తాటికొండ, గేయమాలిక
విశ్వనాథ సత్యనారాయణ రచించిన కిన్నెరసాని పాటలు అనే రచన అఖిలాంధ్రంలోని భావుకుల హృదయాలనూ కదిలించింది. ఆ పాటలు విని పరవశించిన అడ్లూరి అయోధ్యరామకవి తాటికొండ అని ఈ గ్రంథాన్ని రచించారు. ఆ విషయాన్ని స్వయంగా గ్రంథకర్త ముందుమాటలో చెప్పుకున్నారు. విశ్వనాథకు పరిచయమున్న కిన్నెరసాని వాగును గురించి ఆయన రాసినట్టే, అయోధ్యరామకవి తనకు చిన్నతనం నుంచీ తెలిసిన తాటిచెట్లున్న ప్రాంతాన్ని గురించీ ఈ రచన చేశారు. దీనికి ముందుమాట విశ్వనాథ రాయడం మరో విశేషం. ఈ పుస్తకాన్ని మాడపాటి హనుమంతరావుకు అతని షష్టి పూర్తి సందర్భంగా అంకితం చేసాడు.[1]
దీని ఆరవ ప్రచురణ విజ్ఞాన గ్రంథమాల వారు 1945లో ముద్రించారు.
ఇందులోని గేయాలు
మార్చు- వనవాసము
- నగరాజు
- షోడశోపచారములు
- చదరంగము
- సీత దుఃఖము
- ఆంధ్ర జాతీయ గేయము
- వినతి
- వలదు
- లచ్చిమొర
- ఆగమనము
- నేను నా దేశం
- ప్రార్థన
- శేషము
మూలాలు
మార్చు- ↑ అడ్లూరి అయోధ్య రామకవి (1945). తాటికొండ, గేయమాలిక.