తారా డిసౌజా

భారతీయ సినిమా నటి, మోడల్.

తారా కాన్సెప్టా డిసౌజా (జననం. 20 డిసెంబరు 1986) భారతీయ సినిమా నటి, మోడల్. ముజ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగే, మేరే బ్రదర్ కి దుల్హన్ చిత్రాలలో నటనతో గుర్తింపు పొందింది.[1][2]

తారా డిసౌజా
సులాస్ వినోటెక ఆవిష్కరణలో తారా డిసౌజా
జననం
తారా కాన్సెప్టా డిసౌజా

(1986-12-20) 1986 డిసెంబరు 20 (వయసు 36)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2006–2015
తల్లిదండ్రులు
  • ఆండ్రియాస్ (తండ్రి)
  • డయాన్ డిసౌజా (తల్లి)

జననం మార్చు

తారా డిసౌజా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 1986, డిసెంబరు 20న గోవాకి చెందిన ఆండ్రియాస్, డయాన్ డిసౌజా దంపతులకు జన్మించింది. ఆమెకు ఒక సోదరుడు నోయెల్ ప్రసాద్ డిసౌజా, ఒక సోదరి మీరా డిసౌజా ఉన్నారు. [3] హైదరాబాదులోని విద్యారణ్య ఉన్నత పాఠశాలలో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది.

వృత్తి మార్చు

మోడలింగ్ రంగం మార్చు

డిసౌజా కళాశాలలో చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. 2010లో ఎన్‌డిటివి గుడ్ టైమ్స్‌లోని కింగ్‌ఫిషర్ క్యాలెండర్ మోడల్ హంట్ రియాలిటీ టీవీ కార్యక్రమం ద్వారా ఎంపికై, కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి మోడలింగ్ చేసింది.[1]

 
ముజ్సే ఫ్రాండ్షిప్ కరోగీ నటవర్గం. ఎడమ నుండి: సాకిబ్ సలీమ్, తారా డిసౌజా, సబా ఆజాద్, నిశాంత్ దహియా

సినిమారంగం మార్చు

డిసౌజా 2006లో తెలుగులో వచ్చిన ది ఆంగ్రేజ్ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది. హైదరాబాదులోని కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం, ఆయా ప్రాంతాలలో విజయవంతంగా ప్రదర్శించబడింది.[4] తరువాత యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన మేరే బ్రదర్ కి దుల్హన్ సినిమాలో అలీ జాఫర్ పక్కన నటించింది. ఆ సినిమా కూడా విజయం సాధించడంతోపాటు, ఈ చిత్రంలోని తన నటనతో డిసౌజా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత ఫేస్‌బుక్ ఆధారంగా రూపొందిన ముజ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగే సినిమాలో కూడా నటించింది. ఈ చిత్రానికి కూడా మంచి ఆదరణ లభించింది.

నటించిన చిత్రాలు మార్చు

సంవత్సరం సినిమాపేరు పాత్రపేరు భాష
2006 ది ఆంగ్రేజ్ శీతల్
2011
మేరే బ్రదర్ కి దుల్హన్ పియాలి హిందీ
ముజ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగే మాల్విక

టెలివిజన్ మార్చు

  • దానవ్ హంటర్స్ (2015)
  • జీరో కి.మీ.లు (2019)

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Tara D'Souza Profile". NDTV Good Times. Archived from the original on 2016-02-25. Retrieved 2020-09-25. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "NDTV" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Tara Dsouza's dad proud of daughter's debut". The Times of India. 3 Oct 2011. Archived from the original on 2012-07-01. Retrieved 2020-09-25.
  3. "New kid on the block: Tara D'Souza". Star Gold. 12 September 2011.
  4. "Tara D'Souza :: Muvi Reviews". Dev.artoonsolutions.com. Archived from the original on 2020-05-13. Retrieved 2020-09-25.

ఇతర లంకెలు మార్చు