తాజ్ మహల్ (నవల)

తాజ్ మహల్ (నవల) 1934 సంవత్సరంలో నండూరి వేంకట సుబ్బారావు రచించిన నవల.

తాజ్‌ మహల్ నిర్మాణం వెనుక ప్రేమ కథ ఉందని ప్రతీతి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మరణంతో బాధపొంది ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ నిర్మించినట్టు ప్రఖ్యాతి పొందిన గాథను రచయిత నవల వ్రాశారు.

పుస్తక విశేషాలుసవరించు

ఈ పుస్తకం శైలి మృదుమధురమైనది. వర్ణనాంశాలు అతి సుందరముగా వ్రాయబడినవి. కథ, చరిత్రాత్మకమై మొఘలాయి సామ్రాజ్య వైభవమును హైందవ స్త్రీల పట్టుదలయు, దేశాభిమానమును ఈ పుస్తకంలో చూడవచ్చు. ఈ పుస్తకంలో జులేఖా సాహసకార్యములు బెహరీచరాను మాయోపాయములు, జహంగీరు రాజకీయపరతంత్రత, నూర్జహాను బుద్ధికుశలత, ఖురుంరాకుమారుని మనోనిర్మలత, లూలియా పపిత్రప్రేమ సులభ శైలిలో అందరికీ అర్థమగు రీతిన రాయబడినది. ఫతేఫూరు సిక్రీ యందు ప్రదర్శించబడిన అద్బుత చర్యలు కూడా ఇందులో ఉన్నవి.

ఈ గ్రంథకర్త గ్రామ్యమునుపయోగించక అందరికీ అర్థమయ్యే రీతిలో వ్రాసిరి. ఈ పుస్తకం రెండు భాగాలుగా ప్రచురించబడినది. [1]

మూలాలుసవరించు

  1. నండూరి వేంకట సుబ్బారావు పంతులు (1934). తాజ్ మహల్ (నవల).

బయటి లింకులుసవరించు