తెలుగువీర లేవరా (పాట)

తెలుగు సినిమా పాట

తెలుగువీర లేవరా 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సినిమాలోని దేశభక్తి గీతం. దీనిని ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు రచించారు. భారత స్వాతంత్ర్య సమరస్పూర్తితో ఘంటసాల వెంకటేశ్వరరావు, వి.రామకృష్ణ బృందం ఈ గీతాన్ని చక్కగా ఆలపించారు. దర్శకుడు రామచంద్రరావు ఘట్టమనేని కృష్ణ, ఇతర నటులపై చిత్రీకరించారు.

"తెలుగువీర లేవరా"
Alluri Seetharamaraju.jpg
అల్లూరి సీతారామరాజు (సినిమా) పోస్టర్
సంగీతంఆదినారాయణరావు
సాహిత్యంశ్రీరంగం శ్రీనివాసరావు
ప్రచురణ1974
భాషతెలుగు
రూపందేశభక్తి గీతం

నేపథ్యంసవరించు

అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దొరతనాన్ని ఎదిరిస్తూ చేస్తున్న పోరాటానికి మన్యం ప్రజలను "తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా" అని పిలిచి, వారనుభవిస్తున్న కష్టాల్ని తెలియజేస్తాడు. వారినుండి పూజలందుకుంటాడు. అందుకు మన్యం ప్రజలంతా ఏకకంఠంతో సంఘీభావాన్ని తెలియజేస్తున్న సంఘటనను ఈ పాట ప్రతిబింబిస్తుంది. చివరగా వారంతా రాజుకు తోడుగా నిలుస్తామని బాస చేస్తారు.

పాటసవరించు

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా ||| తెలుగువీర లేవరా |||

దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా ||| దారుణ |||

నీతిలేని శాసనాలు నేటినుంచి రద్దురా ||| నీతిలేని |||

నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా ||| నింగి నీకు ||| ||| తెలుగువీర లేవరా |||

ఎవడువాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు ||| ఎవడువాడు |||

కండబలం, కొండఫలం కబళించే దుండగీడు

మానధనం, ప్రాణధనం దోచుకునే దొంగవాడు ||| ఎవడువాడు |||

తగినశాస్తి చేయరా తరిమి తరిమి కొట్టరా ||| తగినశాస్తి ||| ||| తెలుగువీర లేవరా |||

ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి ||| ఈ దేశం |||

ప్రతి మనిషీ తొడలుగొట్టి, శృంఖలాలు పగులగొట్టి

చురకత్తులు పదునుబట్టి, తుదిసమరం మొదలుపెట్టి

సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి వందేమాతరం ||| తెలుగువీర లేవరా |||

అవార్డులుసవరించు

బయటి లింకులుసవరించు