తపాలా బిళ్ళ

(తపాలా బిళ్ళలు నుండి దారిమార్పు చెందింది)

తపాలా బిళ్ళలు (Postal stamps) తపాలా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం.

పెన్నీ బ్లాక్, ప్రపంచంలోని మొట్టమొదటి తపాలా బిళ్ళ.

చరిత్ర

మార్చు

తపాలా బిళ్ళను మొట్టమొదటి సారిగా గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్ లలో వాడినట్లు తెలుస్తోంది.[1] ప్రజలకు 1840 ల నుండి, తపాలా బిళ్ళలు (  పోస్టేజ్ స్స్టాంప్స్)లేఖలు, మెయిల్ డెలివరీకి సహాయపడ్డాయి. 1835 లో, రోలాండ్ హిల్ (ఆంగ్ల ఉపాధ్యాయుడు, ఆవిష్కర్త, సంఘ సంస్కర్త)  తపాలా కార్యాలయ సంస్కరణ కోసం ప్రచారం చేశాడు, తద్వారా  యూనిఫాం పెన్నీ పోస్ట్ ఆమోదానికి మార్గం సుగమం చేసింది. తపాలా ఖర్చులు ( పోస్టల్ రేట్లు)  పరిమాణం కంటే బరువుపై ఆధారపడి ఉంటాయి.1837 లో, రోలాండ్ హిల్ మొదటి జిగురు తపాలా స్టాంపును కనుగొన్నాడు. అప్పటి నుంచి  తపాలా స్టాంపుల చరిత్ర ప్రారంభం ఆయినది. రోలాండ్ హిల్ తపాలా స్టాంపుల చరిత్రలో ఆవిష్కర్తగా పరిగణించబడ్డాడు. పెన్నీ బ్లాక్ 1840లో ఇంగ్లాండులో విడుదలైంది. సర్ రోలాండ్ హిల్ ఒక పైసా ఖరీదు చేసే మొదటి తపాలా స్టాంపును రూపొందించాడు. పోస్టల్ స్టాంప్ ను నలుపు రంగులో ముద్రించడం వల్ల, తపాలా స్టాంపుల చరిత్రలో, ప్రపంచంలోని మొట్టమొదటి తపాలా స్టాంప్ అయిన పెన్నీ బ్లాక్ గా ప్రతిచోటా ప్రసిద్ధి చెందింది.

తపాలా బిళ్ళలు  పూర్వము కార్క్ లేదా కలపతో తయారు చేసిన సిరా, చేతి స్టాంపులు ఉపయోగంలో ఉండేవి. మెయిల్ ను ఫ్రాంక్ చేయడానికి, పోస్టల్ చెల్లింపును ధృవీకరించడానికి సిరా,  హ్యాండ్ స్టాంపులను ఉపయోగించారు. చరిత్రలో మొట్టమొదటి తపాలా స్టాంప్ అయిన పెన్నీ బ్లాక్ మే 1,1840 న ప్రజలకు అందుబాటులోకి వచ్చి, 1840 మే 6 నాటికి ధృవీకరించబడింది. 2 రోజుల తరువాత, మే 8, 1840 న, టూ పెన్నీ బ్లూ విడుదలైంది. ఈ రెండు స్టాంపుల్లో విక్టోరియా రాణి చిత్రపటం తో విడుదల అయినవి.  

యునైటెడ్ కింగ్ డమ్ లో తపాలా స్టాంపులు ప్రవేశపెట్టిన తరువాత,  ముందుస్తు (ప్రీపెయిడ్) తపాలా వ్యవస్థ ద్వారా  పంపే లేఖలు, ఇతర సామాగ్రి సంఖ్యను గణనీయంగా పెంచింది. 1839కి ముందు, ఆ సమయంలో పంపిన లేఖల సంఖ్య 76 మిలియన్లు అని అంచనా వేయబడింది. 1850 లో,ఇది ఐదు రెట్లు పెరిగి సుమారు 350 మిలియన్లకు చేరుకుంది, తరువాత  20 వ శతాబ్దం చివరి వరకు గణనీయంగా పెరుగుతూనే ఉంది, ఆ తర్వాత వచ్చిన మార్పులతో తపాలా-చెల్లింపును సూచించే మరింత ఆధునిక పద్ధతులు తపాలా స్టాంపుల ఉనికి అవసరమయ్యే డెలివరీ వ్యవస్థల వాడకాన్ని గణనీయంగా తగ్గించాయి[2].

రకాలు

మార్చు

1.సాధారణ వినియోగం కొరకు ఉపయోగించే తపాల బిళ్ళలు.

2. వివిధ సంధర్బాలలొ విడుదల చేసే ప్రత్యేకతపాల బిళ్ళలు. లబ్ధ ప్రతిస్తులకు వారి గౌరవార్ధం అన్ని దేశాల వారు ప్రత్యేకతపాల బిళ్ళలను విడుదల చేసి, వారి కృషిని ముందు తరాలకు గుర్తుండేలా పదిలపరుస్తాయి. అలాగే ఒక జాతి సంస్కృతి, సాంప్రదాయాలపైన, వేషభాషల పైన, వైతాళికుల పైన, ప్రత్యేక స్టాంప్స్ ను ముద్రిస్తారు. వీటిని బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉండే తపాల బిల్లల సేకరనకారులు ఆయ జాతి వైభవాన్ని తెలుసుకుంటారు.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1.   https://en.wikipedia.org/wiki/Postage_stamp. వికీసోర్స్. 
  2. "Postage Stamps History | StampWorld". www.stampworld.com. Retrieved 2024-08-13.