తూళ్ల వీరేందర్ గౌడ్
తూళ్ల వీరేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ మంత్రి టి.దేవేందర్ గౌడ్ కుమారుడు.
తూళ్ల వీరేందర్ గౌడ్ | |||
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | హైదరాబాద్, తెలంగాణ | 1983 డిసెంబరు 26||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | వినోదా, తూళ్ల దేవేందర్ గౌడ్ | ||
జీవిత భాగస్వామి | దివ్య శ్రీ [1] | ||
సంతానం | వరాళిక & దీప్ శిఖ | ||
నివాసం | 8-2-503, రోడ్ నెం 7, బంజారా హిల్స్,హైదరాబాద్ | ||
మతం | హిందూ మతము |
జననం, విద్యాభాస్యం
మార్చుతూళ్ల వీరేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో 26 డిసెంబరు 1983లో తూళ్ల దేవేందర్ గౌడ్, వినోద దంపతులకు జన్మించాడు. ఆమె అమెరికాలో 2008లో ఎంబీఏ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చువీరేందర్ గౌడ్ రాజకీయ నేపధ్యమున్న కుటుంబ నుండి వచ్చి తెలుగుదేశం పార్టీ లో చేరి వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ శాసనసభ టిక్కెట్ ఆశించాడు, కానీ పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ కి కేటాయించడంతో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. వీరేందర్ గౌడ్ 2014 నుండి 30 సెప్టెంబర్ 2019 వరకు ఆయన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ స్థానం నుండి మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.[2] వీరేందర్ గౌడ్ 30 సెప్టెంబర్ 2019న తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసి,[3][4] 2019 అక్టోబర్ 3న భారతీయ జనతా పార్టీ లో చేరాడు.[5]
మూలాలు
మార్చు- ↑ The Hans India (5 December 2018). "Spouse campaigns for Veerender Goud". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2021. Retrieved 29 June 2021.
- ↑ HMTV (13 November 2018). "టీడీపీ తొమ్మిది మందితో తొలి జాబితా ఇదే..!". www.hmtvlive.com. Archived from the original on 29 June 2021. Retrieved 29 June 2021.
- ↑ Sakshi (30 September 2019). "టీడీపీకి భారీ షాక్; యువనేత గుడ్‌బై". Sakshi. Archived from the original on 29 June 2021. Retrieved 29 June 2021.
- ↑ 10TV (30 September 2019). "టీడీపీకి రాజీనామా చేసిన యువ నేత". 10TV (in telugu). Archived from the original on 29 June 2021. Retrieved 29 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ TV9 Telugu (3 October 2019). "వీరేందర్ గౌడ్ కాషాయ తీర్థం వెనుక కహానీ అదే..!!". TV9 Telugu. Archived from the original on 29 June 2021. Retrieved 29 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)