తరిగొప్పుల మండలం (జనగామ జిల్లా)

తెలంగాణ, జనగామ జిల్లా లోని మండలం

తరిగొప్పుల మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[1] దానికి ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జనగాం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలం జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[3] ఇందులో 8 గ్రామాలున్నాయి. మండల కేంద్రం తరిగొప్పుల.

తరిగొప్పుల
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, తరిగొప్పుల స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, తరిగొప్పుల స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, తరిగొప్పుల స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం తరిగొప్పుల
గ్రామాలు 08
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 86 km² (33.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 18,601
 - పురుషులు 9,377
 - స్త్రీలు 9,224
పిన్‌కోడ్

గణాంకాలు

మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 86 చ.కి.మీ. కాగా, జనాభా 18,601. జనాభాలో పురుషులు 9,377 కాగా, స్త్రీల సంఖ్య 9,224. మండలంలో 4,489 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన మండలం

మార్చు

లోగడ తరిగొప్పుల గ్రామం వరంగల్ జిల్లా, వరంగల్ రెవెన్యూ డివిజను పరిధిలోని నెర్మెట్ట మండలానికి చెందింది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా తరిగొప్పుల మండలాన్ని (1+07)  ఎనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. తరిగొప్పుల
  2. అంకుశాపురం
  3. అక్కిరాజుపల్లి
  4. అబ్దుల్‌నగరం
  5. నరసాపూర్
  6. పోతారం
  7. బొంతగట్టునాగారం
  8. సోలిపురం

మూలాలు

మార్చు
  1. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

మార్చు