తిత్తి (Cyst) అనగా ఒక రకమైన ద్రవ పదార్ధాలతో నిండిన సంచి. ఇవి వివిధ అవయవాలలో తయారుకావచ్చును. కొన్ని పుట్టిన దగ్గరనుండి ఉండవచ్చును. నిజమైన తిత్తుల లోపలివైపు వివిధ రకాల ఉపకళా కణజాలాలతో కప్పబడి ఉంటాయి. కృత్రిమమైన తిత్తుల లోపలివైపు ఏ విధమైన పొర ఉండదు.

సాధారణంగఅ తిత్తులను శస్త్రచికిత్స ద్వారా తొలగించవలసి వుంటుంది.

తిత్తులలో రకాలుసవరించు

  • వక్షోజాలలో తిత్తులు సాధారణంగా క్షీరనాళాల నుండి ఏర్పడతాయి.
  • ప్రోటోజోవా వంటి క్రిముల మూలంగా కొన్ని తిత్తులు తయారౌతాయి. ఉదా: హైడాటిడ్, సిస్టిసెర్కోసిస్.
  • డెర్మాయిడ్ లేదా ఎపిడెర్మాయిడ్ తిత్తులు
  • అండాశయములోని తిత్తులు కొన్ని కాన్సర్ కు సంబంధించినవి కూడా ఉంటాయి.
  • కాలేయము, మూత్రపిండాలు మొదలైన చాలా అవయవాలలో కూడా కొన్ని తిత్తులు ఏర్పడవచ్చును.
"https://te.wikipedia.org/w/index.php?title=తిత్తి&oldid=2329958" నుండి వెలికితీశారు