తాడేపల్లి పతంజలి

తాడేపల్లి పతంజలి తెలుగు రచయిత, అనువాదకుడు, సాహితీ విమర్శకుడు[1]. అతనికి అన్నమయ్య పదసేవక, ప్రవచన ప్రవీణ బిరుదులు ఉన్నాయి. అతను వ్రాసిన 'మామాకలాపం ' అనే రేడియో నాటకం జాతీయ అవార్డును గెలుచుకుంది. అన్నమయ్య కృతులకు భావాలు చెబుతూ, అనేక సంస్కృత గ్రంధాలకు సరళమైన తెలుగులో భాష్యానువాదాలు చేస్తున్నాడు.[2]

డా.తాడేపల్లి పతంజలి

జీవిత విశేషాలు మార్చు

అతను 1963 జూలై 15న సుశీల, పార్వతీశ శాస్త్రి దంపతులకు జన్మించాడు. అతను తెలంగాణా రాష్ట్రములోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ ప్రభుత్వడిగ్రీ కళాశాల లో తెలుగు భాషా అసొసియేట్ ప్రొఫెసర్ గా పనిచేసి ప్రస్తుతం కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాడు. అతను 1996 లో జాతీయ స్థాయిలో ఉత్తమ హాస్యరచయితగా పురస్కారం పొందాడు. 2010 లో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని పొందాడు. 2018లో కరీంనగర్ లోని సర్వవేదిక సంస్థానం పురస్కారాన్నందించింది. 2017లో నోరి నరసింహశాస్త్రి సాహిత్య పీఠ పురస్కారాన్ని పొందాడు. [3]

రచనలు మార్చు

  • శ్రీమన్నారాయణీయం (అనువాద గ్రంథం) - 2006
  • మామాకలాపం (నాటకం) - 1997
  • భవిష్య పురాణం(అనువాద గ్రంథం) - 2010
  • బావనలు(కవిత్వం) - 2004
  • నాటి భారతంలో నేటి సమాజం(విమర్శ) - 1996
  • అన్నమయ్య అన్నమాట - 2012[4]
  • అన్నమయ్య గీతోపదేశాలు - 2012
  • అన్నమయ్య కౌముది - 2015
  • అన్నమయ్య పదం పరమార్థం (విమర్శ) - 2016
  • శ్రీ శివ మంగళాచరణ సురభి - 2016
  • నమక చమక అర్థ తాత్పర్య విశేషాలు = 2017
  • లింగోద్భవ వృత్తమాలికాస్థుతి - 2017
  • ప్రాచీన ప్రబంధం - ఆధునిక సంతకం (విమర్శ) - 2014
  • శ్రీ విష్ణు నుతి శతకం
  • శ్రీ అరుణాచల అక్షర మణీమాల
  • ప్రసిద్ధ తెలుగు దినపత్రిక సాక్షిలో అన్నమయ్య అన్నమాట పేరిట ఆన్నమయ్య కీర్తనలకు వ్యాఖ్య వ్రాసారు.

మూలాలు మార్చు

  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-28.
  2. "Sujanaranjani". www.siliconandhra.org. Archived from the original on 2019-12-19. Retrieved 2020-06-28.
  3. శ్రీ అరుణాచల అక్షర మణిమాల పుస్తకంలో అతని బయోగ్రఫీ ఆధారంగా
  4. Kumar, Ranee (2012-06-21). "Multidimensional portrayal". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-06-28.

బాహ్య లంకెలు మార్చు