తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం


తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో ఉన్న దేవాలయం.[1] ఇక్కడి ఆంజనేయస్వామి స్వయంభువుడని ప్రతీతి. మొగలులు - రాజపుత్రులు - కుతుబ్ షాహీలు మొదలైనవారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.[2]

తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం
తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హైదరాబాద్
ప్రదేశం:సికింద్రాబాదు
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:మొగలులు - రాజపుత్రులు - కుతుబ్ షాహీలు

ఆలయ చరిత్ర

మార్చు

త్రేతాయుగంలో జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు. 19 శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేయడంతో, అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయసహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి.[3]

పూజలు

మార్చు

ప్రతి మంగళ - శని వారాల్లో అనేకమంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారు. ఇక్కడ హనుమజ్జయంతి, శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి.

మూలాలు

మార్చు
  1. ఆంధ్రప్రభ, ఫీచ‌ర్స్ (May 29, 2016). "శ్రీ అంజ‌నేయం…". Archived from the original on 10 June 2016. Retrieved 17 January 2018.
  2. తెలుగు విశేష్, భక్తి. "స్వయంభువుడు తాడ్ బండ్ వీరాంజనేయుడు". /www.teluguwishesh.com. Retrieved 17 January 2018.
  3. ఏపి7ఏఎం, భక్తి. "శ్రీ తాడుబందు వీరాంజనేయుడు". www.ap7am.com. Retrieved 17 January 2018.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]