జనపనార
జనపనార (Jute) మెత్తని, మెరిసే పొడవైన నార. వీటిని బలమైన దారాలు, తాడుగా అల్లుకోడానికి వీలుంటుంది. ఇవి సన్నని పొడవైన మొక్కల ప్రజాతి కార్కొరస్ (Corchorus) నుండి లభిస్తుంది. దీనిని టీలియేసి (Tiliaceae) లేదా మాల్వేసి (Malvaceae) కుటుంబంలో వర్గీకరించారు.
జనపనార | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: |

జనపనార లక్షణాలుసవరించు
జనపనార అతి చౌకగా మొక్కల నుండి లభించే ప్రకృతిసిద్ధమైన నార. ఇది ప్రత్తి తర్వాత స్థానంలో విస్తృతంగా ఉపయోగపడుతున్నది. ఈ నారలో ముఖ్యంగా సెల్యులోజ్ (Cellulose), లిగ్నిన్ (Lignin) లు ఉన్నాయి. దీని పారిశ్రామిక నామం : raw jute. నారపోగులు తెలుపు నుండి లేత గోధుమ రంగులో సుమారు 1–4 మీటర్లు పొడుగు ఉంటాయి.
సాగుచేయు విధానంసవరించు
జనపనార రేగడి నేలల్లోను, నీరునిలబడే తడినేలల్లో పెరుగుతుంది. వేడిగా అధిక తేమను కలిగిన వాతావరణం దీనికి సాగుకు అనుకూలమైంది. ఈ రెండూ ఋతుపవనాలు అందించే ఉష్ణమండలంలో కనిపిస్తుంది. దీనికి 20˚C నుండి 27˚C ఉష్ణోగ్రత, 70%–80% గాలిలో తేమ అవసరం. వారానికి 5–8 cm వర్షపాతం ముఖ్యంగా నాటడానికి కావాలి.
చరిత్రసవరించు
జనపనార కొన్ని శతాబ్దాలుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లకు చెందిన బెంగాల్ సంస్కృతి లో భాగంగా ప్రముఖ పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనా కాలంలో 19, 20 వ శతాబ్దాలలో ముడి జనపనారను యునైటెడ్ కింగ్ డం కు తరళించేవారు. అక్కడి మిల్లులలో దాన్ని శుభ్రపరచి నారను తయారుచేసేవారు. తర్వాత కాలంలో దీని కోసం యంత్రాలను ఉపయోగించారు.[1] 1901 UK జనాభా లెక్కలలో జనపనార మిల్లులలో పని ఒక గుర్తించబడిన వృత్తి. అయితే 1970 తర్వాత కృత్రిమ నారల ఉత్పత్తి మొదలై వీటి ప్రాముఖ్యత తగ్గిపోయింది.
జనపనార ఉత్పత్తిసవరించు
జనపనార అధికంగా ఉత్పత్తి చేస్తున్న మొదటి పది దేశాలు — 2008 | ||||
---|---|---|---|---|
దేశం | ఉత్పత్తి (టన్నులు) | పాదపీఠిక | ||
భారతదేశం | 1,846,000 | F | ||
Bangladesh | 848,715 | F | ||
People's Republic of China | 48,000 | F | ||
Burma | 30,000 | F | ||
Uzbekistan | 20,000 | F | ||
Nepal | 16,988 | F | ||
Vietnam | 8,800 | F | ||
Thailand | 5,000 | F | ||
Sudan | 3,300 | F | ||
Egypt | 2,200 | F | ||
{{{1}}}World | 2833041 | A | ||
No symbol = official figure, F = FAO estimate, A = Aggregate (may include official, semi-official or estimates); |
ఉపయోగాలుసవరించు
జనపనార చాలా రకాలుగా ఉపయోగపడుతున్నది.
- జనపనారను తాళ్ళు గా అల్లి ఉపయోగిస్తారు.
- దీనిని మందమైన వస్త్రంగా తయారుచేసి దానితో తెరలు, చాపలు, కంబళి, గోనె సంచులు, తివాచీ మొదలైన గృహోపకరణాలు తయారుచేస్తారు.
- నారతో చేసిన సంచుల్ని పోలిథీన్ సంచుల స్థానంలో ఉపయోగిస్తే మంచిది.
- ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో జనపనార ఆకులను ఆహారంలో ఆకుకూరగా వాడుతారు. వీటిలో విటమిన్ ఎ, సి, ఐరన్, కాల్షియమ్ లు అధికంగా ఉన్నాయి.
మూలాలుసవరించు
బయటి లింకులుసవరించు
- Jute Genome Project
- Jute handicraft products
- Bangladesh Jute Research Institute
- ఓపెన్ డైరెక్టరీ ప్రాజెక్టులో జనపనార
- International Jute Study Group (IJSG) Resources about jute, kenaf and roselle plants. jute.org
- US Jute Bag Advocacy
- Department of Horticulture & Landscape Architecture, Purdue University Some chemistry and medicinal information on tossa jute. purdue.edu
- National Library of Scotland: SCOTTISH SCREEN ARCHIVE (selection of archive films about the jute industry in Dundee)