తెలంగాణ అవతరణ ఫిల్మోత్సవం
తెలంగాణ అవతరణ ఫిల్మోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా 2018లో షార్ట్ ఫిల్మ్ లు కానీ, డాక్యుమెంటరీలు కానీ నిర్మించే ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు తలపెట్టిన కార్యక్రమం. దీనికి సంబంధించి జూన్ 5న హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ అవతరణ చిత్రోత్సవం అవార్డు ప్రదానోత్సవం జరిగింది.
నిజానికి 2017లోనే మొదటిసారి విజయవంతంగా అవతరణ ఫిల్మోత్సవం నిర్వహించారు. షార్ట్ ఫిలిం మేకర్స్ కి కాంపిటేటివ్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించి, ఇందులో ఉత్తమ చిత్రాలు వివిధ క్యాటగిరిలలో నిలిచిన వాటికి నగదు బహుమతులు అందిస్తారు.
నేపథ్యం
మార్చు2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆపై ప్రతి యేటా రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాదులో జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు, స్థానికంగా ప్రఖ్యాతిగాంచిన వేదికల్లో కవి సమ్మేళనం, ఒగ్గుడోలు కళాకారుల నృత్యం, పేరిణి నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫిల్మోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
2017 తెలంగాణ అవతరణ ఫిల్మోత్సవ అవార్డుల ప్రదానం
మార్చుముఖ్యమంత్రి కేసీఆర్, గన్‌పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, అక్కడినుండి సికింద్రాబాదు పరేడ్ మైదానానికి చేరుకుని ఉదయం 10.30 గంటలకు జాతీయపతాకాన్ని ఎగురవేసి రాష్ట్రావతరణ వేడుకలను ప్రారంభించాడు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను చేసింది. మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరిగింది.[1]
2018 తెలంగాణ అవతరణ ఫిల్మోత్సవ అవార్డుల ప్రదానం
మార్చుమొత్తం ఈ సంవత్సరం 143 ఏంట్రీలు రాగా 28 షార్ట్ ఫిలింలు పోటీకి అర్హత సాధించాయి. సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత వి. ఎన్. ఆదిత్య, సినిమాటోగ్రాఫర్ సురేష్ బీసనేని, సిజి శ్రీగుహ దీనికి జడ్జీలుగా వ్యవహరించారు. కాగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జూన్ 5న రవీంద్రభారతిలో నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షత వహించగా, రాష్ట్ర మంత్రులు, సినిమా ప్రముఖులు హాజరయ్యారు.
సాచి చిత్రానికి దర్శకత్వం వహించిన వేణుకు ఉత్తమ దర్శకుడు అవార్డు వరించగా, ఉత్తమ చిత్రంగా డ్రీమ్ ఆఫ్ కలర్స్, ఉత్తమ రెండవచిత్రంగా లవ్ లెటర్, ఉత్తమ మూడవచిత్రంగా జిమ్మేదారి చిత్రాలు నిలిచాయి.
2019 తెలంగాణ అవతరణ ఫిల్మోత్సవ అవార్డుల ప్రదానం
మార్చుప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన 48 అవర్స్ ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్ ని తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ కి పరిచయం చేస్తూ థీమ్, ప్రాప్, డైలాగ్, కారెక్టర్ ని ఉపయోగించి నాలుగు నుండి ఎనిమిది నిమిషాల షార్ట్ ఫిల్మ్ చేయాల్సి ఉంటుంది. దీనికిగాను 297 మంది నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆన్లైన్ వేదికైన ఫిల్మ్‌ఫ్రీవే వెబ్సైట్ వేదికగా ఈ ఫిల్మోత్సవం నిర్వహించబడింది.
ఇందులో ఎన్నికైన షార్ట్ ఫిల్మ్ లను రెండు రోజుల పాటు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రదర్శించారు. విజేతలకు జూన్ 4న రవీంద్రభారతిలో జరిగిన అవతరణ ఫిల్మోత్సవంలో బహుమతులు అందచేసారు.
చిత్రమాలిక
మార్చు-
బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అవులవాడ మహిపాల్ కు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్న మామిడి హరికృష్ణ, ఉత్తేజ్.
-
బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అక్షర కుమార్ ను సత్కరిస్తున్న మామిడి హరికృష్ణ, వి.ఎన్. ఆదిత్య, శ్రీగుహ.
-
బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అలేఖ్య చిత్ర బృందానికి ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్న మామిడి హరికృష్ణ, వి.ఎన్. ఆదిత్య, శ్రీగుహ.
-
బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆనంద్ గుర్రం
మూలాలు
మార్చు- ↑ "నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. వాడవాడలా సంబురాలు!". ap7am.com (in ఇంగ్లీష్). 2017-06-02. Archived from the original on 2017-06-04. Retrieved 2022-06-03.