ప్రధాన మెనూను తెరువు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014

కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం
హద్దులు మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు, లేదా తెలంగాణ బిల్లు) ను ప్రవేశపెట్టింది. ఈ బిల్లును జనవరి 30న ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు చేసినా[1], ఫిబ్రవరి మూడో వారంలో పార్లమెంటు ఆమోదించింది[2]. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ (ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి మరియు వరంగల్ జిల్లాలతో కూడుకున్నది), ఇంకా ఆంధ్రప్రదేశ్ (అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ లేదా కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో ఉన్నది) రాష్ట్రాలుగా విభజించవలసివచ్చింది.

2014 జూన్ 2 న అధికారికంగా విభజన జరిగి, రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. చాలా గొడవల నడుమ జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ, శ్రీ కృష్ణా కమిటి ఇచ్చిన నివేదికను కూడా చాలా వరకు విస్మరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును ప్రవేశపెట్టింది.

బిల్లు వివరాలుసవరించు

[3] తెలంగాణ బిల్లును మొదట 5 డిసంబర్, 2013 న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణకు పది జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ కు మిగిలిన పదమూడు జిల్లాలు ఉండాలి. తెలంగాణకు 119 ఎం.ఎల్.ఏ.లు, 40 ఎం.ఎల్.సీ.లు, 17 లొక్ సభ ఎం.పీ.లు, 7 రాజ్యసభ ఎం.పీ.లు ఉండాలి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పది సంవత్సరాలు వరకు ఉండవచ్చును. బిల్లును ఆమోదించిన 45 రోజులకు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ప్రకటించాలి. ఆంధ్రప్రదేశ్ కు 175 ఎం.ఎల్.ఏ.లు, 50 ఎం.ఎల్.సీ.లు, 25 లొక్ సభ ఎం.పీ.లు, 11 రాజ్యసభ ఎం.పీ.లు ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు ఏర్పడేంత వరకు హైదరాబాద్ హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది.

విభజన ఐన 60 రోజులలోగా, భారత నీటి వనరుల శాఖ, కృష్ణా గోదావరి నదుల నిర్వహణ కోసం కమిటీలను ఏర్పరిచి, ఏ నదిని ఎలా వాడుకోవాలో రెండు రాష్ట్రాలకు వివరంగా ఆదేశించాలి.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండడమే గాక, గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. 10 సంవత్సరాలు తరువాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించుకోవాలి.

పోలీస్ శిక్షణ శాఖ, ఆల్ ఇండియా సర్వీసెస్, ఇంకా అన్ని ఇతర శాఖలు, కొత్త రాజధాని ఏర్పాటు వరకు కలిసి ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధానిసవరించు

4 సెప్టెంబరు, 2014 న ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు[4]. అలాగే, జపాన్ ప్రతినిధులు రాజధాని నిర్మాణంలో చేయందించడానికి సిద్ధమని "ఎక్స్ప్లొరేటరీ మీటింగ్"లో తెలిపారు[5]

ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) నూతన రాజధానిగా అమరావతి ఎంపిక .. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసిఆర్డిఏ). భూమి పూజ .. శంకుస్థాపన... జరుగుతున్న నిర్మాణం ..

మూలాలుసవరించు

  1. "Andhra Pradesh assembly rejects the Bill for separate Telangana". IANS. Biharprabha News. Retrieved 30 January 2014.
  2. "On eve of GoM meet, Minister says Bill on Telangana is ready". 2 December 2013. Retrieved 2 April 2014. Cite news requires |newspaper= (help)
  3. http://reorganisation.ap.gov.in/downloads/APReorganisationBill.pdf
  4. "AP capital to come up in Guntur district". The Hindu.
  5. "Japan to help Andhra Pradesh develop new capital". Times of India.