలో బీఏ, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1988లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.[2]
వృత్తి జీవితం
మార్చుతడకమళ్ల వినోద్‌కుమార్ 1988లో అడ్వకేట్‌గా పేరు నమోదు చేసుకొని, 1993లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.ఆయన 2016 నుంచి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశాడు.[3]ఆయన 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (26 August 2019). "ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 28 August 2019. Retrieved 28 August 2019.
- ↑ Sakshi (24 August 2019). "హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు". Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.
- ↑ Andrajyothy (2019). "తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు". Archived from the original on 16 అక్టోబరు 2021. Retrieved 16 October 2021.
- ↑ Telangana High Court (2019). "HONOURABLE SRI JUSTICE T. VINOD KUMAR". tshc.gov.in. Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.