తూనీగ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తూనీగ లేదా తూరీగ పెద్ద రెక్కలు, పొడుగైన తోకగల కీటకం. తూనీగలు వాతావరణ మార్పుల పట్ల బాగా ప్రభావితమౌతాయి. అవి ఉన్న చోట మనం బాగున్నట్లుగాను, అక్కడ మన జీవావరణం కొంతైనా సంతులనంగా ఉన్నట్లుగానూ భావించవచ్చు.
తూనీగ | |
---|---|
నిప్పురెక్కల తూనీగ | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder: | |
Infraorder: | Anisoptera Selys, 1854
|
కుటుంబాలు | |
Aeshnidae |
ఇతర మాండలికాలు
మార్చుతూనీగల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పిలుస్తారు. తూనీగలతో పల్లెజనుల సంస్కృతి, జ్ఞాపకాలు ముడిపడి ఉండటంతో వాటికి రకరకాల పేర్లు ప్రాంతానికి, ప్రాంతానికి ఏర్పడ్డాయి. తెలంగాణాలో బూగలు అనీ, గూగలు అనీ, దువ్వెన్లు అనీ, తుమిశిక అనీ, తుమ్మీష్క అనీ పిలుస్తారు. కొత్తతరం పిల్లకాయలు హెలికాప్టర్లని కూడా ఉపమానాలు తీస్తారు.
ప్రత్యుత్పత్తి
మార్చుఆడ తూనీగ నీటిలో గానీ నీటికి దగ్గర కానీ గుడ్లు పెడుతుంది. ఒక్కోసారి అది నీళ్ళలోపల మునిగి కూడా గుడ్లు పెడుతుంది. అవి పొదిగి లార్వాలాగా బయటకు వస్తాయి.