సినిమా

కదిలే బొమ్మల సమాహారం

సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది.

సినిమాలో ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. కళ, నటన, పర్వవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపు దిద్దుకొంటుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం అన్నీ సినిమా తెరపైన ఆడే పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి.

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు భారత దేశంలో తయారవుతున్నాయి. సినిమా ప్రభావం భారతీయులపైన, ప్రత్యేకించి తెలుగువారిపైన బాగా ఎక్కువ.

సినిమా అంటే

మార్చు

సినిమా, ఫిలిమ్, మూవీ, టాకీ అనేవన్నీ ఆంగ్లపదాలు. వీటి మధ్య కాస్త తేడాలున్నాయి గాని వీటన్నింటినీ ఇంచుమించు సమానార్ధకంగా వాడడం జరుగుతుంది.

  • సినిమా - తెలుగులో ఎక్కువగా ఉపయోగించే పదం. ఇది "cinema" అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది, ఇది గ్రీకు పదం "κίνημα" నుండి ఉద్భవించింది, దీని అర్థం కదలిక. ఇది అనేక ఐరోపా భాషలలో కూడా ఉంది.
  • ఫిలిమ్ - ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా హిందీలో ఎక్కువగా ఉపయోగించే పదం. ఇది కెమెరాలలో ఉపయోగించిన చలనచిత్రాన్ని సూచించే "film" (ఫిల్మ్) అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది. ఆంగ్లంలో, ఇది ఎక్కువగా యునైటెడ్ కింగ్‌డమ్, ఐరోపాలో ఉపయోగించబడుతుంది.
  • మూవీ - అమెరికన్ ఆంగ్లలో చాలా సాధారణ పదం, కానీ ఐరోపా, భారతదేశంలో అంత సాధారణం కాదు. ఇది "movie" అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది.
  • టాకీ - ఒక పాత పదం, ఆంగ్ల "talkie" నుండి, చలనచిత్రం ధ్వనిని ఉపయోగించడం ప్రారంభించిన రోజులను సూచిస్తుంది.

ఇక "Motion Picture" అనే ఆంగ్లపదానకి సరైన అనువాదపదంగా తెలుగులో చలనచిత్రం (సంస్కృత పదం నుండి "चलच्चित्रम्" అంటే "కదిలేబొమ్మ" అంటే అనేక భారతీయ భాషలలోకి మార్చబడింది) అంటారు. కాని సినిమా అనేదే బాగా జనబాహుళ్యంలో వాడే పదం. ఇంకా వెండితెర అనే పదాన్ని కూడా సినిమాను సూచిస్తూ వాడుతారు.

ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్ పై కెమేరాతో వరుసలో చిత్రాలు ముద్రంచడం అన్నది సినిమాకు ప్రధానమైన ప్రక్రియ. ఫిల్మ్‌ను ప్రొజెక్టర్‌లో వేగంగా కదపడం వలన వరుస చిత్రాలన్నీ ఒకదానితో ఒకటి కలసిపోయి ఆ చిత్రాలు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. దీనిని "Persistence of vision" అంటారు. మొదట మూగగా ప్రారంభమైన సినిమాలకు తరువాత ధ్వని తోడయ్యింది. ఆపై రంగులు అద్దారు. అలా సినిమా చాలా కాలం నుండి వర్ధిల్లుతూ వస్తోంది.

అయితే అన్ని రంగాలలోలాగానే సినిమారంగంలో కూడా ఇటీవల చాలా సాంకేతికమైన మార్పులు సంభవించాయి. ముఖ్యంగా కంప్యూటర్లు, డిజిటల్ టెక్నిక్కులు, యానిమేషన్ వంటి సాంకేతిక ఆవిష్కరణలు సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనలను అనూహ్యంగా ప్రభావితం చేశాయి.

సినిమా చరిత్ర

మార్చు

ఆరంభ దశ

మార్చు

సినిమాకు అత్యవసరమైన సాంకేతిక సిద్దాంతం "Persistence of Vision with Regard to Moving Objects" అనే పరిశోధనా వ్యాసంలో 1824లో పీటర్ మార్క్ రోజెట్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.[1]

ఎడిసన్ లాబొరేటరీస్‌లో పనిచేసే లారీ డిక్సన్ అనే వ్యక్తి ప్రప్రథమంగా వరుసక్రమంలో చిత్రాలుండే "సెల్యులాయిడ్ ఫిలిమ్‌"ను తయారు చేశాడు. తరువాత 1894లో థామస్ ఎడిసన్ "కైనెటో గ్రాఫ్" (కెమెరా), "కైనెటోస్కోప్" (ప్రొజెక్టర్) అనే రెండు పరికరాలను ఆవిష్కరించాడు. ప్రేక్షకులు ఒక చూపుడు గొట్టం (eye piece) ద్వారా అద్దంపై ప్రతిబింబించబడిన "కదిలే బొమ్మ"ను చూడడం సాధ్యమయ్యింది. "కైనెటోస్కోప్ పార్లర్లు" అమెరికాలోను, యూరోప్‌లోను విస్తరించాయి.

 
లూమిరె సోదరులు

అదే సమయంలో యూరోప్‌లో క్రొత్త కెమేరాలు, మరొకొన్ని పరికరాలు కనుగొన్నారు. బ్రిట్‌పాల్ అనే పరిశోధకుడు 1895లో యూరోప్‌లో ఒక "ఫిల్మ్ ప్రొజెక్టరు" పరికరాన్ని తయారు చేశాడు. ఫ్రాన్స్‌లో లూమిరె సోదరులు (ఆగస్టు లూమిరె, లూయిస్ లూమిరె) 1895లో ఒక సూట్‌కేసు సైజులో ఉన్న సినిమాటోగ్రాఫ్ పరికరాన్ని తయారు చేశారు. ఇందులో [2] కెమెరా, ఫిల్మ్ డెవెలప్‌మెంట్, ప్రొజెక్టర్ పనులన్నీ కలిపి చేయడం సాధ్యమయ్యింది. వారు తిరణాలవంటి జనసందోహాలలో ప్రజలవద్ద డబ్బులు తీసుకొని తమ కదిలే చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించారు. ఆధునిక సినిమాకు ఇదే నాంది అనవచ్చును. ఇతరులు కూడా ఇదే విధానాన్ని కొద్దిమార్పులతో (సాంకేతికంగానూ, వ్యాపారపరంగానూ) అనుకరించారు.

మూగ చిత్రాలు

మార్చు

చిత్రాలకు ధ్వనిని చేర్చడానికి చేసిన ప్రయత్నాలు 1920 దశకం వరకు విజయవంతం కాలేదు. కనుక మొదటి 30 సంవత్సరాలు మూగబొమ్మలే రాజ్యమేలాయి. ప్రదర్శన సమమయంలో వ్యాఖ్యాతలు తోడవ్వడం, లేదా వాద్యబృందాల సహకారం ఇలా రకరకాల హంగులు సమకూర్చేవారు.

మాటలు నేర్చిన చిత్రాలు

మార్చు

మొదట 1900 సంవత్సరంలో పారిస్‌లో చిత్రాలతో ధ్వని ప్రక్రియ కనుగొన్నారు. 1906లో లండన్‌లో యూజీన్ లాస్టే ఫిలిమ్‌తో ధ్వని విధానానికి పేటెంట్ పొందాడు. 1910లో ఇది ప్రయోగాత్మకంగా "J'entends très bien maintenant" అనే మాటలతో ధ్వనించింది. 1922లో బెర్లిన్‌లో ప్రేక్షకులముందు ధ్వనితో కూడిన చిత్రాన్ని ప్రదర్శించారు. 1923 నుండి న్యూయార్క్‌లో ప్రేక్షకులు డబ్బులిచ్చి "టాకీ" (శబ్ద చిత్రం)ను చూడడం ప్రారంభించారు. 1926లో వార్నర్ బ్రదర్స్ వారు "వైటాఫోన్" అనే సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. 1927లో వారి "The Jazz Singer" చిత్రం కొంత మూగ గానూ, కొంత మాటలు, పాటలు కలిపి విజయవంతంగా ప్రదర్శింపబడింది. 1928లో "The Lights of New York" అనే పూర్తి ధ్వనితో కూడిన చిత్రం వచ్చింది. ఆ తరువాత అంతా టాకీల యుగమే.

సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది.

సినిమాలో ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. కళ, నటన, పర్వవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపు దిద్దుకొంటుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం అన్నీ సినిమా తెరపైన ఆడే పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి.

భారతీయ భాషలలో తొలి టాకీ చిత్రాలు

మార్చు
భాష సినిమా పేరు సంవత్సరం భాష సినిమా పేరు సంవత్సరం
హిందీ ఆలం ఆరా 1931 తెలుగు భక్తప్రహ్లాద 1931
తమిళం కాళిదాసు 1931 బెంగాలి జమైసస్తి 1931
మరాఠీ అయోధ్యకె రాజా 1932 గుజరాతి నరసింగ్ మెహతా 1932
అస్సామీస్ జ్యోతిమర్తి 1933 కన్నడం సతీ సులోచన 1934
పంజాబి హీరో రాంజీ 1934 ఒరియా శిలత్ బిబాస్ 1936
మలయాళం బాలన్ 1938 రాజస్థానీ నజ్ రానా 1942
సింధి ఏక్ తా 1942 ఇంగ్లీష్ బ్లాక్ మెయిల్ 1929

రంగుల యుగం

మార్చు

తొలినాళ్ళలో సినిమాలు నలుపు తెలుపులలోనే ఉండేవి. 1906లో జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ "కైనెమాకలర్" పేరుతో రెండు రంగుల చిత్రాన్ని తయారుచేశాడు. 1909లో ఈ విధానం వాణిజ్యపరంగా ప్రదర్శనకు అమలుచేయబడింది. కాని ఇందులో చాలా సమస్యలుండేవి. 1932లో "టెక్నికలర్" అనే మూడు రంగుల ప్రక్రియ ఆరంభమైంది.

తెలుగు సినిమా

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు, వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=సినిమా&oldid=4205138" నుండి వెలికితీశారు