తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషను
తిరువనంతపురం సెంట్రల్ కేరళ రాజధాని తిరువనంతపురము నందలి ప్రధాన రైల్వే స్టేషను. ఇది తిరువనంతపురమునకు నడిబొడ్డైన తంపనూరు ప్రాంతములో కలదు.దీని ఎదురుగా సెంట్రల్ బస్ స్టేషను కలదు.ఇది కేరళ రాష్ట్రములో పరిమాణ పరముగాను ప్రయాణికుల సంఖ్య పరముగాను అతి పెద్ద రైల్వే స్టేషను. ఇది దక్షిణ రైల్వే పరిధి లో కలదు. ఈ స్టేషను భవనము ఆ నగర వారసత్వ కట్టడములలో ఒకటి. ప్రతిపాదిత బెంగుళూరు-తిరువనంతపురము మఱియు తిరువనంతపురము-మంగుళూరు అతి వేగ రైలు మార్గ పథకమునకు తిరువనంతపురం సెంట్రలే గమ్య స్థానము. ఈ స్టేషనులో 5 ప్లాట్ ఫారములు గలవు. .
Thiruvananthapuram Central തിരുവനന്തപുരം സെൻട്രൽ | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | Thampanoor, Thiruvananthapuram, Thiruvananthapuram, Kerala India |
Coordinates | 8°29′15″N 76°57′07″E / 8.4874°N 76.952°E |
Elevation | 6.740 మీటర్లు (22.11 అ.) |
లైన్లు | Thiruvananthapuram – Kollam - Kayamkulam, Thiruvananthapuram – Kanyakumari, Thiruvananthapuram-Punalur-Erumeli via Nemom, Nedumangad |
ఫ్లాట్ ఫారాలు | 12 |
Connections | Taxi Stand,Pre paid Auto service, Thiruvananthapuram Central bus station of the KSRTC |
నిర్మాణం | |
నిర్మాణ రకం | Standard (on ground station) |
పార్కింగ్ | Available |
ఇతర సమాచారం | |
Status | Functioning |
స్టేషను కోడు | TVC |
జోన్లు | Southern Railway |
డివిజన్లు | Thiruvananthapuram Railway division |
History | |
Opened | 4 November 1931 |
విద్యుత్ లైను | Yes |
ప్రయాణికులు | |
ప్రయాణీకులు () | Unknown |
చరిత్ర
మార్చుమద్రాసు నుండి క్విలన్ కు ఒక రైలు మార్గము ఉండేది. ఆ రైలు మార్గము తిరువిదాంగూరు సంస్థాన రాజధానియైన తిరువనంతపురమునకు పొడిగింపబడెను. అప్పుడు ఆ మార్గము ఈ స్టేషనుకు కొంత దాపులో ఉన్న చక్క అను స్టేషను వద్ద నిలిచిపోయెను. చక్క అనునది అలనాడు తిరువనంతపుర వాణిజ్య ప్రాంతము. తిరువిదాంగూరు సంస్థాన దివాను అయిన ఎం.ఇ.వాట్స్ అనువారు ఈ రైలు మార్గమును చక్క నుండి ప్రస్తుతము సెంట్రల్ స్టేషను ఉన్న ప్రాంతమునకు పొడిగించుటకు కృషి చేసిరి.తిరువిదాంగూరు సంస్థాన మహారాణి సేతు లక్ష్మీ బాయి పాలనాకాలములో ఈ స్టెషను నిర్మింపబడి, 1931 ఫిబ్రవరి 4-వ తేదీన ప్రారంభింపబడెను. ఆనాడు ఇచ్చట ఒకే ఒక్క ప్లాట్ ఫారము ఉండేది. రోజుకు కేవలము రెండు రైళ్ళే రాకపోకలు సాగిస్తూ ఉండేవి.
రైళ్ళు
మార్చుతిరువనంతపురం సెంట్రల్ లో బయలుదేఱి వివిధ ప్రాంతములకు పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | గమ్య స్థానము | రైలు పేరు |
---|---|---|---|
1. | 16723/16724 | చెన్నై ఎగ్మోర్ | అనంతపురి ఎక్స్ ప్రెస్ |
2. | 12623/12624 | చెన్నై సెంట్రల్ | చెన్నై మెయిల్ |
3. | 12695/12696 | చెన్నై సెంట్రల్ | చెన్నై ఎక్స్ ప్రెస్ |
4. | 12697/12698 | చెన్నై సెంట్రల్ | చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్ |
5. | 22207/22208 | చెన్నై సెంట్రల్ | చెన్నై ఏ.సి. ఎక్స్ ప్రెస్ |
6. | 16331/16332 | ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ | ముంబై ఎక్స్ ప్రెస్ |
7. | 16345/16346 | ముంబై లోకమాన్య తిలక్ టర్మినస్ | నేత్రావతి ఎక్స్ ప్రెస్ |
8. | 12625/12626 | క్రొత్త ఢిల్లీ | కేరళ ఎక్స్ ప్రెస్ |
9. | 12431/12432 | హజ్రత్ నిజాముద్దీన్ | రాజధాని ఎక్స్ ప్రెస్ |
10. | 12643/12644 | హజ్రత్ నిజాముద్దీన్ | స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
11. | 22633/34 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
12. | 22653/54 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (కోటయం మీదుగా) |
13. | 22655/56 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
14. | 16323/16324 | షాలీమార్ | షాలీమార్ ఎక్స్ ప్రెస్ |
15. | 16325/16326 | ఇండోర్ | అహల్యానగరి ఎక్స్ ప్రెస్ |
16. | 22647/22648 | కోర్బా | కోర్బా ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
17. | 16333/16334 | వేరావల్ | వేరావల్ ఎక్స్ ప్రెస్ |
18. | 12515/12516 | గౌహతి | గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
19. | 12507/12508 | గౌహతి | గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
20. | 16347/16348 | మంగుళూరు సెంట్రల్ | మంగుళురు ఎక్స్ ప్రెస్ |
21. | 16603/16605 | మంగుళూరు సెంట్రల్ | మావేళి ఎక్స్ ప్రెస్ |
22. | 16629/16630 | మంగుళూరు సెంట్రల్ | మలబార్ ఎక్స్ ప్రెస్ |
23. | 17229/17230 | హైదరాబాదు దక్కన్ | శబరి ఎక్స్ ప్రెస్ |
24. | 12511/12512 | గోరఖ్ పూర్ | రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
25. | 12075/12076 | కోళిక్కోడ్ (లేక క్యాలికట్) | కోళిక్కోడ్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ |
26. | 12081/12082 | కణ్ణూర్ | కణ్ణూర్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ |
27. | 16301/16302 | షోర్నూరు | వేనాడు ఎక్స్ ప్రెస్ |
28. | 16303/16304 | ఎఱణాకుళము | వాంచినాడు ఎక్స్ ప్రెస్ |
29. | 16341/16342 | గురువాయూరు | ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ |
30 | 16343/16344 | పాలక్కాడు టౌన్ (లేక పాల్ఘాట్) | అమృతా ఎక్స్ ప్రెస్ |
31. | 16349/16350 | నీలాంబూరు రోడ్డు | రాజ్య రాణి ఎక్స్ ప్రెస్ |
తిరువనంతపురం సెంట్రల్ నుండి బయలుదేఱు ప్యాసింజర్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | గమ్య స్థానము |
---|---|---|
1. | 56313 | నాగర్ కోవిల్ |
2. | 56311 | నాగర్ కోవిల్ |
3. | 56315 | నాగర్ కోవిల్ |
తిరువనంతపురం సెంట్రల్ మీదుగా పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | ఆరంభ స్థానము | గమ్య స్థానము | రైలు పేరు |
---|---|---|---|---|
1. | 16605/16606 | నాగర్ కోవిల్ | మంగుళూరు | ఎర్నాడు ఎక్స్ ప్రెస్ |
2. | 12659/12660 | నాగర్ కోవిల్ | షాలిమార్ | గురుదేవ్ ఎక్స్ ప్రెస్ |
3. | 16335/16336 | నాగర్ కోవిల్ | గాంధీధాం | నాగర్ కోవిల్-గాంధీధాం ఎక్స్ ప్రెస్ |
4. | 16381/16382 | కన్యకుమారి | ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ | కన్యకుమారి-ముంబై ఎక్స్ ప్రెస్ |
5. | 16525/16526 | కన్యకుమారి | బెంగుళూరు | ఐల్యాండ్ ఎక్స్ ప్రెస్ |
6. | 16317/16318 | కన్యకుమారి | జమ్మూ టావి | హిం సాగర్ ఎక్స్ ప్రెస్ |
7. | 19577/19578 | తిరునెల్వేలి | హాప | తిరునెల్వేలి- హాప ఎక్స్ ప్రెస్ |
8. | 22619/22620 | తిరునెల్వేలి | బిలాస్పూర్ | బిలాస్పూర్ ఎక్స్ ప్రెస్ |
9. | 15905/15906 | కన్యకుమారి | డిబ్రూఘర్ | వివేక్ ఎక్స్ ప్రెస్ * |
10. | 16127/16128 | గురువాయూరు | చెన్నై ఎగ్మోర్ | గురువాయూరు-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ |
11. | 16649/16650 | నాగర్ కోవిల్ | మంగుళూరు సెంట్రల్ | పరశురాం ఎక్స్ ప్రెస్ |
- వివేక్ ఎక్స్ ప్రెస్ దేశములో అత్యధిక దూరము ప్రయాణించెడి రైలు