తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు
తాళ్ళపాక పెద తిరుమలాచర్యుడు ప్రముఖ సంగీతకారుడు, రచయిత. ఆయన ప్రముఖ సంగీత పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు. అన్నమయ్య పెద్ద భార్య అక్కాంబ కొడుకు.[1]
తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు | |
---|---|
వృత్తి | సంగీతకారుడు, రచయిత |
జననంసవరించు
ఇతడు క్రీ.శకం 1460 జన్మించి క్రీ.శకం 1546 వరకూ జీవించారు. 1546 వరకూ ఈయన శాసనములు కనిపించడం ద్వారా ఆయన అప్పటి వరకూ జీవించాడని తెలుస్తున్నది. 1460 వరకూ తండ్రి సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగిస్తూ, 13 గ్రామములు, అనేక కానుకలు స్వామివారికి సమర్పించాడు. అన్నమయ్య సంకీర్తనలను రాగిరేకులపై వ్రాయించి సంకీర్తనా భండాగారంలో భద్రపరపించాడు.
ఇతడు క్రీ.శ1458 నుంచి 1554 వరకూ అంటే 97 సంవత్సరాలు జీవించినట్లు తెలుస్తుంది.[2][1] అతను శ్రీకృష్ణదేవరాయ, అత్యుతదేవరాయ పరిపాలనలను చూచినట్లు స్పష్టమవుతుంది. తండ్రి అన్నమాచార్యుడు ఆరంభించిన స్వామి కైంకర్య కార్యక్రమాన్ని అతను జీవితాంతం కొనసాగించాడు. పెద తిరుమచార్యుడే చెప్పుకున్న విషయాన్ని స్వీకరిస్తే అన్నమాచార్యుడు దివంగతుడయ్యేసరికే పదకర్తగా అతను గణతకెక్కాడని భావించవచ్చు.
రచనలుసవరించు
పెద తిరుమలాచార్యుడు తిరుమలలోనే నివశిస్తూ అయనపై అనేక కీర్తనలు రచించాడు. అవి
- శృంగార సంకీర్తనలు
- ఆథ్యాత్మ సంకీర్తనలు
- వేంకటేశ్వర వచనములు __ వచన మాలికా గీతములు[3]
- శృంగారదండకము __ దండకము
- చక్రవాళ మంజరి __ మంజరీ ద్విపద
- శృంగార వృత్త శతకము __ శతకము
- నీతి సీస శతకము __ శతకము
- సుదర్శన రగడ __ రగడ
- రేఫ ఱకార నిర్ణయము __ లక్షణ గ్రంథము
- భగవద్గీత తెలుగు వచనము __ అనువాదము
- ఆంధ్రవేదాంతము అప్రకటితము
- ద్విపద హరివంశము __ ద్విపద (అలభ్యము )
- సంకీర్తన లక్షణ వ్యాఖ్య __ వ్యాఖ్యానము (అలభ్యము)
- శ్రీవేంకటేశ్వర ప్రభాతస్తవము __ద్విపద, ప్రకటితము
తాళ్లపాక వంశవృక్షంసవరించు
బయటి లింకులుసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 Gangappa, S. (1992). Annamacharya Pramukha Vaggeyakarulu : Tulanatmaka Parisilanamu (in Telugu).
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ ప్రముఖ వాగ్గేయకారులు. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (రెయిన్ బొ ప్రింట్ ed.). అమరావతి పబ్లికేషన్స్. p. 21.
- ↑ తాళ్లపాక పెద తిరుమలాచార్య (1945). శ్రీ వేంకటేశ్వరవచనములు. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు. Retrieved 28 August 2020.