తిరుమల భూవరాహ స్వామి ఆలయం
శ్రీ వరాహస్వామి ఆలయం లేదా భూ వరాహస్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా తిరుమలలో ఉన్న వైష్ణవాలయం. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది.[1][2] ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే పురాతనమైనదని భావిస్తారు.[3] అందువల్లనే వేంకటాచలం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.
ఆది వరాహస్వామి ఆలయం, తిరుమల | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 13°41′05.6″N 79°20′51.9″E / 13.684889°N 79.347750°E |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
స్థలం | తిరుమల |
ఎత్తు | 853 మీ. (2,799 అ.) |
సంస్కృతి | |
దైవం | వరాహస్వామి (విష్ణువు), భూదేవి |
ముఖ్యమైన పర్వాలు | వరాహ జయంతి, వైకుంఠ ఏకాదశి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | ద్రావిడ వాస్తుశైలి |
దేవాలయాల సంఖ్య | 1 |
చరిత్ర, నిర్వహణ | |
దేవస్థాన కమిటీ | తిరుమల తిరుపతి దేవస్థానాలు |
వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఆ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు.[4] ఈ తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్శించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.[2]
ఈ ఆలయాన్ని సా.శ. 1535 లో పెద్ద తిరుమలాచార్య పునరుద్ధరించాడు.[5]
పూజలు
మార్చువైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఈ గుడిలో రోజువారీ పూజలు జరుగుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి చక్రస్నానం కార్యక్రమం జరుగుతుంది. వరాహస్వామి ఆలయ ముఖ మండపంలో వైకుంఠ ద్వాదశి, రథసప్తమి పండుగలు నిర్వహిస్తారు.[6] వరాహ జయంతిని కూడా జరుపుతారు.[1][2]
బయటి లింకులు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Tirumala Brahmotsavams conclude with 'Chakrasnanam'". The Times of India. 1 September 2011. Retrieved 15 December 2017.
- ↑ 2.0 2.1 2.2 "'Varaha jayanti' today". The Hindu. 4 September 2016. Retrieved 15 December 2017.
- ↑ Balaji-Venkateshwara, Lord of Tirumala-Tirupati: An Introduction. Vakils, Feffer, and Simons. 2003.
- ↑ Flueckiger, Joyce Burkhalter (1 January 2015). Everyday Hinduism. p. 114. ISBN 97-8140-516-0216.
- ↑ Rao, V. Kameswara (1986). Temples in and Around Tirupati. V. Jayalakshmamma. Retrieved 15 February 2019.
- ↑ "Tirumala Brahmotsavams conclude with 'Chakrasnanam'". The Hindu. 28 October 2017. Retrieved 15 December 2017.