తులసీదాసు

కవి మరియు హిందీ భాషలో రామాయణాన్ని రచించారు
(తులసీదాస్ నుండి దారిమార్పు చెందింది)

గోస్వామి తులసీదాసు[3][ 1497/1532[1] - 1623 ] గొప్ప కవి . అతను ఉత్తర ప్రదేశ్ లోని రాజపూర్ (ప్రస్తుత బండా జిల్లాలోనిది) గ్రామంలో జన్మించాడు . తన జీవిత కాలంలో 12 పుస్తకాలు కూడా వ్రాశాడు . హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఒకనిగా నిలిచాడు[4][5][6][7]. ఆయన రచనలు, ఆయన కళారంగ సేవలు, భారతదేశ సంస్కృతి, సమాజంలో విశేష ప్రభావం చూపాయి. దీని కారణంగా రామగాథలు, నాటకాలు, హిందూస్థానీ సాంప్రదాయ సంగీతం, పాపులర్ సంగీతం, టెలివిజన్ సీరియళ్ళు అనేకం విలసిల్లాయి.[8][9][10][11][12][13]. ఈయన శ్రీరాముని పరమభక్తుడు. ఈయన రామాయణాన్ని హిందీమూలంలో అందించిన తొలి కవి[14]. అలాగే రాముని భక్తుడు అయిన ఆంజనేయునిపై హనుమాన్‌ చాలీసాను కూడా రచించాడు. విశేషం ఏమిటంటే ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతటా ఏ ప్రాంత, ఏ రాష్ట్రప్రజలైనా కూడా "హనుమాన్ చాలీసా"ను అన్ని భాషలవారూ పరమభక్తితో పఠిస్తారు ! అంతనమ్మకం ఉన్నది ఈ రచనమీద.

గోస్వామి తులసీదాసు
Stamp on Tulsidasవవవవవవవవ x , . . Cz cc c. , M. ,
భరతదేశంలోని చిత్రకూట ప్రాంతంలో తులసీపీఠంనందలి విగ్రహం
జననంరాంబోలా
1497 లేదా 1532[1], CV. వాళ్లు . , Z. , , , ,. , ,,.
రాజపూర్, ఉత్తరప్రదేశ్ (ప్రస్తుతం చిత్రకోట్ జిల్లా)
నిర్యాణము1623
అస్సీ ఘాట్, వారణాశి (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ )
బిరుదులు/గౌరవాలుగోస్వామి, అభినవ వాల్మీకి, భక్తశిరోమణి, మొదలగునవి
గురువునరహరిదాసు .
తత్వంవైష్ణవ మతం
సాహిత్య రచనలురామచరిత మానస్, వినయపత్రిక, దోహావళి, కవితావళి, హనుమాన్ చాలీసా, వైరాగ్య సందీపని, జానకీ మంగళ్, పార్వతీ మంగళ్ మొదలైనవి.
ఉల్లేఖనI సీతా రాముల నుండి పుట్టినట్లు భావించి, రెండు చేతులతో మొత్తం ప్రపంచానికి నమస్కరించండి.[2]

జీవిత విశేషాలు

మార్చు

గోస్వామి తులసీదాసు ఉత్తరప్రదేశ్‌ బాండా జిల్లా రాజ్‌ పూర్‌లో 1532లో ఆత్మారాం దుబే, హుల్సీ దేవి దంపతులకు జన్మించాడు. రామాయణాన్ని సంస్కృతంలో విరచించిన వాల్మీకి యొక్క అవతారమే తులసీదాసు అని అంటారు. భక్తి, కావ్య రచన, తాదాత్మ్యత, భాష - వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు తులసీదాసు తన జీవితాన్ని రామభక్తికి అంకితం చేశాడు[15]. గోస్వామి తులసీదాసు అవధ ప్రాంత కవి, తత్వవేత్త. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీప ప్రాంతాలను అప్పట్లో అవధ దేశంగా పిలిచేవారు. తులసీదాసు జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు.

వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీరామచరితమానస్‌గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని దశరథనందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంథం పూర్తికావటానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు[16].ఆయన తదనంతరం వారణాసిలో "తులసీ ఘాట్" ఏర్పడింది.[3] తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హుమాన్‌ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్‌ చాలీసా వంటివి ఉన్నాయి.

వ్యక్తిగత జీవితం

మార్చు
 
తులసీదాసు యొక్క చిత్రము

ఈయన వారణాసిలో సంకటమోచన్‌ దేవాలయాన్ని కట్టించాడు.[17] దీనిని రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా కట్టించాడని ప్రతీతి. ఈ దేవాలయం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి దక్షిణ దిక్కులో ఉంది.తులసీదాసు తండ్రి ఆత్మారాముడు, తల్లి హులసీ.తులసీదాసు జన్మించినప్పుడు అయిదు సంవత్సరాల బాలకుడివలే కనిపించాడట.తల్లితండ్రులాతని విలక్షణ రూపానికి భయపడి తమ యింటిదాసి మునియాకు పెంచుకొనుటకు ఇచ్చిరి.ఇదియేకాక మూలా నక్షత్రమందు జన్మించుటవలన అరిష్ట సూచకంగా భావించి త్యజించినట్లు వదంతి కూడా ఉంది.తల్లితండ్రులచే అతడు త్యజించినట్లు తెలియుచున్నది.జనిక జననీతజ్యో జనమి-జన్మిచగనే జననీ జనకులు త్యజించిరి-అని తులసీదాసు ఒకచోట వ్రాసి యున్నాడు. తరువాత కొద్దికాలానికి ఆతనిని పెంచుకొన్న మునియాదాసి కూడా చనిపోయింది. అపుడు అతడు బాబా నరహరిదాసు అనే సాధువు ఆ అనాథబాలుడైన తులసీదాసుని పెంచి విద్యనేర్పెను. తరువాత శేషసనాతనుడనే శ్రేష్ఠునివద్ద తులసీదాసు వేద, వేదాంగములు అభ్యసించాడు. తులసీ దాస్ అనాథబాలుడైనను ఆతని రూప, గుణ, శీల, స్వభావ, విద్వత్తులకు ముగ్ధుడై ఒక కులీన బ్రాహ్మణ డాతనికి తన కన్యనిచ్చి వివాహం చేశాడు.తులసీదాసు మహా రసికుడు. తన భార్యయైన రత్నావళియందు ఆద్యంత అనురక్తుడుగా ఉండేవాడు. అయితే ఒకనాడు తానింటివద్ద లేని సమయంలో అతనిభార్య రత్నావళి పుట్టింటికి వెళ్ళింది. ఈవార్త తెలియగానే భార్య ఎడబాటును సహించలేక తులసీదాసు ఆమెను చేరుకొనుటకు బయలుదేరెను.నిబిఢాంధకారమైన ఆరాత్రి, దానికి తోడు కుంభవృష్టి పడుతూవుంది.అటువంటి భయంకరమైన రాత్రి సమయంలో అతడు తన భార్య వద్దకు గంగానదిని దాటి చేరుకొన్నాడు. ఆ సమయంలో అతని భార్య రత్నావళి గావించిన హెచ్చరిక అతని జీవితాన్నే మార్చి వేసింది.

అస్థిచర్మమయ దేహ మను తామేజైసీప్రీతి
తైసి జో శ్రీరామమహ హోత వతౌభవతి!

నాధా! అస్థి చర్మమయమైన నాదేహమందున్నంత ప్రీతి ఆ శ్రీరామునియందున్నచో భవభీతియే యుండదుగదా! రత్నావళి ఈ గంభీరోక్తి తులసీదాసుకు తారకమంత్రమయినది. అప్పటి నుంచి తులసీదాసు విరాగియై శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నుడైనాడు.అయోధ్య, కాశీలు తులసీదాసుకు నివాసస్థానాలయ్యాయి.జీవిత చరమదశయందు కాశీయే నివాసస్థానమయింది. లోకకల్యాణ కరమైన 'రామచరితమానస్' మాహాకావ్యాన్ని వ్రాయడం తులసీదాసు అయోధ్యలోనే ప్రారంభించాడు.తరువాత కాశీలోవుంటు రెండున్నర సంవత్సరాలలో రామచరితమానస్ పూర్తి చేశాడు. తులసీదాసు సంస్కృతంలో మహాపండితుడై వుండికూడా రామాయణగాధను ప్రజలకందించేందుకు అయోధ్య ప్రాంత ప్రజల భాషయైన అవధీలో వ్రాశాడు.దేశీయ చంధస్సులైన దోహా, చౌపాయి, కవిత్త మొ.చంధస్సులలో వ్రాయడం చేతను, సరళమైన సంస్కృత, తత్త్సమశబ్ద బహుళమైన అవధీభాషలో వ్రాయడం చేతను తులసీ రామాయణం లోకప్రసిద్ధి గాంచింది.

ఆధ్యాత్మిక ప్రేరణ

మార్చు

తనపై అతనికి గల తీవ్ర ప్రేమ గురించి తెలుసుకున్న రత్నావళీ ఇలా చెప్పింది. "నా ప్రాణనాధా! మిమ్మల్ని చూడటం నాకు సంతోషం కలిగిస్తుంది. నాపై మీకు గల తీవ్రమైన ప్రేమ మీరు గంగానదిని దాటేటట్లు చేసింది. కనుక కచ్చితంగా భగవంతుని దివ్య ప్రేమ ఎవరికైనా ఈ భౌతిక ప్రపంచమును అధిగమించేందుకు సహాయ పడుతుంది." అంది. ఈ మాటలు విన్న తులసీదాసు మేథ ఒక ఆకస్మికమైన మలుపు తిరిగింది. వైవాహిక సంబంధమైన ప్రేమ దివ్యప్రేమగా రూపాంతరం చెందింది. అతడు తక్షణమే బదరీనీ, సోరోన్‌ను కూడా విడిచి పెట్టాడు.

తులసీదాసు ఒక సన్యాసిగా మారిపోయి అదృశ్యమయ్యాడు. ఎంత వెదకినా అతని జాడ దొరకలేదు. ప్రేమ విశ్వాసాలు గల తులసీదాసు భార్య దిక్కులేనిది అయిన రత్నావళి అన్ని సుఖాలను విసర్జించి చివరి వరకు ఒక వైరాగ్య జీవితాన్ని గడిపింది. బదరి నుండి తులసీదాసు విస్తృతంగా పర్యటించాడు. దేశ దిమ్మరి అయిన ఒక సంగీత పాటకునిగా, కొన్ని సమయాల్లో అద్భుత క్రియలు చేస్తూ జీవితం కొనసాగించాడు తులసీదాసు. కొంతకాలంపాటు తులసీదాసు చిత్రకూటంలో, అయోధ్యలో నివసించాడు. రాజపూర్‌ను నిర్మించారు.

రచనలు

మార్చు
  1. రామచరితమానస్
  2. రామలలా నహచూ
  3. వైరాగ్య సందీపనీ
  4. వరవై రామాయణం
  5. పార్వతీ మంగళ్
  6. జానకీ మంగళ్
  7. రామాజ్ఞాప్రశ్న
  8. దోహావళీ
  9. కవితావళీ
  10. గీతావళీ
  11. శ్రీకృష్ణ గీతావళీ
  12. వినయ పత్రికా
  13. సతసఈ
  14. ఛందావలీ రామాయణం
  15. కుండలియా రామాయణం.
  16. రామ శలాకా
  17. సంకట మోచన
  18. కరఖా రామాయణం.
  19. రోలా రామాయణం.
  20. ఝూలనా
  21. ఛప్పయ రామాయణం.
  22. కవిత్త రామాయణం.
  23. కలిధర్మాధర్మ నిరూపణ
  24. హనుమాన్ చాలీసా

అవసాన కాలం

మార్చు

అవసాన సమయంలో ఆఖరికి వారణాశిలో స్థిరపడ్డాడు. అక్కడే సా.శ.1623లో తన తనువు చాలించాడు.

గోస్వామి తులసీదాస కృత శ్రీరుద్రాష్టకమ్

మార్చు

నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ .
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహమ్ .. 1..

నిరాకార ఓంకారమూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్ .
కరాళం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్ .. 2..

తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్ .
స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్ఫాలబాలేందు కంఠే భుజంగా .. 3..

చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్ .
మృగాధీశచర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి .. 4..

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటిప్రకాశమ్ .
త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్ .. 5..

కలాతీత కల్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ .
చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ .. 6..

న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్ .
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ .. 7..

న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్ .
జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో .. 8..

రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే .
యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ..

ఇతి శ్రీగోస్వామితులసీదాసకృతం శ్రీరుద్రాష్టకం సంపూర్ణమ్

తాత్పర్యము

నిర్వాణ రూపమైన ఈశాన మూర్తికి నమస్కారములు (శివుని పంచ ముఖ రుద్ర రూపములలో ఈశాన ముఖము ఒకటి).విభుడు (రక్షకుడు, శుభకరుడు, ప్రభువు అని అర్థం), సర్వ వ్యాపకుడు, పర బ్రహ్మం, వేద స్వరూపుడు, సత్యమైన వాడు, గుణములు లేని వాడు, వికల్పము లేని వాడు, విశ్వ వ్యాపుడు, ఆకాశ రూపుడు, దివ్యాకాశంలో నివసించే వాడు అయిన శివుని భజిస్తున్నాను.

నిరాకారుడు (ఆకారము లేని వాడు), ఓంకారానికి మూలమైన వాడు, తురీయుడు (జాగ్రత్, సుషుప్త, స్వప్నావస్థలను దాటిన అత్యుత్తమమైన అవస్థ), గిరిపై నివసించే వాడు, పర్వతములకు అధిపతి, కరాళుడు (దుష్ట శిక్షణలో), యముని పాలిటి మృత్యువు (మృత్యువుని జయించుటకు సాధనం అని అర్థం), కృపాకరుడు, గుణములకు అతీతమైన వాడు, సంసార వారధిని దాటించే వాడు అయిన పరమ శివునికి నమస్కారములు.

హిమాలయములు, శంఖము కంటే మిక్కిలి తెల్లని దేహకాంతి కలవాడు, గంభీరుడు, కోటి మన్మథుల మించిన దేహ సౌందర్యము కలవాడు, తన జటా ఝూటములో తరంగాలతో ఉప్పొంగే గంగను, నుదుట నెలవంక, మెడలో నాగరాజును ధరించిన పరమ శివునికి నా నమస్కారములు.

ఊగే కర్ణ కుండలములు ధరించిన వాడు, విశాలమైన మంచి నేత్రములు, ప్రసన్నమైన ముఖము కలవాడు, నీలకంఠుడు, దయాళువు, మృగరాజు చర్మాన్ని ధరించిన వాడు, మెడలో కపాలమాల కలిగిన వాడు, అందరికి ప్రియుడు అయిన శంకరుని నేను భజిస్తున్నాను.

ప్రచండుడు (భీషణుడు, ప్రజ్వలించే వాడు), ఉత్కృష్టమైన వాడు, గంభీరమైన భాషణ చేసే వాడు*, సమర్థుడు, దివ్యమైన వాడు, అఖండుడు, జన్మ లేని వాడు, కోటి సూర్యుల ప్రకాశము కలవాడు, త్రిశూలముతో దుష్ట సంహారము చేసే వాడు, శూల పాణి, భవానీ పతి, భావ గమ్యమైన వాడు అయిన శంకరుని భజిస్తున్నాను.

కాలమునకు (మృత్యువుకు) అతీతమైన, కల్పాంతమున (ప్రళయ కాలమున) సమస్తమును నాశనము చేసే, సజ్జనులకు మంచి చేసే, త్రిపురారి, మోహమును నాశనము చేసి చిదానందమును ప్రసాదించే, మన్మథుని సంహరించిన ఓ పరమ శివా! నన్ను అనుగ్రహించుము.

నీ పద కమలముల మ్రొక్కి శరణు కోరే వరకు జనులకు ఈ లోకములో కానీ, పర లోకములో కానీ దుఖములనుండి విముక్తి కలిగి సుఖము, శాంతి కలుగదు. కావున, సర్వ భూతములలో నివసించే పరమశివా! నన్ను అనుగ్రహించుము, అనుగ్రహించుము.

ఓ శంభో! నాకు యోగము, జపము, పూజ తెలియవు. కానీ, ఎల్లప్పుడూ నీ భక్తుడను. నేను ముసలి తనము, జన్మ, మృత్యువు మొదలైన వాటిలో చిక్కుకొని యున్నాను. ప్రభో! పాహి పాహి. శంభో! నన్ను ఈ ఆపత్తుల నుండి కాపాడుము.

శివుని ప్రీతికి బ్రాహ్మణుడైన తులసీదాసు చెప్పిన ఈ రుద్రాష్టకం భక్తితో పఠించిన జనులకు ఆ పరమశివుని అనుగ్రహం కలుగును.[18]

ఇవి కూడ చూడండి

మార్చు

తానాజీ మలుసరే

నోట్సు

మార్చు
  1. 1.0 1.1 Pandey 2008, pp. 23–34.
  2. Rambhadra.charya 2008, p. 12: सीयराममय सब जग जानी । करउँ प्रनाम जोरि जुग पानी ॥ (Ramcharitmanas 1.8.2).
  3. 3.0 3.1 de Bruyn, Pippa; Bain, Dr. Keith; Allardice, David; Joshi, Shonar (2010). Frommer's India. Hoboken, New Jersey, United States of America: John Wiley and Sons. p. 471. ISBN 9780470602645.
  4. Prasad 2008, p. xii: He is not only the supreme poet, but the unofficial poet-laureate of India.
  5. Prasad 2008, p. xix: Of Tulasidasa's place among the major Indian poets there can be no question: he is as sublime as Valmiki and as elegant as Kalidasa in his handling of the theme.
  6. Jones, Constance; Ryan, James D. (2007). Encyclopedia of Hinduism (Encyclopedia of World Religions). New York, New York, United States of America: Infobase Publishing. p. 456. ISBN 9780816054589. It can be said without reservation that Tulsidas is the greatest poet to write in the Hindi language. Tulsidas was a Brahmin by birth and was believed to be a reincarnation of the author of the Sanskrit Ramayana, Valmiki.
  7. Sahni, Bhisham (2000). Nilu, Nilima, Nilofara (in Hindi). New Delhi, India: Rajkamal Prakashan Pvt Ltd. pp. 78–80. ISBN 9788171789603. हिन्दी का सौभाग्य है कि उसके काव्यकुंज की तुलसी-मंजरी की जैसी सुगंध संसार की साहित्य वाटिका में शायद कहीं नहीं। ... आकर्षण दोनों में अत्यधिक है अपने-अपने ढंग पर दोनों ही बहुत बड़े हैं, पर फिर भी सब तरफ़ से केवल काव्य के सौंदर्य पर विचार करने पर तुलसीदास ही बड़े ठहरते हैं – भाषा साहित्य में रवीन्द्रनाथ के संबंध में कहना पड़ता है कि भ्रम त्रुटियाँ मिल सकती हैं पर तुलसीदास के संबंध में कोई शायद ही मिले। ... और यही कारण है निराला जी तुलसीदास को कालिदास, व्यास, वाल्मीकि, होमर, गेटे और शेक्सपियर के समकक्ष रखकर उनके महत्त्व का आकलन करते हैं।{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; handoo-ramlila అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. Lutgendorf 1991, p. 11: ... – scores of lines from the Rāmcaritmānas have entered folk speech as proverbs – ...
  10. Mitra, Swati (May 5, 2002). Good Earth Varanasi City Guide. New Delhi, India: Eicher Goodearth Publications. p. 216. ISBN 9788187780045.
  11. Subramanian, Vadakaymadam Krishnier (2008). Hymns of Tulsidas. New Delhi, India: Abhinav Publications. p. Inside Cover. ISBN 9788170174967. Famous classical singers like Paluskar, Anoop Jalota and MS Subbulakshmi have popularised Tulsidas's hymns among the people of India.
  12. Lutgendorf 1991, p. 411: The hottest-selling recording in the thriving cassette stalls of Banaras in 1984... was a boxed set of eight cassettes comprising an abridged version of the Manas sung by the popular film singer Mukesh... it is impossible to say how many of the sets were sold, but by 1984 their impact was both visible and audible. One could scarcely attend a public or private religious function in Banaras that year without hearing, over the obligatory loudspeaker system, the familiar strains of Murli Manohar Svarup's orchestration and Mukesh's mellifluous chanting.
  13. Lutgendorf 1991, p. 411–412: On January 25, 1987, a new program premiered on India's government-run television network, Doordarshan... it was the first time that television was used to present a serialized adaption of a religious epic. The chosen work was the Ramayan and the major source for the screenplay was the Manas. Long before the airing of the main story concluded on July 31, 1988, the Ramayan had become the most popular program ever shown on Indian television, drawing an estimated one hundred million viewers and generating unprecedented advertising revenues. Throughout much of the country, activities came to a halt on Sunday mornings and streets and bazaars took on a deserted look, as people gathered before their own and neighbors' TV sets.... The phenomenal impact of the Ramayan serial merits closer examination than it can be given here, but it is clear that the production and the response it engendered once again dramatized the role of the epic as a principal medium not only for individual and collective religious experience but also for public discourse and social and cultural reflection.
  14. Lutgendorf 2007, p. 293.
  15. Rambhadracharya 2008, p. 306.
  16. Prasad 2008, p. 857, quoting Mata Prasad Gupta: Although he paid occasional visits to several places of pilgrimage associated with Rama, his permanent residence was in Kashi.
  17. Callewaert, Winand M.; Schilder, Robert (2000). Banaras: Vision of a Living Ancient Tradition. New Delhi, India: Hemkunt Press. p. 90. ISBN 9788170103028.
  18. "రుద్రాష్టకం". Archived from the original on 2016-03-07. Retrieved 2014-04-24.

మూలాలు

మార్చు
  • Dwivedi, Hazari Prasad (2008). हिन्दी साहित्य की भूमिका [Introduction to Hindi Literature] (in Hindi). New Delhi, India: Rajkamal Prakashan Pvt Ltd. ISBN 9788126705795.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • Dwivedi, Hazari Prasad (2009). हिन्दी साहित्य: उद्भव और विकास [Hindi Literature: Beginnings and Developments] (in Hindi). New Delhi, India: Rajkamal Prakashan Pvt Ltd. ISBN 9788126700356.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • Growse, Frederic Salmon (1914). The Rámáyana of Tulsi Dás (Sixth ed.). Allahabad, India: Ram Narain Lal Publisher and Bookseller. Retrieved July 10, 2011.
  • Indradevnarayan (1996) [1937]. कवितावली [Collection of Kavittas] (47th ed.). Gorakhpur, Uttar Pradesh, India: Gita Press. 108.
  • Handoo, Chandra Kumari (1964). Tulasīdāsa: Poet, Saint and Philosopher of the Sixteenth Century. Bombay, Maharashtra, India: Orient Longmans. ASIN B001B3IYU8.
  • Lamb, Ramdas (July 2002). Rapt in the Name: The Ramnamis, Ramnam, and Untouchable Religion in Central India. Albany, New York, United States of America: State University of New York Press. ISBN 9780791453858.
  • Lutgendorf, Philip (July 23, 1991). The Life of a Text: Performing the 'Ramcaritmanas' of Tulsidas. Berkeley, California, United States of America: University of California Press. ISBN 9780520066908.
  • Lutgendorf, Philip (2007). Hanuman's Tale: The Messages of a Divine Monkey. New York, New York, United States of America: Oxford University Press. ISBN 9780195309218.
  • Macfie, J. M. (May 23, 2004). The Ramayan of Tulsidas or the Bible of Northern India. Whitefish, Montana, United States of America: Kessinger Publishing, LLC. ISBN 9781417914982. Retrieved June 24, 2011.
  • Mishra, Jwalaprasad (September 2010) [1858]. श्रीगोस्वामितुलसीदासजीकृत रामायण: विद्यावारिधि पं० ज्वालाप्रसादजीमिश्रकृत संजीवनीटीकासहित [The Ramayana composed by Goswami Tulsidas: With the Sanjivani commentary composed by Vidyavaridhi Pandit Jwalaprasad Mishra] (in Hindi). Mumbai, India: Khemraj Shrikrishnadass.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • Pandey, Ram Ganesh (2008) [2003]. तुलसी जन्म भूमि: शोध समीक्षा [The Birthplace of Tulasidasa: Investigative Research] (in Hindi). Chitrakuta, Uttar Pradesh, India: Bharati Bhavan Publication.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • Poddar, Hanuman Prasad (1996) [1940]. दोहावली [Collection of Dohas] (in Hindi) (37th ed.). Gorakhpur, Uttar Pradesh, India: Gita Press. 107.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • Poddar, Hanuman Prasad (1997) [1921]. विनयपत्रिका [Petition of Humility] (in Hindi) (47th ed.). Gorakhpur, Uttar Pradesh, India: Gita Press. 105.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • Prasad, Ram Chandra (2008) [1988]. Tulasidasa's Shri Ramacharitamanasa: The Holy Lake Of The Acts Of Rama. Delhi, India: Motilal Banarsidass. ISBN 9788120804432.
  • Publisher, Gita Press (2004). Śrīrāmacaritamānasa or The Mānasa lake brimming over with the exploits of Śrī Rāma (with Hindi text and English translation). Gorakhpur, Uttar Pradesh, India: Gita Press. ISBN 8129301466.
  • Publisher, Gita Press (2007). श्रीरामचरितमानस मूल गुटका (विशिष्ट संस्करण) [Śrīrāmacaritamānasa Original Booklet (Special Edition)] (in Hindi) (9th ed.). Gorakhpur, Uttar Pradesh, India: Gita Press. ISBN 8129310902. 1544.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • Ralhan, O. P. (1997). The great gurus of the Sikhs, Volume 1. New Delhi, India: Anmol Publications Pvt Ltd. ISBN 9788174884794.
  • Rambhadracharya, Swami (April 7, 2008). श्रीरामचरितमानस - भावार्थबोधिनी हिन्दी टीका (तुलसीपीठ संस्करण) [Śrīrāmacaritamānasa - The Bhāvārthabodhinī Hindi commentary (Tulasīpīṭha edition)] (PDF) (in Hindi) (3rd ed.). Chitrakuta, Uttar Pradesh, India: Jagadguru Rambhadracharya Handicapped University. Archived from the original (PDF) on 2014-08-19. Retrieved July 11, 2011. {{cite book}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)CS1 maint: unrecognized language (link)
  • Shukla, Usha Devi (2002). "Gosvāmī Tulasīdāsa and the Rāmacaritamānasa". Rāmacaritamānasa in South Africa. New Delhi, India: Motilal Banarsidass. ISBN 9788120818934.
  • Singh, Uday Bhanu (2005). तुलसी [Tulsidas] (in Hindi). New Delhi, India: Rajkamal Prakashan Pvt Ltd. ISBN 9788171197361.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • Singh, Uday Bhanu (2008). तुलसी काव्य मीमांसा [Investigation into the poetry of Tulsidas] (in Hindi). New Delhi, India: Rajkamal Prakashan Pvt Ltd. ISBN 9788171196869.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • Tripathi, Shiva Kumar (2004). "Who and What was Tulsidas?". A Garden of Deeds: Ramacharitmanas, a Message of Human Ethics. Bloomington, Indiana, United States of America: iUniverse. ISBN 9780595307920.

బయటి లంకెలు

మార్చు