స్థిరబిందువును ఆధారంగా చేసుకొని స్వేచ్ఛగా చలించగలిగే వంగని కడ్డీని భౌతిక శాస్త్రంలో తులాదండముగా వ్యవహరిస్తారు.

తులాదండాలను వాడడం వల్ల స్థిరబిందువు స్థానాన్ని మార్చుతూ ఇరువైపులా ఉంచిన బరువులు వేరువేరు అయినా ఒకే విధమయిన బలాన్ని ప్రదర్శించవచ్చు.