తెలుగుతల్లి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సాహిత్యపరంగా తెలుగుతల్లి అంటే తెలుగు ప్రజల అమ్మగా చిత్రీకరించబడిన, ప్రజామోదం పొందిన చిహ్నం. తెలుగుతల్లి చాలా అందంగా చిరునవ్వుతో తెలుగు మహిళలకు అద్దం పట్టేలా ఉంటుంది.
తెలుగు నేల ఎల్లప్పుడు పచ్చదనంతో నిండి తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలుగు తల్లి ఆశిస్తున్నట్లుగా తన ఎడమ చేతిలో కోతకొచ్చిన పంట ఉంటుంది. కుడి చేతిలో ఉన్న కలశం తెలుగు ప్రజల జీవితాలు మంచి మనసుతో నిండుగా కలకాలం వర్థిల్లాలని, తెలుగు ప్రజలకు అవసరమైన వాటిని తెస్తున్నట్లుగా సూచిస్తుంది. ఈ దేవత తెలుగు వారి శైలిలో సాంప్రదాయ దుస్తులను ధరించి ఉంటుంది. తెలుగుతల్లిని ఆరాధించటం ద్వారా మానవాళికి అవసరమైన భాషా నైపుణ్యాలను అందిస్తుందని తెలుగు ప్రజలు భావిస్తారు, అందువలన తెలుగు ప్రజల జీవితాలలో తెలుగు తల్లికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అధికారిక గీతం మా తెలుగు తల్లి. ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి, 1942లో చిత్తూరు వుప్పలదడియం నాగయ్య నటించిన ధీన బంధు అనే తెలుగు చిత్రం కోసం ఈ గీతాన్ని వ్రాసారు. ఈ గీతం అత్యంత ప్రజాదరణ పొందటంతో చివరికి ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక గీతంగా చేశారు.
మా తెలుగు తల్లి గీతం
మార్చుమా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
- గల గలా గోదారి కదలి పోతుంటేను
- బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
- బంగారు పంటలే పండుతాయి
- మురిపాల ముత్యాలు దొరలు తాయి
- గల గలా గోదారి కదలి పోతుంటేను
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
- రుద్రమ్మ భుజ శక్తి
- మల్లమ్మ పతిభక్తి
- తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
- మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
- రుద్రమ్మ భుజ శక్తి
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
ఇవి కూడా చూడండి
మార్చుమా తెలుగు తల్లికి మల్లె పూదండ - ఆంధ్రప్రదేశ్ అధికారిక గీతం
శంకరంబాడి సుందరాచారి - మా తెలుగు తల్లి గీత రచయిత