తూర్పు బెర్లిన్

తూర్పు బెర్లిన్, 1948 నుండి 1990 వరకు తూర్పు జర్మనీ (GDR) రాజధానిగా గుర్తింపు పొందిన నగరం. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌లు దీన్ని సోవియట్ ఆక్రమణలో ఉన్న బెర్లిన్ సెక్టార్‌గా గుర్తించాయి. నగరం లోని అమెరికన్, బ్రిటిషు, ఫ్రెంచి రంగాలను పశ్చిమ బెర్లిన్ అని పిలిచేవారు. 1961 ఆగస్టు 13 నుండి 1989 నవంబరు 9 వరకు, తూర్పు బెర్లిన్, పశ్చిమ బెర్లిన్ లను బెర్లిన్ గోడ వేరు చేస్తూ ఉండేది. పశ్చిమ మిత్రరాజ్యాల శక్తులు తూర్పు బెర్లిన్‌ను తూర్పు జర్మనీ రాజధానిగా గానీ, తూర్పు బెర్లిన్‌పై GDR అధికారాన్ని గానీ గుర్తించలేదు. 1990 అక్టోబరు 3 న జర్మనీ అధికారికంగా పునరేకీకృతమైన రోజు. ఆ రోజున తూర్పు, పశ్చిమ బెర్లిన్‌లు అధికారికంగా తిరిగి బెర్లిన్ నగరంగా కలిసిపోయాయి.

తూర్పు బెర్లిన్

Ost-Berlin
Berlin (Ost)
1948–1990
Flag of తూర్పు బెర్లిన్
జండా
Coat of arms of తూర్పు బెర్లిన్
Coat of arms
తూర్పు బెర్లిన్ (ఎరుపు)
తూర్పు బెర్లిన్ (ఎరుపు)
స్థాయితూర్పు జర్మనీ రాజధాని[a]
• 1948–1967
ఫ్రెడరిక్ ఎబర్ట్ జూ.
• 1967–1974
హెర్బర్ట్ ఫెక్నర్
• 1974–1990
ఎర్హార్డ్ క్రాక్
• 1990
ఇన్‌గ్రిడ్ పన్‌క్రాజ్
• 1990
క్రిస్టియన్ హార్టెన్‌హాయర్
• 1990–1991
టినో ష్వీర్జినా
• 1991
థామస్ క్రూగర్
చారిత్రిక కాలంప్రచ్ఛన్న యుద్ధం
• తూర్పు జర్మనీ ఏర్పాటు
అక్టోబరు 7 1948
• జర్మనీ పునరేకీకరణ
అక్టోబరు 3 1990
జనాభా
• 1946
1,174,582
• 1961
1,055,283
• 1989
1,279,212
Preceded by
Succeeded by
మిత్ర రాజ్యాల ఆక్రమణ లోని జర్మనీ
జర్మనీ
బెర్లిన్
Today part ofజర్మనీ

అవలోకనం

మార్చు

1944 నాటి లండన్ ప్రోటోకాల్‌పై 1944 సెప్టెంబరు 12 న సంతకం చేయడంతో, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, సోవియట్ యూనియన్‌లు జర్మనీని మూడు ఆక్రమణ మండలాలుగా విభజించి, బెర్లిన్‌ను ఒక ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బెర్లిన్‌లు మూడు మిత్రరాజ్యాల దళాలు కలిసి ఆక్రమించాయి.[1] 1945 మేలో, సోవియట్ యూనియన్ మొత్తం నగరానికి "మేజిస్ట్రేట్ ఆఫ్ గ్రేటర్ బెర్లిన్" అనే ఒక నగర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1947 వరకు ఉంది. యుద్ధం తరువాత, మిత్రరాజ్యాల దళాలు మొదట్లో నగర పాలక సంస్థగా పనిచేసిన మిత్రరాజ్యాల కొమ్మాండాటురాలో కలిసి నగరాన్ని పరిపాలించాయి. అయితే, 1948లో సోవియట్ ప్రతినిధి కొమ్మాండాటురాను విడిచిపెట్టారు. తరువాతి నెలల్లో ఉమ్మడి పరిపాలన విడిపోయింది. సోవియట్ సెక్టార్‌లో ఒక ప్రత్యేక నగర ప్రభుత్వాన్ని స్థాపించారు. అది తనను తాను "మేజిస్ట్రేట్ ఆఫ్ గ్రేటర్ బెర్లిన్" అని పిలుచుకునేది.

1949లో జర్మన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్‌ను (తూర్పు జర్మనీ) స్థాపించినప్పుడు, అది వెంటనే తూర్పు బెర్లిన్‌ను రాజధానిగా పేర్కొంది. దీనిని కమ్యూనిస్ట్ దేశాలన్నీ గుర్తించాయి. అయినప్పటికీ, వోక్సామర్ (తూర్పు జర్మనీ పార్లమెంటు) లోని ప్రతినిధులు నేరుగా ఎన్నుకోబడేవారు కాదు. 1981 వరకు వారికి పూర్తి ఓటింగ్ హక్కులు లేవు [2]

1948 జూన్ లో, పశ్చిమ బెర్లిన్‌కు దారితీసే అన్ని రైల్వేలు, రోడ్లను నిరోధించారు. తూర్పు బెర్లినర్లు వలస వెళ్ళడానికి అనుమతించలేదు. అయినప్పటికీ, 1960 నాటికి ప్రతిరోజూ 1,000 కంటే ఎక్కువ మంది తూర్పు జర్మన్లు పశ్చిమ బెర్లిన్‌కు తప్పించుకుపోయేవారు. సోవియట్ యూనియన్‌కు చెల్లించాల్సిన యుద్ధ నష్టపరిహారం, పరిశ్రమల భారీ విధ్వంసం, మార్షల్ ప్లాన్ నుండి సహాయం లేకపోవడం వల్ల తూర్పు జర్మన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ఏర్పడింది. 1961 ఆగస్టులో, తూర్పు జర్మన్ ప్రభుత్వం బెర్లిన్ గోడ నిర్మించి, పశ్చిమ బెర్లిన్‌ను వేరు చేసి, తద్వారా జనాభా వలసలను ఆపడానికి ప్రయత్నించింది. అక్రమ వలసదారులను కాల్చడానికి సాయుధ సైనికులకు శిక్షణ ఇచ్చినందున పారిపోతున్న ప్రజలు దాటడం చాలా ప్రమాదకరంగా ఉండేది.[3]

తూర్పు జర్మనీ సోషలిస్ట్ రిపబ్లిక్. అనేక సంవత్సరాల పాటు అధికారుల వేధింపుల తర్వాత క్రిస్టియన్ చర్చిలు అడ్డు లేకుండా పనిచేయడానికి అనుమతించారు. 1970వ దశకంలో, తూర్పు బెర్లినర్ల వేతనాలు పెరిగాయి, పని గంటలు తగ్గాయి.[4]

సోవియట్ యూనియన్మ్ కమ్యూనిస్ట్ బ్లాక్ లు తూర్పు బెర్లిన్‌ను తూర్పు జర్మనీకి రాజధానిగా గుర్తించాయి. అయితే, పశ్చిమ మిత్రదేశాలు ( యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ ) తూర్పు బెర్లిన్‌పై తూర్పు జర్మనీ ప్రభుత్వ అధికారాన్ని అధికారికంగా ఎప్పుడూ అంగీకరించలేదు. అధికారిక మిత్రరాజ్యాల ప్రోటోకాల్‌లో యావత్తు బెర్లిన్ ఆక్రమణ స్థితికి అనుగుణంగా తూర్పు బెర్లిన్‌లో సోవియట్ యూనియన్ అధికారాన్ని మాత్రమే గుర్తించింది. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్ కమాండ్ బెర్లిన్, తూర్పు బెర్లిన్‌ను సందర్శించాలనుకునే అమెరికా సైనిక, పౌర సిబ్బందికి వివరణాత్మక సూచనలను ప్రచురించింది.[5] వాస్తవానికి, పశ్చిమ దేశాల కమాండెంట్‌లు ముగ్గురు తూర్పు బెర్లిన్‌లో తూర్పు జర్మన్ నేషనల్ పీపుల్స్ ఆర్మీ ఉనికికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సైనిక కవాతుల సందర్భంగా, క్రమం తప్పకుండా నిరసన వ్యక్తం చేసేవారు. ఏది ఏమైనప్పటికీ, మూడు పశ్చిమ మిత్రదేశాలు చివరికి 1970లలో తూర్పు బెర్లిన్‌లో రాయబార కార్యాలయాలను స్థాపించాయి. అయినప్పటికీ వారు దానిని తూర్పు జర్మనీ రాజధానిగా గుర్తించలేదు. ఒప్పందాల్లో "ప్రభుత్వ స్థానం" వంటి పదాలను ఉపయోగించారు.[6]

1990 అక్టోబరు 3 న తూర్పు, పశ్చిమ జర్మనీలు, తూర్పు పశ్చిమ బెర్లిన్‌లూ తిరిగి కలిశాయి. తద్వారా తూర్పు బెర్లిన్ ఉనికి అధికారికంగా ముగిసింది. 1990 డిసెంబరులో నగరవ్యాప్త ఎన్నికల ఫలితంగా మొదటి "ఆల్-బెర్లిన్" మేయర్ 1991 జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. దాంతో తూర్పు, పశ్చిమ బెర్లిన్‌ల లోని వేర్వేరు మేయర్‌ల కార్యాలయాలు మూతపడ్డాయి. ఎబర్‌హార్డ్ డీప్‌జెన్ (వెస్ట్ బెర్లిన్ మాజీ మేయర్) ఐక్య బెర్లిన్‌కు ఎన్నికైన మొదటి మేయర్‌ అయ్యాడు.[7]

చారిత్రికంగా జనాభా

మార్చు

తూర్పు బెర్లిన్ 1988 లో అత్యధికంగా 12,8 లక్షల జనాభా ఉండేది. అత్యల్పంగా, బెర్లిన్ గోడ నిర్మించిన 1961 సంవత్సరంలో, 10,6 లక్షల కంటే తక్కువ ఉండేది. కింది పట్టికలోని గణాంకాలు తూర్పు జర్మనీ అధికారిక కేంద్ర గణాంక కార్యాలయం నుండి వచ్చినవి.

తేదీ జనాభా
1946 అక్టోబరు 29 ¹ 1,174,582
1950 ఆగస్టు 31 ¹ 1,189,074
1955 డిసెంబరు 31 1,139,864
1960 డిసెంబరు 31 1,071,775
1961 డిసెంబరు 31 1,055,283
1964 డిసెంబరు 31 ¹ 1,070,731
తేదీ జనాభా
0 1971 జనవరి 1 ¹ 1,086,374
1975 డిసెంబరు 31 1,098,174
1981 డిసెంబరు 31 ¹ 1,162,305
1985 డిసెంబరు 31 1,215,586
1988 డిసెంబరు 31 1,284,535
1989 డిసెంబరు 31 1,279,212

నేటి తూర్పు బెర్లిన్

మార్చు

జర్మనీల పునరేకీకరణతో జర్మన్ ప్రభుత్వం, నగరం లోని రెండు భాగాలను తిరిగి కలిపింది. పూర్వపు తూర్పు బెర్లిన్‌లో సేవలు, మౌలిక సదుపాయాలను పశ్చిమ బెర్లిన్‌లో స్థాపించబడిన ప్రమాణాలకు తీసుకురావడం కోసం అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేసింది.

పునరేకీకరణ తరువాత, తూర్పు జర్మనీ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా నష్టపోయింది. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల ప్రైవేటీకరణ విధానం, పశ్చిమ జర్మన్ కంపెనీలతో పోల్చితే ఉత్పాదకత, పెట్టుబడిలో అంతరాలు, పశ్చిమ జర్మనీలో అమల్లో ఉన్న కాలుష్యం, భద్రతా ప్రమాణాలను పాటించడంలో అసమర్థత వంటి కారణాల వలన అనేక తూర్పు జర్మనీ కర్మాగారాలు మూతబడ్డాయి. ఇది భారీ నిరుద్యోగానికి దారితీసింది. దీని కారణంగా, తూర్పు జర్మనీని పునరుజ్జీవింపజేయడానికి పశ్చిమ జర్మనీ, ఆర్థిక సహాయాన్ని భారీ మొత్తంలో కురిపించింది. వ్యక్తులు, కంపెనీలకు సాధారణ ఆదాయపు పన్ను లేదా కంపెనీ పన్నుతో పాటు, ఆదాయంపై అదనంగా 7.5% పన్ను వేసి, ఈ ఉద్దీపన కోసం పాక్షికంగా నిధులు సాధించారు. ఇది 1991-1992 వరకు అమలులో ఉండేది. ఆ తరువాత మళ్ళీ 1995 లో 7.5 శాతాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. 1998లో దీన్ని 5.5%కి తగ్గించారు. ఇప్పటికీ ఇది అమల్లోనే ఉంది. దీనివలన తూర్పు జర్మన్ల పట్ల ప్రజల్లో ఆగ్రహానికి దారితీసింది.[8][9][10]

తూర్పు బెర్లిన్‌లో పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించినప్పటికీ, పూర్వపు తూర్పు, పశ్చిమ బెర్లిన్‌ల మధ్య ఇప్పటికీ స్పష్టమైన తేడాలు ఉన్నాయి. తూర్పు బెర్లిన్ ఒక ప్రత్యేక దృశ్య శైలిని కలిగి ఉంది; కొన్ని చోట్ల ఇప్పటికీ యుద్ధకాలమ్లో కలిగిన నష్టానికి గుర్తులు కనిపిస్తాయి. తూర్పు జర్మనీలో భాగంగా తూర్పు బెర్లిన్‌లో అమలైన సోషలిస్ట్ క్లాసిసిజం ప్రభావాలు మాజీ పశ్చిమ బెర్లిన్‌లో ఉపయోగించిన పట్టణ అభివృద్ధి శైలుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కార్ల్ మార్క్స్‌ వంటి జర్మన్ సోషలిస్ట్ హీరోల పేరిట ఉన్న వీధులు, స్థలాల పేర్లను ఉంచేసి కొన్ని ఇతర పేర్లను తిరిగి మార్చేసారు. ఉదాహరణకు, 1991లో లెనినల్లీ పేరును ల్యాండ్స్‌బెర్గర్ అల్లీకి, 1995 లో డిమిట్రోఫ్‌స్ట్రాస్ పేరును డాంజిగర్ స్ట్రాస్‌కి తిరిగి మార్చారు.

పునరేకీకరణ జరిగిన ఇరవై ఐదు సంవత్సరాల తరువాత కూడా, తూర్పు, పశ్చిమ బెర్లిన్ ప్రజల మధ్య గుర్తించదగిన వ్యత్యాసాలు ఇంకా ఉన్నాయి. ఇది పాత తరాలలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. రెండు సమూహాలు కూడా ఒకరినొకరు సూచించడానికి కొన్నిసార్లు అవమానకరమైన యాస పదాలను వాడతారు. పూర్వపు తూర్పు బెర్లినర్లను (లేదా తూర్పు జర్మన్లను) " Ossi " అని అంటారు. "తూర్పు" దిక్కును సూచించే జర్మన్ పదం Ost నుండి ఇది వచ్చింది. మాజీ వెస్ట్ బెర్లినర్లను (లేదా పశ్చిమ జర్మన్లను) ని " Wessi " అని అంటారు. ఇరువర్గాలు కూడా ఒకరినొకరు పేర్లుపెట్టుకునే పనిలో పడ్డారు. Ossi అంటే పెద్దగా ఆశల్లేని/ పని చేయని/ఎప్పుడూ నిరసనతో ఉండే వాడనీ Wessi అంటే అహంకారం, స్వార్థం, అసహనం ఒత్తిడి అనీ స్టీరియోటైపు చెయ్యడం మామూలు.[11]

చిత్రాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు
  • పశ్చిమ బెర్లిన్
  • బాన్, పశ్చిమ జర్మనీ రాజధాని నగరం

గమనికలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Partially recognised; seen by the Western Bloc as the Soviet-occupied portion of Berlin
  1. Knowles, Chris (29 January 2014). "Germany 1945-1949: a case study in post-conflict reconstruction". History & Policy. History & Policy. Retrieved 19 July 2016.
  2. Berlin seit dem Kriegsende, Helmut Peitsch, Manchester University Press, 1989 page 18
  3. Conrad Stein, R. (1997). Berlin. Children's Press. pp. 29.
  4. Grant, R.G (1999). The Berlin Wall. Steck-Vaughn Company.
  5. . "Helpful Hints for US Visitors to East Berlin". Headquarters, U.S. Command Berlin.
  6. Architecture, Politics, and Identity in Divided Berlin, Emily Pugh, University of Pittsburgh Press, 2014, pages 159
  7. Kinzer, Stephen (1990-12-01). "Berlin Mayoral Contest Has Many Uncertainties". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2023-01-04.
  8. "BZSt - Tax withholding amount". www.bzst.de. Retrieved 2019-10-15.
  9. "Company Tax in the EU- Germany". Your Europe - Business (in ఇంగ్లీష్). Retrieved 2019-10-15.
  10. Grant, R.G. (1999). The Berlin Wall. Steck-Vaughn Company.
  11. Conrad Stein, R. (1997). Berlin. Children's Press. pp. 14.