తారా అలీషా బెర్రీ

భారతీయ చలనచిత్ర, రంగస్థల నటి

తారా అలీషా బెర్రీ భారతీయ చలనచిత్ర, రంగస్థల నటి. హిందీ, తెలుగు చిత్రాలలో నటించిన తారా అలీషా 2011లో 100% లవ్ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[1][2]

తారా అలీషా బెర్రీ
Tara Alisha Berry.jpg
లవ్ గేమ్ సినిమా పత్రికా సమావేశంలో తారా అలీషా బెర్రీ
జననంమే 19, 1988
ముంబై, మహారాష్ట్ర
జాతీయతభారతీయురాలు
వృత్తిచలనచిత్ర, రంగస్థల నటి
క్రియాశీలక సంవత్సరాలు2010–ప్రస్తుతం

జననం - విద్యాభ్యాసంసవరించు

తారా అలీషా బెర్రీ 1988, మే 19న గౌతం బెర్రీ, నందిని సేన్ దంపతులకు మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. బెంగుళూరులో తన విద్యను పూర్తి చేసి, కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీలోని చాప్మన్ విశ్వవిద్యాలయంలో ఫిల్మ్ ప్రొడక్షన్, స్క్రీన్ రైటింగ్‌లతోపాటు నట శిక్షణకు సంబంధించిన కోర్సు చేసింది.

నాటకరంగంసవరించు

ముంబైకి వచ్చి క్రియేటింగ్ కారక్టర్స్ వద్ద 4 నెలలపాటు పనిచేసి, నాటకరంగ ప్రముఖులు నిర్వహించిన 3 వారాల ఇంటెన్సివ్ డ్రామా ప్రోగ్రాంలో నటించింది.

సినిమారంగంసవరించు

2011లో ఈరోస్ నిర్మించిన ఖాన్గర్జి అనే మ్యూజిక్ వీడియోలో షాన్ తో కలిసి నటించింది. ఈమె తొలి హిందీ చిత్రం మాస్ట్రామ్ (2014).[2] రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కథల ఆధారంగా 2015లో ఎపిక్ ఛానెల్‌లో కోసం అనురాగ్ బసు దర్శకత్వం వహించిన చోఖేర్ బాలి సిరీస్లో నటించింది.[1] 2015, సెప్టెంబరు 11న ప్రకాష్ నంబియార్ దర్శకత్వం వహించిన ది పర్ఫెక్ట్ గర్ల్ విడుదలైంది.[3] వివేష్ భట్ దర్శకత్వంలో విశేష్ ఫిల్మ్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మించిన లవ్ గేమ్స్ చిత్రంలో నటించింది.[4][5]

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2011 100% లవ్ స్వప్న తెలుగు తొలిచిత్రం
2011 మనీ మనీ మోర్ మనీ మేఘన తెలుగు
2014 మాస్ట్రామ్ రేణు హిందీ హిందీ తొలిచిత్రం
2015 ది పర్ఫెక్ట్ గర్ల్ వేదిక హిందీ 2015, సెప్టెంబరు 11న విడుదల
2016 మరీచిక ఓని బెంగాళీ లఘుచిత్రం
2016 లవ్ గేమ్స్ అలీషా ఆస్తాన హిందీ ఏప్రిల్ 2016
2017 అగమ్ సార్లా హిందీ
2018 లవ్ లస్ట్ అండ్ కన్ఫ్యూజన్ పొరోమా సర్కార్ హిందీ వెబ్ సిరీస్
2018 మరుధర్ ఎక్స్‌ప్రెస్ చిత్ర హిందీ
2019 గన్ పే డన్ **** హిందీ
2019 ఎ1 దివ్య తమిళం తమిళ తొలిచిత్రం
2019 లవ్ లస్ట్ అండ్ కన్ఫ్యూజన్ 2 పొరోమా సర్కార్ హిందీ వెబ్ సిరీస్

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Tara Alisha Berry in Anurag Basu's telefilm 'Chokher Bali'". mid-day. 31 March 2015. మూలం నుండి 30 జూన్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 6 January 2020.
  2. 2.0 2.1 Tellychakkar Team (1 May 2014). "I laughed after reading Mastram's novels – Tara Alisha Berry". Tellychakkar.com. మూలం నుండి 26 ఫిబ్రవరి 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 7 January 2020.
  3. "The Perfect Girl Movie Review". The Times of India. మూలం నుండి 8 డిసెంబర్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 7 January 2020.
  4. "Being a Bhatt heroine is a dream come true, says Tara Alisha Berry". The Times of India. మూలం నుండి 13 మార్చి 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 7 January 2020.
  5. "Tribunal clears erotic thriller without cuts". Mumbai Mirror. మూలం నుండి 13 జూన్ 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 7 January 2020.

ఇతర లంకెలుసవరించు