తెలుగులో విద్యాబోధన
తెలుగు చదవడంలో రెండు ముఖ్య అంశాలున్నాయి.
(1) తెలుగును ఒక భాషగా చదవడం
(2) శాస్త్ర విజ్ఞానానది విషయాలను తెలుగులో చదవడం.
1964-66 నాటి కొఠారి కమిషన్ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969లో ఇంటర్మీడియట్ స్థాయిలో బోధనాభాషగా తెలుగును ప్రవేశపెట్టింది. 1971నుండి డిగ్రీ స్థాయిలో తెలుగు బోధనాభాష అయ్యింది. పాఠశాలల్లో మాతృభాష ద్వారా విద్యాబోధన జరపడానికి క్రింది అంశాలను ప్రాతిపదికగా గ్రహించాలని తెలుగు అకాడమి ప్రచురించిన "తెలుగు - బోధన పద్ధతులు" గ్రంథంలో పేర్కొన్నారు. అవి
- జ్ఞానార్జనకు మాతృభాష చక్కని పునాదిగా నిలిస్తుంది.
- విద్యార్థులు తమ మనోభావాలను వెల్లడంచడానికి మాతృభాష తోడ్పడినంతగా మరే ఇతర భాషా అనుకూలం కాదు.
- మాతృభాషాభిమానం దేశాభిమానానికి ప్రథమ సోపానం.
విషయ గ్రహణ చేసేందుకు పరభాష కంటే మాతృభాష సరైంది.
- వ్యక్తి వికాసానికి, కళాపోషణకు, సాహిత్యాభిరుచి, సృజనాత్మకత, వివేచనాశక్తి మొదలైన సామర్ధ్యాలు పెంపొందడానికి మాతృభాష తోడ్పడుతుంది.
వనరులు
మార్చు- ఈనాడు - ప్రతిభ - 2009 జనవరి 5 - డాక్టర్ ద్వానా శాస్త్రి వ్యాసం