తుమ్మల రంగారెడ్డి

తుమ్మల రంగారెడ్డి నిజామాబాదు జిల్లాకు చెందిన స్వాతంత్ర్యసమరయోధుడు, భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు.

రాజకీయ జీవితం మార్చు

అతను రంగారెడ్డి ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు గెలవగా, బాల్కొండ నియోజకవర్గం నుండి ఒకసారి, మొత్తం నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికలలో గెలిచాడు.[1] రంగారెడ్డి ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనతను కూడా సాధించాడు.[2]

1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా బాల్కొండ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప పి.డి.ఎఫ్ అభర్థి రాజాగౌడ్ పై 12331 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. [3]1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. [4] 1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి 25399 ఓట్లను సాధించాడు. ఈ ఎన్నికలలో సమీప స్వతంత్ర అభ్యర్థి జి.ఎస్.రావుకు 15767 ఓట్లు లభించాయి. అతను 9632 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. [5] 1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి సుదర్శనరావుపై 18042 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[6]

మూలాలు మార్చు

  1. "ఆర్మూర్‌.. బాల్కొండ.. ఏ గట్టుకు ఎవరిని పంపుతారో! - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-11.
  2. Codingest. "తెలంగాణ - CLICK HERE - Tollywood Latest News | Movie Reviews and Cinema Gossips| Live Telugu Channels". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2020-07-11.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1957". Elections in India. Archived from the original on 2019-11-27. Retrieved 2020-07-11.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1962". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-11.
  5. "Andhra Pradesh Assembly Election Results in 1967". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-11.
  6. "Andhra Pradesh Assembly Election Results in 1972". Elections in India. Archived from the original on 2020-02-02. Retrieved 2020-07-11.