తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి ( టిమ్స్ ) ఇది కరోనా బాధితులకు చికిత్సలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రికి అనుబంధంగా 'Telangana Institute of Medical Sciences and Research - (TIMS)' పేరుతో గచ్చిబౌలి క్రీడాప్రాంగణంలోని 13 అంతస్తుల భవనంలో 1,500 పడకలతో ఏర్పాటై ఏప్రిల్ 20 , 2020 నుండి అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రత్యేక వైద్యశాల[1]. దీనిని కరోనా మహమ్మారి నేపథ్యం లో గచ్చిబౌలిలోని స్పోర్ట్ టవర్‌ను 20 రోజుల్లో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు[2] కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సాధారణ వైద్య సేవలు అందించేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దారు. భవిష్యత్తులో ఇది మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిగా, పీజీ వైద్య విద్యా కేంద్రంగా మారుతుంది అని తెలంగాణా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియచేసినది.

TELANGANA INSTITUTE OF MEDICAL SCIENCES AND RESEARCH - (TIMS)
తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి - టిమ్స్

వసతులు

మార్చు

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి ‌ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 50 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేశారు. 10 వెంటిలేటర్లు, 3 ఈసీజీ యంత్రాల, 25 బీజీ ఆపరేటర్లు, ఒక ఎక్స్‌రే యంత్రాన్ని అందుబాటులో ఉంచారు. 10 అంతస్తుల్లో మొత్తం 1500 పడకలను సిద్ధం చేశారు. ప్రతి అంతస్తులో రెండు నర్సింగ్‌ స్టేషన్లు రోగి వివరాలు నమోదు చేసుకునే కౌంటర్లు, పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ పనులు పూర్తయ్యాయి. ఫైర్‌ సేఫ్టీ ఉన్న ఈ భవనంలో పూర్తిగా సెంట్రల్‌ ఏసీ అందుబాటులో ఉంది. ఇప్పటికే 48 మంది వైద్యులు, 12 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 90 మంది నర్సులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికుల నియామకం పూర్తయింది. నిత్యం 1500 మందికి ఐపీ సేవలు, నిత్యం 2 వేల మందికి ఓపీ సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నవి.

మూలాలు

మార్చు
  1. . "'టిమ్స్‌'గా గచ్చిబౌలి ఆసుపత్రి". eenadu. Archived from the original on 2020-04-20.
  2. Pandari Nagaraju (2020-04-21). "20 రోజుల్లో అద్భుతం". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-21.[permanent dead link]

వెలుపలి లంకెలు

మార్చు