విద్యా బాలన్

సినీ నటి

విద్యా బాలన్ ఒక భారతీయ సినీ నటి. పలు హిందీ, బెంగాలీ, మలయాళ చిత్రాలలో నటించింది. ఈమె తన నటనరంగ ప్రవేశం మ్యూజిక్ వీడియోలలో, సీరియళ్ళలో, వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా చేసారు.

విద్యా బాలన్
ముంబై లో WWF ప్రపంచ ధరిత్రీ కార్యక్రమం లో విద్య
జననం (1978-01-01) 1978 జనవరి 1 (వయసు 46)
ఒట్టపాలం, కేరళ, భారత దేశం
విద్యాసంస్థముంబై విశ్వవిద్యాలయం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–present
జీవిత భాగస్వామిసిద్ధార్థ్ రాయ్ కపూర్ (2012–ఇప్పటి వరకు)

నేపధ్యము

మార్చు

విద్య జనవరి 1న కేరళలో జన్మించింది. తండ్రి పి.ఆర్.బాలన్. తల్లి సరస్వతీ బాలన్. చిన్నతనంలోనే మాధురీ దీక్షిత్ నటనతో ప్రేరణ పొంది సినిమా రంగంలో అడుగు పెట్టాలని ఆశపడేది. ముంబైలో పెరిగింది. సెయింట్ ఆంథొనీ గల్స్ హయ్యర్ స్కూల్, చెంబూరులో చదివింది. ఆపై సెయింట్ జేవియర్స్ కాలేజీలో సోషాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

నట జీవితము

మార్చు
  • పదహారేళ్ల వయసులో ఏక్తాకపూర్ నిర్మించిన 'హమ్ పాంచ్' అనే హిందీ సీరియల్లో నటించింది. హీరోయిన్ అవ్వాలనుకుంటున్నట్టు ఇంట్లో చెబితే ముందు చదువు పూర్తిచేయమన్నారట. అలా సోషియాలజీలో ముంబయి యూనివర్శిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పొందింది.
  • ఆ తర్వాత మెల్లగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది . మొదట మలయాళంలో మోహన్‌లాల్ సరసన చక్రం సినిమాకు సైన్ చేసింది. కానీ నిర్మాణంలో సమస్యలు తలెత్తడం వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆపేశారు. దాంతో మలయాళం ఇండస్ట్రీలో విద్యకు 'ఐరెన్‌లెగ్'గా పేరు పెట్టేశారు.
  • దాంతో తమిళంపై దృష్టి పెట్టింది. 2002లో రన్ సినిమాలో ఈమెను హీరోయిన్‌గా ఎంచుకున్నా తర్వాత మీరాజాస్మిన్‌తో రీప్లేస్ చేశారు. అలాగే మనసెల్లం సినిమాలో తీసుకుని త్రిషా కృష్ణన్‌తో రీప్లేస్ చేశారు.
  • ఆఖరుకి నానా తంటాలు పడి 2003లో కలారి విక్రమన్ అనే సినిమా పూర్తి చేసినా.. అది విడుదలకు నోచుకోలేదు. ఇలా కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు పడింది .
  • తర్వాత 2005లో పరిణీత సినిమా ద్వారా హిందీలో రంగప్రవేశం చేసింది. అది ఫర్వాలేదనిపించడంతో సంజయ్‌దత్ సరసన లగే రహో మున్నాభాయ్‌లో జాహ్నవిగా ఒక వెలుగు వెలిగే అవకాశం కొట్టేసింది.
  • అది కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వడంతో ఈమె బండి గాడిలో పడింది. అలా హే బేబి, బూల్ బూలాఇయా, కిస్మత్ కనెక్షన్, పా, ఇష్కియా, నో వన్ కిల్డ్ జెస్సికా, ది డర్టీ పిక్చర్, కహానీ, ఘన్ చక్కర్, షాదీకి సైడ్ ఎఫెక్ట్స్.. వంటి సినిమాల్లో నటించి తన నటనా చాతుర్యం ఏమిటో అందరికీ చాటి చెప్పింది.
  • ఈమె ఏ పాత్ర చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే వేరెవరినీ అనుసరించకుండా తనదైన స్త్టెల్‌ని ప్రతిచోటా ప్రదర్శిస్తుంది. అందుకే ప్రేక్షకుల్లో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోగలిగింది.
  • విద్యకు థాయ్ వంటకాలంటే చాలా ఇష్టమట. అవి కాకుండా ఇంట్లో వండే పదార్థాలనే ఎక్కువగా తింటుందట! హిందీనే కాకుండా తమిళం, మలయాళం, బెంగాలీ భాషలు కూడా మాట్లాడగలదట!
  • 2012 డిసెంబరులో సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని వివాహమాడింది విద్య. పెళ్ళి తర్వాత వచ్చిన ఘన్‌చక్కర్, షాదీకి సైడ్ ఎఫెక్ట్స్ సినిమాలు ఫర్వాలేదనిపించాయి.
  • అది ఏ వేడుకైనా సరే.. చీరలోనే దర్శనమిచ్చే విద్య చీరకట్టుకే 'ట్రేడ్‌మార్క్' అయిందంటే ఆశ్చర్యం లేదు! అందుకే ప్రఖ్యాత డిజైనర్లు పోటీపడి మరీ ఆమెకు చీరలు డిజైన్ చేస్తున్నారు.

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
2003 భాలో థేకొ ఆనంది బెంగాలీ చిత్రం
2005 పరిణీత లలిత
2006 లగేరహో మున్నాభాయ్ ఝాన్వి
2007 గురు మీనాక్షి మీను సక్సేనా
2007 సలామ్-ఏ-ఇష్క్ తహ్జీబ్ రైనా
2007 ఎకలవ్య రాజేశ్వరి
2007 హే బేబీ ఇషా సాహ్ని
2007 భూల్ భులయ్యా అవని చతుర్వేది / మంజులిక
2007 ఓం శాంతి ఓమ్ విద్య అతిథి పాత్ర
2008 హల్లా బోల్ స్నేహ
2008 కిస్మత్ కనెక్షన్ ప్రియ
2009 పా విద్యా
2010 ఇష్కియా కృష్ణా వర్మ
2011 నో వన్ కిల్ల్డ్ జెస్సికా సబ్రినా లాల్
2011 ఉరుమి భూమి/ మక్కోమ్ మలయాళ చిత్రం
అతిధి పాత్ర
2011 ధ్యాంక్యూ కిషన్ భార్య అతిథి పాత్ర
2011 దం మారో దమ్ శ్రీమతి కామత్ అతిథి పాత్ర
2011 ద డర్టీ పిక్చర్ సిల్క్ స్మిత / రేష్మా
2012 కహానీ విద్యా బాగ్చి
2012 ఫెర్రారీ కీ సవారీ ప్రత్యేక గీతం
2013 బోంబే టాకీస్ విద్య ప్రత్యేక గీతం
2013 ఘన్ చక్కర్ నీతూ ఆత్రే
2013 షాదీకే సైడ్ ఎఫెక్ట్స్ త్రిష
2016 తీన్ సరిత సర్కార్
2022 జల్సా

పురస్కారాలు

మార్చు
 
పద్మశ్రీపురస్కారం

ఇవి కూడ చూడండి

మార్చు

పా (సినిమా)

బయటి లంకెలు

మార్చు