తత్కాల్ పథకం
తత్కాల్ పథకం, భారతీయ రైల్వేలు ఏర్పాటు చేసిన టికెటింగ్ కార్యక్రమం. ప్రయణ సమయానికి ముందు చాలా తక్కువ వ్యవధి ఉన్నపుడు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. భారతీయ రైల్వేలు భారతదేశంలోని దాదాపు అన్ని రైళ్లలో అన్ని రకాల రిజర్వేషన్ తరగతులలో దీనిని ప్రవేశపెట్టింది. 1997లో నితీష్ కుమార్ భారత రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు దీనిని ప్రవేశపెట్టారు.[1] బుకింగ్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటి లోనూ చేసుకోవచ్చు.
విశేషాలు
మార్చుతత్కాల్ టిక్కెట్లను రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌లోను, ఇంటర్నెట్‌లో IRCTC వెబ్‌సైట్ లోనూ బుక్ చేసుకోవచ్చు.
- బయలుదేరే స్టేషనులో రైలు బయలుదేరే రోజు కంటే ఒకరోజు ముందు ఉదయం 10:00 గంటలకు టిక్కెట్ బుకింగు తెరుస్తారు. ప్రయాణం రోజును చార్ట్ తయారీ రోజుగా నిర్వచించబడింది. APP ఆధారిత బుకింగు కోసం TATKAL విండో ప్రయాణ రోజు మినహా 1 రోజు ముందుగానే తెరవబడుతుంది. ప్రయాణ తేదీ 5వ తేదీన ఉంటే, APPలో తత్కాల్ 4వ తేదీన తెరవబడుతుంది; మరోవైపు, మూల స్టేషన్‌లో 4 న బయలుదేరే రైలుకు బోర్డింగ్ స్టేషన్‌లో ప్రయాణ తేదీ 5 వ తేదీ అయితే, తత్కాల్ బుకింగు 3 వ తేదీన తెరవబడుతుంది.[2][3][4]
- ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లలో టిక్కెట్ల బుకింగు ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇతర కోచ్‌ల కోసం ఇది ఉదయం 11:00 న మొదలౌతుంది.
- యావత్తు రైలునూ తత్కాల్ రైలుగా నిర్వచించిన రైలంటూ ఏదీ లేదు. అమ్ముడుపోని తత్కాల్ టిక్కెట్లను వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు విడుదల చేస్తారు. ధ్రువీకరించబడిన తత్కాల్ టిక్కెట్‌లను రద్దు చేసుకోవచ్చు, కానీ డబ్బు వాపసు ఇవ్వరు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న తత్కాల్ టిక్కెట్‌లను రద్దు చేస్తే డబ్బు తిరిగి ఇస్తారు.
- ఏప్రిల్ నుండి సెప్టెంబరు మధ్య ఉండే పీక్ కాలంలో తత్కాల్ వసతి సగటు వినియోగం 80% కంటే ఎక్కువ ఉంటుంది. ఈ పీక్ పీరియడ్‌లో వర్తించే తత్కాల్ ఛార్జీలనే ఏడాది పొడవునా వసూలు చేస్తారు. అంటే, పీక్, నాన్-పీక్ సమయాలు రెండింటికీ ఒకటే రేటు ఉంటుంది.
ప్రీమియం తత్కాల్ బుకింగ్
మార్చుకొన్ని రైళ్లలో సగం టిక్కెట్లను అమ్మేలా ప్రీమియం తత్కాల్ వ్యవస్థను 2014 అక్టోబరు 1 న ప్రవేశపెట్టారు.[2][5] ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. దాదాపు 80 రైళ్లతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రీమియం తత్కాల్, సాధారణ తత్కాల్ టిక్కెట్లు ఒకే పద్ధతిలో పనిచేస్తాయి. అయితే ప్రీమియం తత్కాల్ టిక్కెట్టు ధర, తత్కాల్ టిక్కెట్టు ధర కంటే రెండింతలు ఉంటుంది.[6]
మోసం నివారణ
మార్చుఈ పథకం దుర్వినియోగమైనందువల్ల రైల్వే మంత్రిత్వ శాఖ 2015 జూన్‌లో తత్కాల్ బుకింగు సమయాన్ని మార్చింది. IRCTC ఏజెంట్లతో సహా అన్ని రకాల టికెటింగ్ ఏజెంట్లు ఇప్పుడు బుకింగ్‌లు ప్రారంభమైనప్పటి నుండి 30 నిమిషాల పాటు నిషేధిస్తారు. అంటే సాధారణ తరగతులకు ఉదయం 8 నుండి 8.30 వరకు, తత్కాల్ AC తరగతులకు ఉదయం 10 గంటల నుండీ, తత్కాల్ నాన్-ఎసి తరగతులకు ఉదయం 11 గంటల నుండి అరగంటపాటు ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చెయ్యలేరు. ఈ పద్ధతిలో కూడా అక్రమాలు జరిగే అవకాశం ఉంది.[2]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Nitish Kumar's work in Bihar: Everything you need to know about Bihar's development".
- ↑ 2.0 2.1 2.2 "Tatkal booking timings changes from today". The Hindu. Retrieved 2015-06-15.
- ↑ "Tatkal ticket holders will now have to carry ID proof". The Times of India. 2011-01-31. Archived from the original on 2012-11-05. Retrieved 2012-02-11.
- ↑ "Tatkal Booking TIME* in IRCTC 2016/2017 {Updated}". PNRStatusIRCTC.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-09-20. Retrieved 2017-05-03.
- ↑ "Salient Features of Premium Tatkal (PT) Quota booking on Dynamic Pricing" (PDF). Archived from the original (PDF) on 19 నవంబర్ 2016. Retrieved 19 November 2016.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "Premium Tatkal VS Regular Tatkal Ticket". Archived from the original on 2023-04-05. Retrieved 2024-09-25.