తాడు లేదా త్రాడు నారలతో చేసిన పొడవైన వస్తువు. ఇది దారం కన్నా మందంగా ఉంటుంది. ఒక సామాన్యమైన గృహోపకరణంగా విస్తృత ఉపయోగాలున్నది. వీటిని దేనినైనా గట్టిగా బంధించడానికి లేదా లాగడానికి ఉపయోగిస్తారు. నార పోగుల్ని మెలితిప్పడం ద్వారా పోగుల బలం అధికమౌతుంది. ఒక తీగ, దారం మొదలైన వాటి కంటే తాడు బలమైనది.

లాంగ్-లైన్ ఫిషింగ్ కోసం ఉపయోగించే తాడు కాయిల్స్

రకాలు

మార్చు
  • ప్రకృతిసిద్ధమైన నారలతో తయారైనవి:
  • కృత్రిమమైన నారలతో తయారైనవి:
    • నైలాన్ తాడు, ప్లాస్టిక్ తాడు

ఉపయోగాలు

మార్చు
 
కొన్ని నాట్లు: 1. స్ప్లైస్ 2. మాన్‌రోప్ ముడి 3. గ్రానీ ముడి 4. రోజ్‌బడ్ స్టాపర్ ముడి (?) 5. మాథ్యూ వాకర్ ముడి 6. ష్రౌడ్ ముడి 7. టర్క్స్ హెడ్ ముడి 8. అతిగా . నాట్ లేదా స్క్వేర్ ముడి 10. రెండు సగం హిచ్‌లు ( రౌండ్ టర్న్, రెండు హాఫ్ హిచ్‌లు చూడండి)

తాడు చరిత్ర పూర్వం నుండి విస్తృతంగా నిర్మాణ రంగంలో, సముద్రయానం, క్రీడలు, సమాచార రంగాలలో ఉపయోగంలో ఉంది.

ముడులు

మార్చు

తాడును బిగించడానికి చాలా రకాల ముడులు (Knots) కనుగొన్నారు. గిలకలు తాడులోని శక్తిని దారిమార్చడానికి ఉపయోగిస్తారు.

దాటే తాడు

మార్చు
 
తాడాట ఆడుతున్న బాలుడు

దాటే తాడును ఆంగ్లంలో స్కిప్పింగ్ రోప్ అంటారు. స్కిప్పింగ్ అనగా దాటటం, అనగా దాటటం అనే ఆట కోసం వాడే తాడును దాటే తాడు అంటారు, ఈ తాడుతో ఆడే ఆటను రోప్ స్కిప్పింగ్ అంటారు.

త్రాడు ఆట

మార్చు

తాడుకు సంబంధించిన సామెతలు

మార్చు
సమయం అనుకూలించక పోతే తాడే పామై కరుస్తుంది.
కొండవీటి చాంతాడంత.
పెద్దాపురం చాంతాడంత.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=తాడు&oldid=4270772" నుండి వెలికితీశారు