తిరుమల పూలంగి సేవ
పూలంగి సేవ తిరుమల శ్రీనివాసునికి జరిగే సేవ. గురువారం నాడు సాయంకాల పూజానంతరం పానకం, వడపప్పు నైవేద్య సమర్పణానంతరం స్వామికి వెల్వెట్ గౌను వంటి వస్త్రాన్ని తొడుగుతారు. ఆపాద మస్తకం వివిధ రకాలైన పువ్వుల దండలతో అందంగా అలంకరిస్తారు. ఇలా పూలతో అలంకరించడం వలన ఈ సేవను పూలంగి సేవ అని అంటారు[1]. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి ఏకాంత సేవను ప్రారంభిస్తారు. వారంలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారికి పూలంగి సేవ జరుగుతుంది. అర్చకులు స్వామివారికి ఏకాంతంగా ఈ సేవ నిర్వహిస్తారు. [2]
ఈ పూలంగి సేవను ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మొదటి వైకుంఠం కాంప్లెక్స్ లో నిర్వహిస్తారు. ఒక పెద్ద లడ్డూ, వడ, జలేబీ, టెంటోలా, పులిహోరా, ఉత్తారియం లేదా జాకెట్టు ముక్క లను సేవ నిర్వహించిన తరువాత ప్రసాదం ఇస్తారు.[3]
చరిత్ర
మార్చుప్రాచీన తమిళ వాజ్మయానికి చెందిన శిలప్పదికారంలో 'పూవాడయిల్ పొలిందు తోన్ఱియ' అనే వాక్యం ఉంది. పూవడై అనే పదం తెలుగులో పూలంగి అనే పదానికి తమిళీకరణం. కాబట్టి ఎనిమిదవ శతాబ్దం నాటికే ఈ పూలంగి సేవ వ్యవహారంలో ఉన్నట్లు భావించవచ్చును.
మూలాలు
మార్చు- ↑ "Poolangi Seva | Tirumala Temple | Timings, Cost and Booking Procedure". Myoksha Travels (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-11-05. Retrieved 2020-06-30.
- ↑ "తిరుమల సమాచారం | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2020-06-30.
- ↑ Tirupati, Tirumala (2018-06-01). "Poolangi Seva". Tirumala Tirupati (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-30.