తూము (కొలత)
ధాన్యాన్ని కొలచేందుకు ఉపయోగించే తూమును ఆఢకము అని కూడా అంటారు.
వివరణ
మార్చుప్రాచీన కొలతల విధానంలో పరిమాణాన్ని సూచించే కొలతలో అతి పెద్దది “పుట్టి”. దీనికి “ఖండి” అనే పేరు కూడా ఉండేది. రాసేటప్పుడు ఈ కొలతను సూచించడానికి “ఖ” అనే అక్షరం వాడేవారు. పుట్టిలో ఇరవయ్యో భాగాన్ని “తూము” అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని “న” అనే అక్షరంతో సూచించే వారు. “పుట్టి” విభజనను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.[1][2]
- రెండు ఇరసలు ఒక తూము.
- నాలుగు కుంచాలు ఒక తూము.
- 16 మానికలు ఒక తూము.
- రెండు తూములను ఇద్దుము అంటారు.
- నాలుగు తూములను నలుతుము అంటారు.
- అయిదు తూములను ఏదుము అంటారు.
- ఏడు తూములను ఏడ్దుము అంటారు.
- ఎనిమిది తూములను ఎనమందుము అంటారు.
- తొమ్మిది తూములను తొమ్మందుము అంటారు.
మూలాలు
మార్చు- ↑ "ప్రాచీన తెలుగు కొలమానం – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-09-09. Retrieved 2020-05-08.
- ↑ "అలనాటి కొలతలు, ద్రవ్యం | జాతర | www.NavaTelangana.com". m.navatelangana.com. Retrieved 2020-05-08.[permanent dead link]