తెలంగాణ నీటిపారుదల దినోత్సవం

ఆర్. విద్యాసాగ‌ర్‌రావు జన్మదినం

తెలంగాణ నీటిపారుదల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం నవంబరు 14న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది.[1] నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు ఆర్. విద్యాసాగ‌ర్‌రావు జన్మదినమైన నవంబరు 14ను తెలంగాణ ప్రభుత్వం 2017లో తెలంగాణ నీటిపారుదల దినోత్సవంగా ప్రకటించి, ఆయన జయంత్యుత్సవాలను ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఘనంగా జరిపింది.

తెలంగాణ నీటిపారుదల దినోత్సవం
తెలంగాణ నీటిపారుదల దినోత్సవం
జరుపుకొనేవారుతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా
రకంరాష్ట్రీయం
జరుపుకొనే రోజునవంబరు 14
ఉత్సవాలునీటిపారుదల శాఖ
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి సంవత్సరం అదే రోజు

ప్రారంభం

మార్చు

వృత్తిరీత్యా ఇంజనీరైన విద్యాసాగర్‌రావు మంచి రచయితగా, నటుడిగా పేరొందాడు. తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలను ఎత్తిచూపడంలో కీలకపాత్ర పోషించాడు. జల సంబంధిత సమస్యలపై సుమారు 100 వ్యాసాలు రాయడంతోపాటు, నీటి వనరుల నిపుణునిగా విద్యార్థులు, మేథావులు, సాధారణ ప్రజలతో నీటి సమస్యలపై అవగాహన కల్పించడానికి సెమినార్లను నిర్వహించాడు.[2] ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రజల వ్యవసాయం, నీటి వనరులపై సరైన అవగాహన కల్పించాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారుగా నియమితులయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదలకి రావు చేసిన అపారమైన కృషికి గౌరవంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ఆర్. విద్యాసాగర్ రావు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌గాపేరు పెట్టడంతోపాటు, ఆయన పుట్టినరోజును తెలంగాణ నీటిపారుదల దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం  నిర్ణయించింది.[3]

కార్యక్రమాలు

మార్చు
  • 2020 నవంబరు 14న విద్యాసాగర్‌రావు 81వ జన్మదినోత్సవం, 4వ తెలంగాణ నీటిపారుదల దినోత్సవం సందర్భంగా ఎర్రమంజిల్‌లోని తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ భవనంలో, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం (జలసౌధ) లలో రావు విగ్రహాలను రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించాడు. ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియాలో నీటిపారుదల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం నిర్వహించబడింది.[4]

మూలాలు

మార్చు
  1. Correspondent, Special (2018-04-29). "'Declare Vidyasagar Rao's birthday as Irrigation Day'". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2020-11-09. Retrieved 2022-11-14.
  2. "కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం". Archived from the original on 2016-06-16. Retrieved 2022-11-14. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "Welcome to Government Order Issue Register". Archived from the original on 2017-05-07. Retrieved 2022-11-14.
  4. Velugu, V6 (2020-11-14). "తుది శ్వాస వరకు తెలంగాణ సిద్ధాంతాన్ని,సంక్షేమాన్ని కోరుకున్న మహనీయుడు". V6 Velugu. Archived from the original on 2022-01-22. Retrieved 2022-11-14.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)