తీన్
తీన్ 2016లో విడుదలైన హిందీ సినిమా. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, క్రోస్ పిక్చర్స్ బ్యానర్‌ల పై సుజోయ్ ఘోష్, గులాబ్ సింగ్ తన్వర్, హియ్ నువో థామస్ కిమ్, సురేష్ నాయర్, సమీర్ రాజేంద్రన్, గౌరీ సాతే నిర్మించిన ఈ సినిమాకు రిబు దాస్ గుప్తా దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, నవాజుద్దిన్ సిద్దిఖీ, విద్యాబాలన్, సబ్యాసాచి చక్రబర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 10 జూన్ 2016న విడుదలైంది.
తీన్ | |
---|---|
దర్శకత్వం | రిబు దాస్ గుప్తా |
స్క్రీన్ ప్లే | సురేష్ నాయర్ రితేష్ షా బిజేష్ జయరాజన్ |
నిర్మాత | సుజోయ్ ఘోష్ గులాబ్ సింగ్ తన్వర్ హియ్ నువో థామస్ కిమ్ సురేష్ నాయర్ సమీర్ రాజేంద్రన్ గౌరీ సాతే |
తారాగణం | అమితాబ్ బచ్చన్, నవాజుద్దిన్ సిద్దిఖీ, విద్యాబాలన్ |
ఛాయాగ్రహణం | తుషార్ కంతి రాయ్ |
కూర్పు | గైరిక్ సర్కార్ |
సంగీతం | క్లింటన్ సెరిజో |
నిర్మాణ సంస్థలు | రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, క్రోస్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 10 జూన్ 2016 |
సినిమా నిడివి | 136 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 340 మిలియన్ [1] |
బాక్సాఫీసు | 323.1 మిలియన్ (అంచనా)[2] |
కథ
మార్చుజాన్ బిస్వాస్ (అమితాబ్ బచ్చన్) మనవరాలిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. తన మనవరాలి కోసం ఎనిమిదేళ్లుగా జాన్ వెతుకుతూనే వుంటాడు. కానీ ఎలాంటి ఆధారం దొరకదు. ఏదైనా చిన్న క్లూ దొరుకుతుందా అని జాన్ ఇంకా వెతుకుతూనే వుంటాడు. అనుకోకుండా ఇదే తరహాలో కిడ్నాప్ జరిగిందని తెలుసుకుంటాడు జాన్. ఈ కేసుకు పోలీస్ ఆఫీసర్ సరిత సర్కార్ (విద్యాబాలన్) ఇంచార్జ్ గా వుంటుంది. ఫాదర్ మార్టిన్ దాస్ (నవాజుద్దిన్ సిద్ధిఖి) జాన్ కు సహాయం చేయడంలో తోడుగా వుంటాడు. చివరకు తన మనవరాలు దొరికిందా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- అమితాబ్ బచ్చన్
- నవాజుద్దిన్ సిద్దిఖీ
- విద్యాబాలన్
- సబ్యాసాచి చక్రబర్తి
- పద్మావతి రావు
- ఆర్నా శర్మ
- తోట రాయ్ చౌధురి
- రికీ పటేల్
- అనుపమ్ భట్టాచార్య
- దేబ్లిన చక్రవర్తి
- ముకేశ్ చాబ్రా
- ప్రకాష్ బేలవాడి
- మసూద్ అఖ్తర్
- ఫల్గుణి ఛటర్జీ
- అరుణ్ సాహా
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, క్రోస్ పిక్చర్స్
- నిర్మాత: సుజోయ్ ఘోష్
గులాబ్ సింగ్ తన్వర్
హియ్ నువో థామస్ కిమ్
సురేష్ నాయర్
సమీర్ రాజేంద్రన్
గౌరీ సాతే - కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రిబు దాస్ గుప్తా
- సంగీతం: క్లింటన్ సెరిజో
- సినిమాటోగ్రఫీ: తుషార్ కంతి రాయ్
- ఎడిటర్ : గైరిక్ సర్కార్
మూలాలు
మార్చు- ↑ "TE3N - Movie - Box Office India". www.boxofficeindia.com.
- ↑ Bollywood Hungama. "Box Office: Worldwide Collections and Day wise breakup of TE3N". Retrieved 18 October 2016.
- ↑ The Hindu (10 June 2016). "Te3n: A good old-fashioned mystery" (in Indian English). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.