తూగు లేదా తూగటం లేదా నిద్ర మత్తు అనునది ఒక మానసిక రుగ్మత.[1]. ఇది ప్రధానంగా నిద్ర లేమి వలన కలుగు స్థితి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇది కొన్ని ఇతర వ్యాధుల లక్షణం కూడా కావచ్చు.[2]

తూగు / (Somnolence)
ఇతర పేర్లునిద్రమత్తు
ప్రత్యేకతమానసిక రుగ్మత
మానవ సిర్కాడియన్ (24-గంటల) జీవ గడియారం యొక్క కొన్ని లక్షణాలు. విస్తరించడానికి క్లిక్ చేయండి

వివరాలు

మార్చు

ప్రతి మనిషి ప్రతి రోజు వయసుని బట్టి తక్కువ, ఎక్కువ సమయాలు నిద్రిస్తూ ఉంటాడు. సాధారణంగా తక్కువ వయసు ఉన్నవారు ఎక్కువ సమయం, ఎక్కువ వయసు ఉన్నవారు తక్కువ సమయం నిద్రిస్తూంటారు, నిద్రించటం ఖచ్చితమయిన అవసరం కూడా. మామూలుగా నిద్ర రాక ముందే హాయిగా నిద్రించడానికి తగిన ఏర్పాట్లు చేసుకొని పడుకున్నప్పుడు మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అయితే కొన్ని పరిస్థితులలో సరైన సమయానికి నిద్రించక బలవంతంగా మేల్కొన్ని ఉండటానికి ప్రయత్నించినప్పుడు నిద్ర ఆవహించటం వలన శరీరం ఏదో ఒక వైపు తూగుతుంది. ఈ విధంగా బలవంతంగా మేల్కొన్ని నిద్రలోకి జారుకొని ఒక వైపుకి తూగటాన్నే తూగు లేక తూగుట అంటారు. తూగుతున్న మనిషి నిద్రలోకి జారుకోవడం, తూగిన వెంటనే మళ్ళీ మేల్కొనడం, మళ్ళీ నిద్రలోకి జారుకోవడం, మళ్ళీ మేల్కొనడం ఈ విధంగా అనేక సార్లు జరుగుతుంది.

ప్రమాదాలు

మార్చు

తూగు వస్తున్నప్పటికి వాహన చోదకులు వాహనాలు నడుపుట వలన ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వాహన చోదకులు తూగు వస్తదని భావించినప్పుడే ఇతర వాహనాలకు ఇబ్బంది కలుగకుండా బండిని ప్రక్కగా ఆపి ముఖం కడగటం, వీలయినంత వరకు నిద్రించడం చాలా అవసరం.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Bereshpolova, Y.; Stoelzel, C. R.; Zhuang, J.; Amitai, Y.; Alonso, J.-M.; Swadlow, H. A. (2011). "Getting Drowsy? Alert/Nonalert Transitions and Visual Thalamocortical Network Dynamics". Journal of Neuroscience. 31 (48): 17480–7. doi:10.1523/JNEUROSCI.2262-11.2011. PMC 6623815. PMID 22131409.
  2. "Drowsiness – Symptoms, Causes, Treatments". www.healthgrades.com. Retrieved 2015-10-31.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=తూగు&oldid=4322318" నుండి వెలికితీశారు