సంగీతం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గంగూభాయ్ హంగల్ దుర్గా పాట |
---|
సంగీతం (Music) శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటి.

సంగీతం ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం, తాళం, పల్లవి మొదలైన శబ్ద లక్షణాలు. మ్యూజిక్ అనే పదం గ్రీకు భాష μουσική (mousike), "(art) of the Muses" నుండి వచ్చింది.[1] సంగీతం నిర్వచనం, లక్షణాలు, ప్రాముఖ్యత మొదలైనవి ఆ దేశ సంస్కృతి, సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. శాస్త్రీయ సంగీతం ఒక నిర్ధిష్టమైన సాహిత్యపరంగా రచించబడిన రాగాలకు నిబద్ధితమై ఉంటుంది. ఈ రాగాలు అనంతమైనవి. కొన్నింటిని పాడేవారిని బట్టి మారతాయి. సంగీతం సాహిత్యంతో మేళవించి నాట్యం (Dance), నాటకం (Drama), లలిత కళలు (Fine arts), సినిమా (Films) మొదలైన దృశ్య కావ్యాలుగా మలచబడ్డాయి.
బహుళ ప్రోగ్రామ్‌ల నుండి ఎలక్ట్రానిక్‌గా సేకరించబడింది. ఫెస్టివల్స్, రాక్ కచేరీలు మరియు ఆర్కెస్ట్రా ప్రదర్శనలు వంటి ఈవెంట్‌లలో ఫీచర్ చేయబడిన సంగీతం పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రదేశాలలో ప్లే చేయబడుతుంది మరియు ఫిల్మ్, టెలివిజన్ షో, ఒపెరా లేదా వీడియో గేమ్ యొక్క స్కోర్ లేదా సౌండ్‌ట్రాక్‌లో భాగంగా యాదృచ్ఛికంగా వినబడుతుంది. మ్యూజికల్ ప్లేబ్యాక్ అనేది MP3 ప్లేయర్ లేదా CD ప్లేయర్ యొక్క ప్రాథమిక విధి మరియు రేడియోలు మరియు స్మార్ట్‌ఫోన్‌ల యొక్క సార్వత్రిక లక్షణం.[2]
సంగీత విధానాలు సవరించు
- పాశ్చాత్య సంగీతం
- భారతీయ సంగీతం:
- హిందుస్తానీ సంగీతం:
- కర్ణాటక సంగీతం: భారతీయ శాస్త్ర సంగీతంలో ఒక శైలి. ఈ సంగీతం భారత ఉపఖండంలోని ద్రవిడ రాష్ట్రాలు లేదా దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ తమిళనాడులో ప్రఖ్యాతమైన సంగీతంగా గుర్తింపు పొందింది.
- సంప్రదాయ సంగీతం
- జానపద సంగీతం
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ Mousike, Henry George Liddell, Robert Scott, A Greek-English Lexicon, at Perseus
- ↑ "இசை பயன்பாடுகள் பற்றிய அனைத்து விவரங்களும்". APKNeix. 28 August 2022. Retrieved 26 August 2022.
ప్రముఖ గాయకులు, వాగ్గేయకారులు సవరించు
- తాళ్ళపాక అన్నమాచార్య - (1408-1503)
- త్యాగరాజు - (1767-1847)
- మంగళంపల్లి బాల మురళి కృష్ణ - [1](1938-2016)