కాల్షియం హైడ్రాక్సైడ్

(తడి సున్నం నుండి దారిమార్పు చెందింది)

కాల్సియం హైడ్రాక్సైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం. కాల్సియం హైడ్రాక్సైడ్ ను వ్యావహారికంలో తడి సున్నం/విరిసిన సున్నం (slaked lime) అంటారు. కాల్సియం హైడ్రాక్సైడ్ రసాయనిక సంకేత పదం Ca (OH)2. కాల్సియం హైడ్రాక్సైడ్ రంగులేని స్పటిక రూపంలో లేదా తెల్లనిపొడి లా ఉంటుంది. సున్నం లేదా క్విక్ లైమ్ అనబడు కాల్సియం ఆక్సైడ్ నీటిలో కరిగించడంవలన,లేదా నీటితోస్లాక్డ్ చెయ్యడం వలన కాల్సియం హైడ్రాక్సైడ్ ను ఉత్పత్తి చేయుదురు.కాల్సియం హైడ్రాక్సైడ్ ను పలురకాల ఉపయోగిస్తారు. ఆహార పదార్థాల తయారీలో కూడా కాల్సియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగిస్తారు. కాల్సియం హైడ్రాక్సైడ్ సంతృప్త ద్రావనాన్ని సున్నపు నీరు అని వ్యవహరిస్తారు.

కాల్సియం హైడ్రాక్సైడ్
Calcium hydroxide
పేర్లు
IUPAC నామము
Calcium hydroxide
ఇతర పేర్లు
Slaked lime
Milk of lime
Caustic Soda
Calcium(II) hydroxide
Pickling lime
Hydrated lime
Portlandite
Calcium hydrate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1305-62-0]
పబ్ కెమ్ 14777
యూరోపియన్ కమిషన్ సంఖ్య 215-137-3
కెగ్ D01083
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:31341
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య EW2800000
SMILES [Ca+2].[OH-].[OH-]
ధర్మములు
Ca(OH)2
మోలార్ ద్రవ్యరాశి 74.093 g/mol
స్వరూపం white powder
వాసన odorless
సాంద్రత 2.211 g/cm3, solid
ద్రవీభవన స్థానం 580 °C (1,076 °F; 853 K) (loses water, decomposes)
0.189 g/100 mL (0 °C)
0.173 g/100 mL (20 °C)
0.066 g/100 mL (100 °C)
Solubility product, Ksp 5.5×10−6
ద్రావణీయత Soluble in glycerol and acids.
Insoluble in alcohol.
ఆమ్లత్వం (pKa) 12.4
Basicity (pKb) 2.37
వక్రీభవన గుణకం (nD) 1.574
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−987 kJ·mol−1[1]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
83 J·mol−1·K−1[1]
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము [2]
R-పదబంధాలు R22, R34
S-పదబంధాలు (S2), మూస:S24
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
7340 mg/kg (oral, rat)
7300 mg/kg (mouse)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 15 mg/m3 (total) 5 mg/m3 (resp)[3]
REL (Recommended)
TWA 5 mg/m3[3]
IDLH (Immediate danger)
N.D.[3]
సంబంధిత సమ్మేళనాలు
ఇతర కాటయాన్లు
Magnesium hydroxide
Strontium hydroxide
Barium hydroxide
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

కాల్సియం హైడ్రాక్సైడ్ ఇతర పేర్లు

మార్చు

జలయుత సున్నం, కాస్టిక్ లైం, బిల్డర్స్ లైం, స్లాక్ లైం, పికిలింగ్ లైమ్.

భౌతిక ధర్మాలు

మార్చు

కాల్సియం హైడ్రాక్సైడ్ తెల్లని ఘన పదార్థం.వాసన ఉండదు.కాల్సియం హైడ్రాక్సైడ్ అణుభారం 74.093గ్రాములు/మోల్.సాధారణ ఉష్ణోగ్రత వద్ద కాల్సియం హైడ్రాక్సైడ్ సాంద్రత 2.211గ్రాములు/సెం.మీ3. కాల్సియం హైడ్రాక్సైడ్ ద్రవీభవన స్థానం 580  °C (1,076 °F; 853 K) (ఈ ఉష్ణోగ్రతవద్ద నీటిని కోల్పోయి,వియోగం చెందును.

ద్రావణీయత

మార్చు

నీటిలో కరుగును.100 మి.లీ నీటిలో 0 °C 0.189గ్రాములు, 20 °C వద్ద 0.173 గ్రాములు,100 °C వద్ద 0.066 గ్రాములు కరుగును గ్లిసరాల్, ఆమ్లాలలో కరుగుతుంది. ఆల్కహాల్ లో కరుగదు. కాల్సియం హైడ్రాక్సైడ్ ఆమ్లతత్వ విలువ (pKa): 12.4. కాల్సియం హైడ్రాక్సైడ్ క్షార తత్వ విలువ (pKb) :2.37. కాల్సియం హైడ్రాక్సైడ్ వక్రీభవన సూచిక 1.574

రసాయన లక్షణాలు-చర్యలు

మార్చు

కాల్సియం హైడ్రాక్సైడ్ నీటిలో relatively గా కరుగును. కాల్సియం హైడ్రాక్సైడ్ పాక్షికముగానీటిలో కరిగి హైడ్రాక్సైల్అనయాన్ (OH-)ను విడుదల చేయును.

Ca(OH)2 → Ca2+ + 2 OH-

సాధారణ ఉష్ణోగ్రతవద్ద కాల్సియం హైడ్రాక్సైడ్ శుద్ధమైన నీటిలో కరగడం వలన 12.5 వరకు pH కలిగిన క్షార ద్రావణం ఏర్పడును. అందువలన కాల్సియం హైడ్రాక్సైడ్ ద్రావణాలు తీవ్రమైన రసాయన కాలిన గాయాలు ఏర్పరచును.ద్రావణం యొక్క pH విలువ ఆధారంగా కాల్సియం హైడ్రాక్సైడ్ ద్రావణీయత మారును.

నీటిలోమజ్జిగ వలె తెల్లగా తేలియాడు కాల్సియం హైడ్రాక్సైడ్ పార్టికిల్స్ ను మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు.మిల్క్ ఆఫ్ లైమ్ కలిగిన ద్రవాన్నిసున్నపు నీరు (limewater) అంటారు.సున్నపు నీరు మధ్య స్థాయి శక్తి కలిగిన క్షార ధర్మం కలిగి ఆమ్లాలతో చర్య జరుపును. అలాగే అల్యూమినియం వంటి లోహాల తోరసాయన చర్య జరుపును.అలాగే ఇనుము ఉక్కు వంటి లోహాల మీద రక్షిత పొరలా ఏర్పడి (passivation) ఆలోహాల ఉపరితలాన్ని క్షయికరణ నుండి రక్షించును.

కార్బన్ డైయాక్సైడ్ సమక్షములో సున్నపు తేట/నీరు కాల్సియం కార్బోనేట్ ను ఏర్పరచును. ఈ రసాయన చర్యను కార్బోనేసన్ అంటారు.

Ca(OH)2 + CO2 → CaCO3 + H2O

కాల్సియం హైడ్రాక్సైడ్ ను 512 °C వరకు వేడిచేసిన ఈ రసాయన పదార్థం వియోగం చెందటం వలన కాల్సియం ఆక్సైడ్, నీరుగా ఏర్పడును.

Ca(OH)2 → CaO + H2O

ఉత్పత్తి

మార్చు

వ్యాపార స్థాయిలో సున్నపు రాయిని (CaO)నీటితో కలపడం వలన ఉత్పత్తి చేయుదురు.

CaO + H2O → Ca(OH)2

పరిశోధన,ప్రయోగ శాలలో సజల కాల్సియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్ సజలద్రావణాలను మిశ్రమం చేసి చర్య జరిపించడం ద్వారా ఉత్పత్తి చేయుదురు.

స్వాభావిక లభ్యత

మార్చు

ఖనిజ రూపంలో అయినచో పోర్ట్ లాండైట్ (portlandite,)అనునది అరుదుగా అగ్నిశిలలో, రూపాంతర శిల (metamorphic rocks) లలో,ప్లుటోనిక్ రాళ్ళలోలభిస్తుంది. అలాగే కాల్చిన బొగ్గు డంప్ లలో కూడాలభించును. అంతియే కాకుండాS-రకపు నక్షత్ర వాతావరణ మండలంలో కూడా గుర్తించారు.

ఉపయోగాలు

మార్చు

కాల్సియం హైడ్రాక్సైడ్ ను నీటిని శుద్ధిచేయుటకు,అలాగే sewage నీటిని శుద్ధి చేయుటలో flocculant గా ఉపయోగిస్తారు. నీటిలోని మాలిన అణువులను ఇది గ్రహించడం ద్వారా, వాటిని తొలగించి,నీటిని తేట పరచును. ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రక్రియ.అలాగే గొట్టాలద్వారా ప్రవహించు నీటిలో కాల్సియం హైడ్రాక్సైడ్ ను కలిపి నిటి pH ని పెంచడం వలన,నీటిఆమ్లా గుణం తగ్గి,గొట్టాల క్షయికరణ జరగదు.

అమ్మోనియా వాయువును ఉత్పత్తి చేయు ప్రక్రియలో కాల్సియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగిస్తారు.

Ca(OH)2 + 2NH4Cl → 2NH3 + CaCl2 + 2H2O

కాగితపు తయారి పరిశ్రమలో కూడా సోడియం హైడ్రాక్సైడ్ను ఉత్పాతిచేయుటలో మధ్యంతర స్థాయి (intermediate ) రసాయనంగాఅధిక మొత్తంలో కాల్సియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగిస్తారు.

ఇతర ప్రయోజనాలు

మార్చు

సులభంగా ఉపయోగించే వీలుండటం,భారీప్రమాణంలో తక్కువ వ్యయంతో ఉత్పత్తి కావించు వెసులుబాటుకలిగి ఉండటం వలన కాల్సియం హైడ్రాక్సైడ్ ను ఇతర పారిశ్రామిక ఉత్పత్తు లలో విరివిగా వాడుచున్నారు.

  • ప్రత్యేకంగా క్లోస్డ్-సర్క్యూట్ రి బ్రితర్స్ (US నేవీ LAR V లేదాMK-16 వంటివి)లలో కార్బన్ డయాక్సైడ్ స్క్రబ్బర్ (carbon dioxide scrubber)గా ఉపయోగిస్తారు.
  • గోడలకు వెల్ల వేయుటకు,అలాగే గచ్చు తయారీలో గోడల పూత వేయుటకులో కాల్సియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగిస్తారు.
  • అలాగే బాటల/రోడ్ల నిర్మాణంలో తక్కువ స్థాయి నేల/మట్టి స్వభావాన్ని మెరుగు పరచుటకు కాల్సియం హైడ్రాక్సైడ్ ను వాడెదరు.
  • లోహాలను ఉత్పత్తి చేయునపుడు,ఏర్పడు వ్యర్ధ వాయువులను వాతావరణంలోకి విడుదల చేయుటకు ముందు,వాటి లోని ఆమ్లాలను,ఫ్లోరైడ్లను,క్లోరైడ్ లను తటస్థికరించుటకు కాల్సియం హైడ్రాక్సైడ్ ను వాడెదరు.
  • రోమ నిర్మూలన క్రిము/లేపనాలలో chemical depilatory కారకంగా వాడెదరు.
  • బోర్దాక్స్ మిశ్రమంఅను శిలీంధ్రనాశిని తయారీలో, సోల్యుసన్ లోని కాపర్ హైడ్రాక్సైడ్ ను అవక్షెపముకావించి, ఎక్కువ pHఉండేలా చేయును.
  • పెట్రోలియం రిఫైనింగ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు
  • రసాయన పదార్థాలతయారి పరిశ్రమలలో కాల్సియం స్టియరేట్ ఉత్పత్తి చేయుటలో వాడెదరు.
  • యంత్రాల బ్రేక్ ప్యాడ్ (brake pads)తయారీలో వాడెదరు.
  • క్రిమి,కీటకసంహారక ( pesticides) మందులలో కాల్సియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగిస్తారు.
  • ఎబోనైట్ (ebonite)తయారీలో ఉపయోగిస్తారు.
  • ప్రాకే జాతికి చెందిన పిణుజులు (icks), గోమార్లు (fleas), పేడపురుగు (beetles), లద్దిపురుగులు (grubs)వంటివి కాల్సియం హైడ్రాక్సైడ్ నుతాకడం వలన మరణిస్తాయి.అందువలన కాల్సియం హైడ్రాక్సైడ్ సహజ ప్రత్నామ్యాయ కీటకసంహారిణి.

ఆహార పరిశ్రమలలో

మార్చు

చక్కర కర్మాగారాలలో,చక్కర రసం లేదా షుగర్ బిట్ రసాన్ని క్లారిఫై చెయ్యుటకు కాల్షియం హైడ్రాక్సైడ్ ఉపయోగిస్తారు. కాల్చి నీరుచల్లిన సున్నము (slaked lime) ని ఫుడ్ ఇండస్ట్రీలో విస్తృతంగా వాడెదరు.ఆల్కహాల్ పానీయాలు,సరళ పానీయాలు తయారు చేయుటలో ఉపయోగిస్తారు. పాపడం (papadam)తయారీలో బేకింగ్ సోడాకు ప్రత్నామ్యాయంగా కాల్సియం హైడ్రాక్సైడ్ ఉపయోగిస్తారు.

ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్,ఇండియా,బంగ్లాదేశ్,స్వీడన్,, నార్వేలలో కాల్సియం హైడ్రాక్సైడ్ను పొగాకుతో కలిపి మిశ్రమంచేసి నోటిలో పెట్టుకొని నమిలెదరు. భారతదేశంలోని ప్రాంతాలలో తమలపాకు, కాల్సియం హైడ్రాక్సైడ్/సున్నం మరికొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా చేర్చి నమిలెదరు. భారతదేశంలో వీటి మిశ్రమ సముదాయాన్ని తాంబూలం, కిళ్ళి అని పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత దేశానికి చెందిన గ్రామీణులు తమ మట్టి ఇంటి గోడలకు సున్నపు పూతను పూయుదురు.

ఆరోగ్య పరమైన ఇబ్బందులు

మార్చు

అ రక్షితముగా కాల్సియం హైడ్రాక్సైడ్ ప్రభావానికి లోనయిన ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొన వలసి ఉంది. అతితక్కువ ప్రమాణంలో మాత్రమే దేహవ్యవస్థ దిని ప్రభావానికి లోనయిన పర్వాలేదు.లేనిచో చర్మం ఇరిటేసన్ కు లోనవ్వడం,కాలి బొబ్బలు రావటం, గాయాలు ఏర్పడం జరుగును. ఊపిరితిత్తు లలో చేరిన పాడవును.

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. 1.0 1.1 Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. p. A21. ISBN 0-618-94690-X.
  2. "MSDS Calcium hydroxide" (PDF). Archived from the original (PDF) on 2012-03-25. Retrieved 2011-06-21.
  3. 3.0 3.1 3.2 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0092". National Institute for Occupational Safety and Health (NIOSH).