తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ
తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ, అనేది తెలంగాణ రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి, ఇంధన పరిరక్షణ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ.[1] పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ప్రోత్సాహక రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతోపాటు నిపుణులు, సాంకేతిక నిపుణులతో కలిసి వినియోగదారులకు అధిక పోటీ, సమర్థవంతమైన ఉత్పత్తులను అందించడానికి ఈ సంస్థ ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది.
స్థాపన | 2014 |
---|---|
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
కేంద్రీకరణ | పునరుత్పాదక శక్తి, ఇంధన పరిరక్షణ |
కార్యస్థానం | |
ముఖ్యమైన వ్యక్తులు | గుంటకండ్ల జగదీష్‌రెడ్డి (విద్యుత్ శాఖామంత్రి) వై. సతీష్ రెడ్డి (చైర్మన్) |
మాతృ సంస్థ | తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ |
జాలగూడు | అధికారిక వెబ్సైటు |
ఏర్పాటు
మార్చుఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 53 ప్రకారం 2014 మే 30న జీవో నం. 27, జీఈ నం. 25 ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయబడింది. కొత్త, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇంధన శక్తి శాఖ 2015 జూలై 3న జారీచేసిన జీవో నం.19 ప్రకారం, అన్ని శక్తి పరిరక్షణ కార్యక్రమాలను అమలు చేయడానికి నియమించబడిన ఏజెన్సీగా వ్యవహరించడానికి, మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ఈవి ఛార్జింగ్ స్టేషన్‌ను అమలు చేయడానికి, రాష్ట్ర నోడల్ ఏజెన్సీ కమ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరించడానికి ఈ సంస్థ ఏర్పాటయింది.[2]
లక్ష్యాలు
మార్చు- వికేంద్రీకృత పద్ధతిలో గాలి, సౌర వంటి పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం
- గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన శక్తిని పరిరక్షించడం
- సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగాలలో ఆచరణీయ సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల దిగుమతి, పోస్ట్ ఇన్స్టాలేషన్ సేవను అందించడం
- సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో శిక్షణ ఇవ్వడం, పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడం
కార్యక్రమాలు
మార్చు- సౌర శక్తి కార్యక్రమం
- బయోగ్యాస్, నేషనల్ బయోగ్యాస్ ఎరువు, నిర్వహణ కార్యక్రమం
- శక్తి పరిరక్షణ కార్యక్రమం
- పవన శక్తి
- బయోమాస్ శక్తి
సభ్యులు
మార్చుజనాబ్ సయ్యద్ అబ్దుల్ అలీమ్ ఈ సంస్థకు తొలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2022 జూన్ 21న తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ గా వై. సతీష్ రెడ్డిని నియమిస్తూ, తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీవో నంబరు 1273 ద్వారా ఉత్తర్వులు జారీచేశాడు. సతీష్ ఈ పదవిలో మూడేళ్ళపాటు కొనసాగుతాడు.[3][4] ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మ ఐఏఎస్, వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా ఎన్. జానయ్య, డైరెక్టర్లుగా జి. రఘుమా రెడ్డి, ఎ. గోపాల్ రావు, సి. శ్రీనివాసరావు ఐఆర్‌ఎఎస్, జె. శైలజ, బి. హరిరామ్ నియమించబడ్డారు.
కార్యకలాపాలు
మార్చుఈ సంస్థ ఆధ్వర్యంలో 2021, డిసెంబరు 11న హైదరాబాదులోని నెక్లేస్ రోడ్ లో విద్యుత్ వాహనాల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఇంధన శాఖా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, భారత ప్రభుత్వ బీఈఈడీ జీ అభయ్ బక్రే, రెడ్కో చైర్మన్ జనాబ్ సయ్యద్ అబ్దుల్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.[5][6]
పురస్కారాలు
మార్చుఇంధన పరిరక్షణ రంగంలో చేస్తున్న కృషికి గాను గ్రూప్ 2లోని రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకుంది. 32వ జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందించారు.[7][8]
మూలాలు
మార్చు- ↑ "TSREDCO - Telangana State Renewable Energy Development Corporation Ltd.,". tsredco.telangana.gov.in. Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-22.
- ↑ "TSREDCO - Telangana State Renewable Energy Development Corporation Ltd., (About)". tsredco.telangana.gov.in. Archived from the original on 2022-06-17. Retrieved 2022-06-22.
- ↑ telugu, NT News (2022-06-21). "ఆ రెండు కార్పొరేషన్ల చైర్మన్లు వీరే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన". Namasthe Telangana. Archived from the original on 2022-06-21. Retrieved 2022-06-22.
- ↑ "Telangana News: చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్ కుర్మాచలం". EENADU. 2022-06-21. Archived from the original on 2022-06-21. Retrieved 2022-06-22.
- ↑ "భవిష్యత్ విద్యుత్ వాహనాలదే: మంత్రి జగదీశ్ రెడ్డి". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2021-12-11. Archived from the original on 2021-12-11. Retrieved 2022-06-22.
- ↑ "భవిష్యత్ విద్యుత్ వాహనాలదే : మంత్రి జగదీష్ రెడ్డి". Prabha News. 2021-12-11. Archived from the original on 2021-12-11. Retrieved 2022-06-22.
- ↑ telugu, NT News (2022-12-14). "ఇంధన పరిరక్షణలో తెలంగాణకు మరో జాతీయ అవార్డు". www.ntnews.com. Archived from the original on 2022-12-14. Retrieved 2022-12-14.
- ↑ Kommuru, Jyothi (2022-12-14). "ఇంధన పరిరక్షణలో తెలంగాణకు మరో జాతీయ అవార్డు". www.hmtvlive.com. Archived from the original on 2022-12-14. Retrieved 2022-12-14.