తిరునిన్ఱవూరు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరునిన్ఱవూరు ఒక ప్రసిద్ధిచెందిన దివ్యక్షేత్రం. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలు లో ఒకటి. ఇది చెన్నై నుండి అరక్కోణం మార్గములో నున్నది.
భక్తవత్సల పెరుమాల్ దేవాలయం, తిరునిన్ఱవురు Bakthavatsala Perumal Temple | |
---|---|
భౌగోళికాంశాలు : | 13°6′41″N 80°1′34″E / 13.11139°N 80.02611°E |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | తిరువళ్ళూరు |
ప్రదేశం: | తిరునిన్ఱవూరు |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | భక్తవత్సల (విష్ణువు) |
ప్రధాన దేవత: | నన్నుగన్నతల్లి |
దిశ, స్థానం: | తూర్పుముఖము |
పుష్కరిణి: | వరుణ పుష్కరిణి |
విమానం: | శ్రీనివాస విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | వరుణుడు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 6వ శతాబ్దం |
సృష్టికర్త: | పల్లవులు |
విశేషాలు
మార్చుతిరుమంగై ఆళ్వార్ తిరునీర్మలై క్షేత్రమును దర్శించి ఈ తిరునిన్ఱవూరు క్షేత్రమునకు వచ్చింది. కానీ ఇచట భక్తవత్సలస్వామి దివ్యమహిషితో ప్రణయ భోగాలాలసుడై ఆల్వార్లను కన్నెత్తియైన కటాక్షించలేదు. వెంటనే ఆళ్వార్లు స్థలశయన క్షేత్రమునకు వేంచేసి అచట స్వామి విషయమై "పారాయదు" అను దశకమును ప్రారంభించింది. ఇది గమనించిన పిరాట్టిమార్లు ఆళ్వార్లచే స్తుతింపబడు అవకాశము మన క్షేత్రమునకు లేకపోయెనే అని యోచించి, ఆమె ఎక్కడ ఉన్నా తీసుకొని రమ్మని స్వామిని పంపగా స్వామి స్థలశయన క్షేత్రమునకు వేంచేసి ఆళ్వార్ల ప్రత్యక్షం అయ్యాడు. తిరుమంగై ఆళ్వార్లు ఆ క్షేత్రము నందుండియే తిన్ఱవూరు స్వామికి మంగళా శాసనము చేసింది.
సాహిత్యంలో తిరునిన్ఱవూరు
మార్చు- శ్లోకము
వృద్ధః క్షీర తరంగిణీ తటగతే శ్రీ నిన్ఱవూర్ పట్టణే |
ప్రాప్తే వారుణ పద్మినీ స్థితిలసన్ శ్రీ శ్రీనివాసాలయః ||
ప్రాగాస్యో భువి భక్తవత్సల విభు ర్మన్మాతృదేవీ పతిః |
యాదోనాథ నిరీక్షితో విజయతే శ్రీ మత్కలిఘ్నస్తుతః ||
- పాశురము
పూణ్డవత్తం పిఱర్కడైన్దు తొణ్డుపట్టు
ప్పొయ్ న్నూలై మెయ్‌న్నూ లెనెన్ఱు మోది
మాణ్డు; అవత్తం పోగాదే వమ్మినెన్దై
యెన్ వణజ్గప్పడువానై; క్కణజ్గళేత్తుమ్
నీణ్డవత్తై క్కరుముగిలై యెమ్మాన్మన్నై
నిన్ఱవూర్ నిత్తిలత్తై త్తొత్తార్ శోలై
కాణ్డవత్తై క్కనలెరివాయ్ పెయ్ విత్తానై
క్కణ్డదునాన్ కడన్మ ల్లై త్తల శయనత్తే. - తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొళ్ 2-5-2.
వివరణ
మార్చుప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
భక్తవత్సలన్ (పత్తరావి పెరుమాళ్) | నన్ను గన్నతల్లి (ఎన్నపెత్తతాయ్) | వృద్ధక్షీరనది , వరుణ పుష్కరిణి | తూర్పుముఖము | నిలుచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | శ్రీనివాస విమానము | వరుణునకు |