తాండూరు పురపాలకసంఘం

వికారాబాదు జిల్లాకు చెందిన పురపాలకసంఘం
(తాండూరు పురపాలక సంఘము నుండి దారిమార్పు చెందింది)

వికారాబాదు జిల్లా, తాండూరు పట్టణానికి చెందిన తాండూరు పురపాలక సంఘము 1953, నవంబర్ 23న మూడవ గ్రేడు పురపాలక సంఘముగా ప్రారంభించబడింది.[1] 2010లో ఈ పురపాలక సంఘం గ్రేడును రెండవశ్రేణి పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేయబడింది. ప్రస్తుతం ఇందులో 31 వార్డులు ఉన్నాయి. పురపాలక సంఘ పరిధిలో 2001 ప్రకారం జనాభా 57941 కాగా, 2011 నాటికి 65115కు పెరిగింది.

తాండూర్ పట్టణం నుండి చించోళి వెళ్ళు ప్రధాన రహదారి నుంచి విజయవిద్యాలయ పాఠశాలవైపు వెళ్ళు రహదారి దృశ్య చిత్రం

తాండూరు పురపాలకసంఘం మొదటి చైర్మెన్‌గా ముధెళ్ళి నారాయణరావు పనిచేశారు. 1961 లో పట్టణ జనాభా కేవలం 2000 ఉండగా నేడు సుమారు 70 వేలకు పైగా జనాభాతో విలసిల్లుతోంది. నాపరాతి గనులు, పాలిష్ మిషన్ల వల్ల అనేక మంది జీవనోపాధి కొరకు మారుమూల పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. పాలిష్ మిషన్ల వల్ల మున్సీపాలిటీకి అధిక మొత్తంలో ఆదాయం కూడా వస్తుంది. అలాగే భవన నిర్మాణాల పరిశ్రల ఏర్పాటు అనుమతులకు మునిసిపాలిటీకి అనుమతి ఫీజు లభిస్తుంది. ప్రస్తుతం పట్టణ పరిధిలో 31 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డు తరఫున ఒక వార్డు సభ్యుడు పురపాలక సంఘంలో ఆ వార్డు తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రజల సమస్యలను పరిష్కరించుటకు కృషిచేస్తారు.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. వార్త దినపత్రిక, దశమ వార్షిక ప్రత్యేక సంచిక, రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 2006