తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం
తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రాపూర్ ప్రాంతంలో ఉంది. మహారాష్ట్రలో ఉన్న అతి పెద్ద, పురాతన జాతీయ ఉద్యానవనం.[1]
తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం | |
---|---|
Location | చందనాపూర్, మహారాష్ట్ర, భారతదేశం |
Nearest city | చంద్రాపూర్ 45 కిలోమీటర్లు (28 మై.) E |
Coordinates | 20°10′0″N 79°24′0″E / 20.16667°N 79.40000°E |
Area | 625.4 చదరపు కిలోమీటర్లు (241.5 చ. మై.) |
Established | 1955 |
Governing body | Maharashtra Forest Department |
చరిత్ర
మార్చుఈ కేంద్రాన్ని 1995 లో స్థాపించారు. ఇందులో ఉద్యానవనం, సంరక్షణ కేంద్రంతో కలిపి మొత్తం 625 స్కెర్ కిలోమీటర్ల విస్తీరణంలో విస్తరించి ఉంది. తడోబా అనగా గిరిజనులు కొలిచే దేవత. ఆ దేవత పేరు మీదుగా ఈ ఉద్యనవానికి తడోబా అనే నామకరణం చేశారు.
మరిన్ని విశేషాలు
మార్చుతడోబా పులుల సంరక్షణ కేంద్రం చీముర్ కొండల మధ్యలో ఉంది. అంధారి వన్యప్రాణుల కేంద్రం మోహరిల్, కోల్సా ప్రాంతం మధ్యలో ఉంటుంది. 2016 సమాచారం ప్రకారం ఈ సంరక్షణ కేంద్రంలో 88 పులులు ఉన్నట్టు తేలింది. ఇందులో పులులే కాకుండా రకరకాల జంతువులు, పక్షులు, సరీసృపాలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ Tadoba-Andhari Tiger Reserve-History, Sanctuary Asia, archived from the original on 2019-08-14, retrieved 2019-08-15