తెలుగు భాషలో ఆంగ్ల పదాలు

(తెలుగు భాషలో చేరుతున్న ఆంగ్ల పదాలు నుండి దారిమార్పు చెందింది)


పరిచయం

మార్చు

తెలుగుభాష అతి ప్రాచీనమైన ద్రావిడ భాష అయినప్పటికీ, అన్ని పెద్ద ద్రావిడ భాషలవలెనే చాలా వరకూ సంస్కృత పదాలతో ప్రభావితమయ్యింది. ఇప్పుడు ప్రపంచంలోని (భారతదేశంలోని భాషలతో సహా) చాలా భాషలవలెనే తెలుగు భాష కూడా ఆంగ్లభాషా ప్రభావానికి లోనవుతుంది. సాంఘికంగా ఆంగ్ల భాషాపదాలు కలిపి మాట్లాడటం గౌరవ ప్రదంగా భావించడం గత యాభై, నూరు సంవత్సరాల నుండి జరుగుతున్న ప్రక్రియ. గతంలో ఆంగ్ల భాష ఏ విధంగా ఫ్రెంచ్ భాషా ప్రభావానికి లోనైనదో (ఉదాహరణకు, పిగ్ అనేది నేటివ్ పదం అయితే ఫోర్క్ అనేది నార్మన్ ఫ్రెంచ్ పదం) అదే విధంగా తెలుగు గతంలో సంస్కృతం, ప్రాకృతం, పార్శీ, అరబిక్ ఇప్పుడు ఆంగ్ల భాషా ప్రభావాలకు లోనవుతోంది.

వాడుకలో ఉపయోగిస్తున్న పదాలు - వాడవలసిన విధానం

మార్చు
తెలుగు పదాలు తెలుగేతర పదాలు ఉదాహరణ పూర్తి తెలుగు ప్రత్యామ్నాయం
అమ్మ, నాన్న మమ్మీ, డాడి మా మమ్మీ మార్కెట్ కి వెళ్ళింది. మా డాడీ యింటిలో లేరు. డ్యూటీకి వెళ్ళారు. మా అమ్మ బజారుకు వెళ్ళింది. మా నాన్న యింటిలో లేరు. ఉద్యోగ నిర్వహణకు వెళ్ళారు.
కూర కర్రీ ఈ రోజు నీ కర్రీ ఏంటి? మీ మమ్మీ ఏం కర్రీ చేసింది? ఈ రోజు కూర ఏమిటి? మీ అమ్మ ఏం కూర చేసింది?
పూర్తి కంప్లీట్ హోం వర్క్ కంప్లీట్ చేశావా? ఇంటి పని పూర్తి చేసావా?
ఉదయం మార్నింగ్ రేపు మార్నింగ్ కలుద్దాం. రేపు ఉదయం కలుసుకుందాం.
శుభోదయం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టీచర్ ఉపాధ్యాయులకు శుభోదయం
మధ్యాహ్నం ఆప్టర్ నూన్ టుమారో ఆప్టర్ నూన్ మా యింటికి రా! రేపు మధ్యాహ్నం మాయింటికి రా.
శుభ మధ్యాహ్నం గుడ్ ఆప్టర్ నూన్ గుడ్ ఆప్టర్ నూన్ సర్ శుభ మధ్యాహ్నం అయ్యా!
సాయంత్రం ఈవినింగ్ ఈ రోజు ఈవినింగ్ సినిమాకు వెళదాం. ఈ రోజు సాయంత్రం చలనచిత్రానికి వెళదాం.
శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మాడం. శుభ సాయంత్రం అమ్మా!
రాత్రి నైట్ ఈ నైట్ కి వర్క్ పూర్తి చేద్దాం ఈ రాత్రికి పని పూర్తి చేద్దాం
మంగలి బార్బర్ బార్బర్ దగ్గరికి హైర్ కటింగ్ కి వెళుతున్నావా? మంగలి వానిదగ్గరకు క్షవరమునకు వెళుతున్నావా?
కొట్టు షాప్ ఈ దగ్గరలో పాన్ షాపు ఉన్నదా? ఈ దగ్గరలో కిల్లీ కొట్టు ఉన్నదా?
మౌఖిక పరీక్ష ఓరల్ టెస్ట్ రానున్న మండే నాకు ఓరల్ టెస్ట్ ఉంది. రానున్న సోమవారం మౌఖిక పరీక్ష ఉంది.
పరిపుచ్ఛ ఇంటర్వ్యూ రేపు ఇంటర్వ్యూ ఉంది. రేపు పరిపుచ్ఛ ఉంది.
రాత పరీక్ష రిటెన్ టెస్ట్ సాటర్ డే రిటెన్ టెస్ట్ కు అటెండ్ కావాలి. శనివారం రాత పరీక్షకు హాజరు కావాలి.
గుడి టెంపుల్ ప్రతిరోజూ నేను టెంపుల్ కి వెళ్తాను. ప్రతి రోజూ నేను గుడికి వెళ్తాను.
విమానం ప్లైట్ ప్రైమ్‌ మినిస్టర్ ప్లైట్ లో అండమాన్ ఐలాండ్ కు వెళ్ళారు. ప్రధానమంత్రి విమానంలో అండమాన్ ద్వీపానికి వెళ్ళారు.
భాగ నికష యూనిట్ టెస్ట్ రేపటి నుండి యూనిట్ టెస్ట్ ఉన్నది రేపటి నుండి యూనిట్ నికష ఉంది.
పూటకూళ్ళ యిల్లు రెస్టారెంట్ ఈ రోజు లంచ్ రెష్టారెంట్ లో చేస్తాము. ఈ రోజు మధ్యాహ్న భోజనం పూటకూళ్ళ యింటిలో చేస్తాము.
అసాధ్యం ఇంపోజిబుల్ ఈ వర్క్ చేయుట ఇంపాజిబుల్. ఈ పని చేయుట అసాధ్యము.
గోప్యత, రహస్యం సీక్రెట్ కొన్ని సీక్రెట్స్ అదర్స్ కు తెలియరాదు. కొన్ని రహస్యాలను యితరులకు తెలియరాదు.
దృశ్యం వ్యూ ఆ హిల్ మీదినుండి చూస్తే మంచి వ్యూ కనబడుతుంది. ఆ కొండమీదినుండి చూస్తే దృశ్యం బాగుంటుంది.
తారీఖు డేట్ ఈ రోజు డేట్ ఎంత? ఈ రోజు తారీఖు ఎంత?
ఖరీదు రేట్ ఈ వైట్ పేపర్ బుక్ రేట్ ఎంత? ఈ తెల్ల కాగితముల పుస్తకము వెల ఎంత?
పైకప్పు పంఖా సీలింగ్ ఫ్యాను ఈ సీలింగ్ ఫ్యాను ఏ కంపెనీది? ఈ పైకప్పు పంఖా ఏ వ్యాపార సంస్థది?
దూరవాణి టెలిఫోన్ ఈ రోజు మా అంకుల్ నుండి ఫోన్ వచ్చింది. ఈ రోజు మా చిన్నాన్న/మేనమామ నుండి దూరవాణి వచ్చింది.
తంతి టెలిగ్రాం అర్జెంటుగా రమ్మని టెలిగ్రాం వచ్చింది. వెంటనే రమ్మని తంతి వచ్చింది.
నీళ్ళు వాటర్ ఈ వాటర్ బాటిల్ రేటు ఎంత? ఈ నీళ్ళ బుడ్డి ధర ఎంత?
మేడ, భవనం బిల్డింగ్ ఈ బిల్డింగ్ లో ఎవరు ఉంటారు? ఈ భవనంలో ఎవరు ఉంటారు?
ఆలోచన ఐడియా నాకు న్యూ ఐడియాలు వస్తూ ఉంటాయి. నాకు క్రొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి.
స్పందన రెస్పాన్స్ ఈ వ్యాసం పై మీ రెస్పాన్స్ ని టాక్ పేజీలో తెలియ జేయండి. ఈ వ్యాసం పై మీ స్పందనను చర్చా పుటలో తెలియజేయండి.
ఆలస్యం డిలే ఈ వర్క్ చాలా డిలే అవుతున్నది. ఈ పని చాలా ఆలస్యం అవుతున్నది.
దిండు పిల్లో నేను పిల్లో లేకుండా నిద్రపోలేను. నేను తలగడ లేకుండా నిద్రపోలెను.
పండు, ఫలము ఫ్రూట్ హెల్త్ కోస్ం డైలీ ఫ్రూట్స్ తినాలి. ఆరోగ్యం కోసం ప్రతి దినం పండ్లు తినాలి.
నిజ జీవితం డైలీ లైఫ్ మీ డైలీ లైఫ్ లో యూజ్ చేసే ఇంగ్లీషు వర్డ్స్ ఈ పేజీలో ఎంటర్ చేయండి. మీ నిజ జీవితంలో ఉపయోగించే ఆంగ్ల పదాలను ఈ పుటలో చేర్చండి
మాతృభాష మదర్ టంగ్ మదర్ టంగ్ లో మాట్లాడటం మన రెస్పాన్సిబిలిటీ. మాతృభాషలో మాట్లాడటం మన బాధ్యత.
పెందలకడనే ఎర్లీ రేపు ఎర్లీగా నిద్రచేచి మోర్నింగ్ వాక్ కు వెళ్తాను. రేపు పెందలకడనే నిద్రలేచి ఉదయం నడకకు వెళ్తాను.
దంతధావనం బ్రష్ రోజూ మోర్నింగ్ బ్రష్ చేసుకోండి. రోజూ ఉదయం దంతాలను శుభ్రం చేసుకోండి.
పాఠశాల స్కూల్ ఈ రోజు స్కూల్ లో కల్చరల్ ప్రోగ్రాం ఉంది. ఈ రోజు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి.

లంకెలు

మార్చు