తమిళ్ రాకర్స్
తమిళ్ రాకర్స్ అనేది చలనచిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలు, సంగీతం, వీడియోలతో సహా కాపీరైట్ చేసిన ఆన్‌లైన్ కంటెంట్ ను ఉచితంగా అందించే ఒక టోరెంట్ వెబ్సైట్. సైట్ సందర్శకులను మాగ్నెట్ లింకులు, టోరెంట్ ఫైళ్ళ సహాయంతో కాపీరైట్ చేసిన విషయాలను శోధించడానికి, డౌన్‌లోడ్ చేసుకోడానికీ అనుమతిస్తుంది, అంతేకాక ఇది పీర్-టు-పీర్ ఫైల్ షేరింగ్‌ను సులభతరం చేస్తుంది. దీని వల్ల సినిమా పరిశ్రమ తీరని నష్టాలను చవిచూస్తోంది. కాపీహక్కులను ఉల్లంఘిస్తోంది కాబట్టి, భారతదేశంలో వున్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ వెబ్‌సైట్‌ను నిరోధించారు.[1] అయినప్పటికీ క్రొత్త వెబ్ చిరునామా శ్రేణికి మారడం ద్వారా వెబ్‌సైట్ నిరంతరం కొనసాగుతోంది.
చరిత్ర
మార్చుమొదటలో కొత్త తమిళ సినిమాలను విడుదల చేసే తమిళ్ రాకర్స్ ఇప్పుడు మలయాళం, హిందీ, కన్నడ, ఇంగ్లీషు, తెలుగు సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ అలాగే వివిద కాపీరైట్ వీడియోలను కూడా లీక్ చేస్తోంది.[2] ఇందుకుగాను చిత్ర పరిశ్రమలు అన్నీ తమయొక్క హక్కులను కాపాడుకోటానికి, పైరసీకి వ్యతిరేకముగా ఫిర్యాదులు నమోదు చేయడానికి యాంటీ పైరసీ సెల్స్ ను ఏర్పాటు చేసుకున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబందించిన పైరసీ ఫిర్యాదులను తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ నందు నమోదు చేయవచ్చును.[3]
2018 మార్చి 14 న, సైట్‌ను నడిపిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పురుషులలో ఒకరు సైట్ నిర్వాహకుడని నమ్ముతారు.[4]
2019 మే 23న కోయంబత్తూరులో తమిళ వెబ్సైట్ కు సహాయపడుతున్న వారిని అరెస్టు చేశారు
2020 అక్టోబర్ నెలలో అమెజాన్ ఇంటర్నేషనల్ డీఎంసీఏ ఫిర్యాదు వల్ల తమిళ్ రాకర్స్ ను ఇంటర్నెట్ నుంచి తొలగించడం జరిగింది[5] అయినప్పటికీ ఇది రూపాంతరం చెందుతూ వీపీన్ ల సహాయంతో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది
అత్యధిక ప్రాచుర్యం పొందిన టోరెంట్ సైట్లలో తమిళ్ రాకర్స్ పదవ స్థానంలో ఉంది
మూలాలు
మార్చు- ↑ DelhiAugust 12, Press Trust of India New; August 12, 2019UPDATED:; Ist, 2019 18:47. "Block TamilRockers and piracy websites: Delhi High Court to Internet Service Providers". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-02-25.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Tamilrockers 2021 Telugu Movies Download New Link". Tollywood Ace (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-20.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Telugu Film Chamber of Commerce - TFCC". www.apfilmchamber.com. Archived from the original on 2020-07-31. Retrieved 2020-09-06.
- ↑ "ఆర్కైవ్ నకలు". www.thenewsminute.com. Archived from the original on 2019-08-03. Retrieved 2020-02-25.
- ↑ Desk, India com Entertainment (2020-10-20). "Is Piracy Website Tamilrockers Blocked Permanently? Read Details Inside". India News, Breaking News, Entertainment News | India.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-11-09. Retrieved 2020-12-09.